Shaakuntalam OTT: ఓటీటీలోకి రావడానికి సిద్ధమైన శాకుంతలం.. స్ట్రీమింగ్ ఎందులో అంటే..
సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన 'శాకుంతలం' చిత్రాన్ని అగ్ర నిర్మాత దిల్ రాజు సమర్పించిన విషయం తెలిసిందే. గుణశేఖర్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిన ఈ మూవీ ఏప్రిల్ 14వ తేదీన విడుదల అయింది. ఫుల్ నెగెటివ్ టాక్ రావడంతో రెండో రోజునే థియేటర్లకు వచ్చే వాళ్ల సంఖ్య సగానికి సగం తగ్గింది. దీంతో సినిమా డిజాస్టర్ గా నిలిచింది. ఇక ఈ సినిమా ఓటీటీ రిలీజ్ కు సిద్ధమైనట్లు సమాచారం. ఆ వివరాల్లోకి వెళితే..
అన్ని అంశాలు సినిమాలో ఉన్నప్పటికీ :ఈ చిత్రం పౌరాణిక నేపథ్యంతో ఆకర్షణీయమైన రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కింది. అన్ని అంశాలు సినిమాలో ఉన్నప్పటికీ.. అసమర్థమైన కథనం, సున్నా భావోద్వేగాలు చిత్రాన్ని నాశనం చేశాయి. అందువల్లే సినిమా ఆడకుండా పోయింది. ఏ ఒక్కరూ కనెక్ట్ కాలేకపోయారు. అయితే సినిమా విడుదలైన 15 రోజుల్లోనే చాలా ప్రాంతాల్లో షోలు లేకపోవడంతో సినిమాను దాదాపుగా తీసేశారు.

భారీ బడ్జెట్ తో నిర్మాణం : శాకుంతలం సినిమాను గుణశేఖర్ తో పాటు దిల్ రోజు సంయుక్తంగా నిర్మించిన విషయం తెలిసిందే. తప్పకుండా సక్సెస్ అవుతుంది అనుకున్న ఈ సినిమా కోసం దాదాపు 40 నుంచి 50 కోట్ల మధ్యలో ఖర్చు చేసినట్లుగా తెలుస్తోంది. నిర్మాత గుణశేఖర్ అయితే దాదాపు 80 కోట్ల వరకు ఖర్చు అయింది అని చెప్పారు. కానీ ఆ రెంజ్ లో ఖర్చు అయ్యి ఉండదు అని టాక్ ఎక్కువగా వచ్చింది. ఫైనల్ గా సినిమా అయితే నిర్మాతలకు చాలా దారుణమైన నష్టాలను కలిగించింది.

దారుణమైన నష్టాలు : సినిమాకు భారీగానే నష్టాలు వాటిల్లినట్లు అర్థం అవుతోంది. దాదాపు 12 నుంచి 13 కోట్ల మేర నష్టాలు వచ్చినట్లు సమాచారం. శకుంతల, దుష్యంతుల ప్రేమ కథ, కాళిదాసు రచించిన శకుంతల పరిణయం ఆధారంగా 'శాకుంతలం' సినిమా తెరకెక్కింది. గుణ శేఖర్ డైరెక్షన్ చేస్తూ నిర్మించారు. అయితే అపురూప దృశ్య కావ్యంగా పేరుగాంచిన శకుంతల పరిణయం కథను మంచి వీఎఫ్ఎక్స్ తో, మంచి స్క్రీన్ ప్లేతో ఆకట్టుకోవాల్సిందని ఇండస్ట్రీ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఓటీటీలోకి వచ్చేది ఎప్పుడంటే : ఈ క్రమంలోనే ఈ సినిమాకు సంబంధించిన ఓ లేటెస్ట్ అప్ డేట్ వెలుగులోకి వచ్చింది. అదేంటంటే.. సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యేందుకు సిద్ధం అవుతోంది. ఈ సినిమా డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ కొనుగోలు చేసుంది. ఈ చిత్రం మే 12వ తేదీ నుంచి అమెజాన్ వేధికగా స్ట్రీమింగ్ కాబోతుంది. మరి ఓటీటీల విడుదల కావడానికి సిద్ధంగా ఉన్న ఈ సినిమాకి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో వేచి చూడాలి.

స్టార్ క్యాస్ట్ తో వచ్చిన శాకుంతలం : ఈ చిత్రంలో దేవ్ మోహన్ రాజు దుష్యంత్ పాత్రను పోషించగా.. అదితి బాలన్, అల్లు అర్హ, వర్ణిణి సౌందరరాజన్, కబీర్ సింగ్ దుహా ముఖ్య పాత్రలు పోషించారు. అలాగే ఈ సినిమాలో నట ప్రపూర్ణ డాక్టర్ మంచు మోహన్ బాబు కూడా నటించారు. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించగా.. సాయి మాధవ్ బుర్రా రచనా సహకారం అందించారు. అయితే ఈ సినిమాలో సామ్ ను శకుంతలగా చూపించేందుకు గుణ శేఖర్ ఎంతగానో కష్టపడ్డారు.


Click it and Unblock the Notifications











