Samantha: సమంతకు భారీ రెమ్యునరేషన్.. బాలీవుడ్ టాప్ డైరెక్టర్ వెబ్ సీరిస్‌కు ఊహించిన పారితోషికం

ఇప్పుడు ఇండియన్ సినిమా దగ్గర కొందరు స్టార్ హీరో లకి ఆయా సినీ పరిశ్రమల్లో ఎలా అయితే మంచి డిమాండ్ అండ్ క్రేజ్ లు ఉన్నాయో వీరి తరహా లోనే కొందరు హీరోయిన్స్ కి కూడా సాలిడ్ డిమాండ్ ఉంటుంది. అయితే ఆ స్టేజి వరకు రావడానికి అటు హీరో అయినా హీరోయిన్స్ అయినా కూడా చాలా కష్టపడితే కానీ జరిగే ఛాన్స్ లేదా ఇలా పలువురు హీరోలు వందల కోట్ల రెమ్యునరేషన్ లు తీసుకుంటున్నారు.

కొందరు హీరోయిన్స్ ఒకో సినిమాకి 20 కోట్లకి పైగా డిమాండ్ చేస్తున్నారు. అయితే ఇక్కడ పాన్ ఇండియా స్టార్ హీరోయిన్ సమంత రూటు వేరేగా ఉన్నట్టుగా కొన్ని గాసిప్స్ వినిపిస్తున్నాయి. సమంత తన సినిమా ఇంకా వెబ్ సిరీస్ ల కెరీర్ కి ఏడాది మేర గ్యాప్ ఇచ్చి తన మాయోసైటిస్(కండరాల వ్యాధి) కి ట్రీట్మెంట్ ని తీసుకుంది. ఇక ఇలా తీసుకుంటూ చివరి స్టేజ్ కి వచ్చేసరికి మళ్ళీ తన సినిమా అండ్ ఓటిటి ఎంట్రీని గట్టిగానే ప్లాన్ చేసుకుంది.

samantha Ruth Prabhu remuneration for rakt bramhand web series

కాగా ఈ రీఎంట్రీలో ఒక సెన్సేషనల్ వెబ్ సిరీస్ ని కూడా ఆమె ఓకే చేసింది. కాగా ఇండియన్ సినిమా దగ్గర ఒక జెమ్ అయినటువంటి చిత్రం "తుంబాడ్" దర్శకుడు రాహి అనిల్ బార్వే తెరకెక్కించనున్న క్రేజీ వెబ్ సిరీస్ "రక్త బ్రహ్మాండ్" లో సమంత కనిపించనుంది. మరి ఈ సిరీస్ కి అయితే ఆమె భారీ మొత్తంలో రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నట్టుగా కొన్ని ఊహాగానాలు ఇప్పుడు వినిపిస్తున్నాయి.

కాగా దీనికి ముందు సమంత నటించిన యాక్షన్ అండ్ స్పై థ్రిల్లర్ వెబ్ సిరీస్ "సిటాడెల్" కే తాను 10 కోట్లకి పైగా ఛార్జ్ చేసినట్టుగా టాక్ ఉండగా ఇపుడు దీనికి అంతకు మించే డిమాండ్ చేసిందట. ఇలా ఈ రక్త బ్రహ్మాండ్ సిరీస్ కి సమంత మొత్తంగా 15 కోట్లు పారితోషికం తీసుకుంటుందట. దీనితో సమంతకి ఉన్న డిమాండ్ ఏ లెవెల్లో ఉందో మనం అర్ధం చేసుకోవచ్చు.

samantha Ruth Prabhu remuneration for rakt bramhand web series

అయితే సామ్ ఎక్కువ చెప్పడానికి గల కారణాల్లో ఈమె ఈ సిరీస్ లో చాలా హార్డ్ వర్క్ చేయాల్సి ఉంటుంది అని తెలుస్తుంది. యాక్షన్ సీన్స్ తో పాటుగా తనపై చాలా బోల్డ్ సన్నివేశాలు కూడా దండిగానే ఉంటాయట. అందుకే సమంత అంత మొత్తంలో చెప్పినట్టుగా పుకార్లు వినిపిస్తున్నాయి. కానీ ఇది మాత్రం కొందరు మిడ్ రేంజ్ హీరోస్ రెమ్యునరేషన్ కి సమానం అని కూడా చెప్పాలి.

ఇలా మొత్తంగా ఐతే గ్యాప్ వచ్చినప్పటికీ కూడా సమంత మార్కెట్ ఏమాత్రం చెక్కు చెదరలేదని కూడా చెప్పాలి. ఇక ఈ సిరీస్ లో సమంతకి జోడిగా మీర్జాపూర్ ఫేమ్ నటుడు అలీ ఫజల్ నటించనుండగా వీరితో పాటుగా ఆదిత్య రాయ్ కపూర్ ఇంకా బాలీవుడ్ హాట్ బ్యూటీ వామిక గబ్బి కూడా ప్రధాన తారాగణంగా కనిపించనున్నారు. మరి ఈ సిరీస్ కాకుండా సమంత మరిన్ని క్రేజీ ప్రాజెక్ట్ లు తెలుగు సహా తమిళ్, మలయాళ భాషల్లో చేస్తూ పక్కా పాన్ ఇండియా రీఎంట్రీ ప్లాన్ చేసుకుంటుంది. మరి వీటిలో అధికారికంగా కొన్ని అనౌన్స్ కావాల్సి ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X