OTT: పాపులర్ దర్శకునితో సమంత భారీ వెబ్ సిరీస్.. ఏ ఓటిటిలో అంటే?
డెఫినెట్ గా ఇండియన్ సినిమా నుంచి వచ్చిన కొన్ని అండర్ రేటెడ్ జెమ్ చిత్రాల్లో మరాఠీ చిత్రం "తుంబాడ్" అనే సినిమా కోసం అందరికీ తెలిసి ఉండకపోవచ్చు కానీ మూవీ లవర్స్ లో ఎవరిని అడిగినా ఆ సినిమా గొప్పతనం కోసం ప్రత్యేకంగా చెప్పుకుంటారు. మన ఇండియన్ సినిమా దగ్గరే ఒక పాత్ బ్రేకింగ్ సబ్జెక్టుగా ఇది వచ్చింది. కానీ అప్పట్లో థియేటర్స్ లో ప్లాప్ గానే మిగిలిపోయింది.
మన తెలుగు సినిమా దగ్గర త్రివిక్రమ్ మహేష్ బాబు సినిమాలకి ఎలాగైతే థియేటర్స్ లో ప్లాప్ అయ్యి టీవీల్లో ఓటిటిలలో వచ్చాక క్లాసిక్ టాక్ తెచ్చుకుంటాయో అంతకు మించిన ఆదరణ ఈ చిత్రానికి ఓటిటిలో వచ్చింది. మరి ఇలాంటి ఒక జెమ్ లాంటి సినిమాని అందించిన దర్శకుడు ఎవరు ఏంటి? తన తదుపరి ప్రాజెక్ట్ లు ఏంటి అనేవి కూడా చాలా ఆసక్తిగా మారుతాయి. ఆ అద్భుతాన్ని దర్శకుడు రాహి బర్వె అనీల్ తెరకెక్కించారు.

మరి ఈ దర్శకుడు అప్పుడు ఆ సినిమా చేయడానికే ఎన్నో ఏళ్ళు సమయాన్ని తీసుకున్నాడు. ఇక ఈ సినిమా తర్వాత ఇప్పుడు ఓటిటిలో సత్తా చాటేందుకు సిద్ధం అయ్యాడు. కాగా గత కొన్నాళ్ల నుంచి పాన్ ఇండియా హీరోయిన్ సమంత రీఎంట్రీలో భారీ ఓటిటి సిరీస్ కూడా చేస్తుంది అని టాక్ వచ్చింది కదా అది ఈ దర్శకుని సిరీస్ తోనే అట. కాగా ఇందులో కూడా సమంత తన హాట్ షేడ్ గట్టిగా చూపిస్తుంది అని టాక్ ఉంది.
ఇక దీనితో పాటుగా సిరీస్ ఒక పీరియాడిక్ జానర్ లో తెరకెక్కిస్తున్నట్టుగా తెలుస్తుంది. అంటే మళ్ళీ మైథలాజి సెటప్ లోనే అనీల్ రాబోతున్నాడని చెప్పాలి. అంతే కాకుండా ఫ్యూచర్ కి సంబంధించి కూడా సన్నివేశాలు ఉంటాయని కొన్ని గాసిప్స్ వినిపిస్తున్నాయి. కాగా ఈ సిరీస్ ని ఏ ఓటిటి ప్లాట్ ఫామ్ వారు బ్యాక్ రోల్ చేస్తున్నారో కూడా వినిపిస్తుంది. ఈ సిరీస్ ని వరల్డ్ నెంబర్ 1 ఓటిటి యాప్ నెట్ ఫ్లిక్స్ వారు సొంతం చేసుకున్నారట.

రానున్న కొన్ని నెలల్లో షూటింగ్ మొదలు పెట్టుకోనున్న ఈ సిరీస్ భారీ బడ్జెట్ తో ప్లాన్ చేస్తున్నారట. కాగా ఈ సిరీస్ కి సమంత బోల్డ్ సిరీస్ దర్శకుడు రాజ్&డీకే లు నిర్మాణం వహిస్తుండగా నటుడు ఆదిత్య రాయ్ కపూర్ సరసన సమంత కనిపించే అవకాశం ఉందని తెలుస్తుంది. మరి వీరిద్దరి నడుమ మంచి బోల్డ్ సీన్స్ కూడా ఉంటాయని టాక్.
ఇక ఈ సిరీస్ కి ఒక ఆసక్తికర టైటిల్ ని పరిశీలిస్తున్నారని వినిపిస్తునుంది. నిజానికి ఒకటి కాదు రెండు టైటిల్స్ వినిపిస్తున్నాయి. ఒకటి రక్తబీజ్, మరొకటి రక్త బ్రహ్మాండ్ అట. వీటితో అయితే సిరీస్ ఏ తరహాలో ఉంటుందో కూడా అర్ధం చేసుకోవచ్చు. ప్రస్తుతం అయితే ఈ సిరీస్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.


Click it and Unblock the Notifications











