OTT: ప్రైమ్ వీడియోలో సమంత.. నెట్ ఫ్లిక్స్ లో ఎన్టీఆర్.. రికార్డుల మోత మోగిస్తున్నారుగా
ఈ మధ్య కాలంలో పలు భారీ సినిమాలు మాత్రమే కాకుండా ఆడియెన్స్ ని అలరించేందుకు ఓటిటిలలో కూడా పలు క్రేజు కంటెంట్ లని కూడా చాలా సంస్థలు తీసుకొస్తున్నారు. కాగా అలా మన ఇండియన్ ఎంటర్టైన్మెంట్ రంగంలో పలు పాపులర్ సంస్థలకి మన టాలీవుడ్ స్టార్ ల సినిమాలు వెబ్ సిరీస్ లు కూడా వస్తుండగా రీసెంట్ గా వచ్చిన ఓ సినిమా అండ్ వెబ్ సిరీస్ లు ఇప్పుడు గ్లోబల్ వైడ్ గా దుమ్ము లేపుతున్నాయి.
కాగా మన తెలుగు సినిమా దగ్గర టాప్ హీరో అండ్ హీరోయిన్స్ లో జూనియర్ ఎన్టీఆర్ అలాగే పాన్ ఇండియా హాట్ బ్యూటీ సమంత కూడా ఒకరు. కాగా ఈ ఇద్దరూ కూడా కలిసి సినిమాలు కూడా చేశారు. కానీ రీసెంట్ గా తమ సినిమా వెబ్ సిరీస్ లతో అయితే ఓటిటి ఆడియెన్స్ ని అలరించేందుకు వచ్చారు.

కాగా సమంత బాలీవుడ్ స్టార్ హీరో వరుణ్ ధావన్ కాంబినేషన్ లో చేసిన స్పై యాక్షన్ థ్రిల్లర్ సిరీస్ "సిటాడెల్ హనీ బన్నీ" అమెజాన్ ప్రైమ్ వీడియోలో మేకర్స్ ఏకంగా 17 భాషలకి పైగా తీసుకొచ్చారు. అయితే సిటాడెల్ కి ఇతర భాషల్లో కూడా మంచి ప్రాచుర్యం ఉంది. పైగా దీనిని హాలీవుడ్ దర్శకులు రస్సో బ్రదర్స్ డెవలప్ చేసింది కాబట్టి ఇండియన్ వెర్షన్ కి కూడా మంచి బజ్ నెలకొనగా మొన్న నవంబర్ 7న అయితే ఈ సిరీస్ ప్రైమ్ వీడియోలో వచ్చింది.
కాగా ఈ సిరీస్ ఇపుడు ఓటిటిలో దుమ్ము లేపుతుంది. ఒక్క ఇండియా లోనే కాకుండా ప్రైమ్ వీడియో గ్లోబల్ వైడ్ గా నెంబర్ 1 స్థానంలో భారీ వ్యూవర్ షిప్స్ ని అందుకున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఈ సిరీస్ తర్వాత మ్యాన్ ఆఫ్ మాసెస్ రీసెంట్ బిగ్ హిట్ "దేవర" కూడా వచ్చింది. కాగా ఈ చిత్రాన్ని పాపులర్ స్ట్రీమింగ్ యాప్ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకోగా ఇందులో దేవర నాలుగు భాషల్లో వచ్చింది.
కాగా ఈ నాలుగు భాషల్లో కూడా దేవర ఇండియన్ వైడ్ గా నెంబర్ 1 స్పాట్ లోకి ఒక్క రోజులోనే వచ్చేయగా గ్లోబల్ గా అయితే నాన్ ఇంగ్లీష్ సినిమాల జాబితాలో టాప్ 6 లో అనేక ఇతర భాషాల సినిమాల సరసన నిలిచింది. అది కూడా కేవలం ఈ కొన్ని రోజుల్లోనే 2.2 మిలియన్ వ్యూస్ ని దేవర క్రాస్ చేయడం విశేషం.
అయితే ఇది ఇటీవల కాలంలో నెట్ ఫ్లిక్స్ లో ఏ తెలుగు సినిమా కూడా అందుకోని రికార్డు మొత్తం అన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇలా ఒకరోజు తేడాతో వచ్చినా కూడా ఈ ఇద్దరు బిగ్గెస్ట్ స్టార్స్ సినిమా, వెబ్ సిరీస్ లు ఓటిటిని షేక్ చేశాయని చెప్పి తీరాలి. ఇక దేవర సినిమాని దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించగా సిటాడెల్ ని రాజ్ అండ్ డీకే లు తెరకెక్కించారు.


Click it and Unblock the Notifications











