OTT: ఎట్టకేలకు ఓటీటీలోకి సమంత వెబ్ సిరీస్.. స్పై, థ్రిల్లర్ రిలీజ్ ఎప్పుడు? ఎక్కడంటే?

ప్రస్తుతం పాన్ ఇండియా వైడ్ గా మంచి బిజీగా ఉన్న స్టార్ హీరోయిన్స్ లో సౌత్ హాట్ బ్యూటీ సమంత కూడా ఒకరు. కాగా సమంత ఇప్పుడు చాలా కాలం గ్యాప్ తీసుకొని తన రీఎంట్రీని గ్రాండ్ గా ప్లాన్ చేసుకుంటుంది. కాగా ఈ రీఎంట్రీలో మాత్రం సమంత మళ్ళీ పాన్ ఇండియా లెవెల్ కంటెంట్ తో కొట్టేందుకు రాబోతుంది అని చెప్పాలి.

తెలుగు సహా దాదాపు అన్ని పాన్ ఇండియా భాషల్లో సమంత రీఎంట్రీని ఫిక్స్ చేసుకోగా రీసెంట్ గానే తనది భారీ సిరీస్ మరాఠి దర్శకుడు "తుంబాడ్" ఫేమ్ రాహి అనీల్ బార్వే తో సిరీస్ ప్లాన్ చేస్తుండగా దీనికి ముందు సమంత నటించిన మరో సిరీస్ కూడా ఉంది. అదే "సిటాడెల్". ఒరిజినల్ గా నటి ప్రియాంక చోప్రా నటించిన అమెరికన్ సిరీస్ "సిటాడెల్" కి రీమేక్ గా ఇండియన్ వెర్షన్ లో "సిటాడెల్ - హనీ బన్నీ" సమంత నటించిన సిరీస్ రాబోతుంది.

samantha Ruth Prabhu s Most awaiting web series citadel ott release date locked

కాగా ఈ సిరీస్ ని కూడా సమంత ఓటిటి డెబ్యూ ఇచ్చిన "ది ఫ్యామిలీ మ్యాన్ 2" దర్శకుడు రాజ్ మరియు డీకే లే తెరకెక్కించారు. అయితే ఎప్పుడో గత రెండేళ్ల కితమే అనౌన్స్ చేసిన ఈ సిరీస్ ఇంతకీ రాదు అంతకీ రాదు. దీనితో ఈ సిరీస్ ని నిలిపేశారు అని చాలా మంది అనుకున్నారు. కానీ గత కొన్ని నెలలు కితమే ఆగిపోలేదు సిరీస్ ఆన్ లోనే ఉందని సమంత కన్ఫర్మ్ చేసింది.

కాగా ఇప్పుడు ఫైనల్ గా ఈ సిరీస్ రిలీజ్ ఎప్పుడు అనేది రివీల్ అయ్యింది. అయితే ఈ డేట్ కి ముందు ఒక స్లో స్టార్ట్ తో సింపుల్ మూమెంట్స్ తో మొదలయ్యి ఉత్కంఠభరిచే యాక్షన్ అంశాలతో కనిపించే టీజర్ ని ప్రైమ్ వీడియో వారు విడుదల చేసారు. ఇందులో సమంత, ఇంకా బాలీవుడ్ నటుడు వరుణ్ ధావన్ లు సీక్రెట్ స్పై లుగా కనిపిస్తున్నారు. ఇంకా ఇద్దరి మధ్య పోరాటాలు, రొమాన్స్ ఎలిమెంట్స్ కూడా గట్టిగానే ఉన్నట్టు కనిపిస్తున్నాయి.

samantha Ruth Prabhu s Most awaiting web series citadel ott release date locked

వీటితో ఫైనల్ గా ఈ సిరీస్ ని ఈ ఏడాది నవంబర్ 7న అందుబాటులోకి తీసుకొస్తున్నట్టుగా నేడు ఓ గ్రాండ్ ఈవెంట్ జరిపి ఆ టీజర్ పాటుగా రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేస్తూ స్ట్రీమింగ్ సంస్థ అమెజాన్ ప్రైమ్ వారు ఎట్టకేలకి గత కొన్నాళ్ల నుంచి ఉన్న సస్పెన్స్ ని రివీల్ చేశారు. సో ఈ క్రేజీ స్పై యాక్షన్ థ్రిల్లర్ ని చూడాలి అనుకుంటే మాత్రం ఈ నవంబర్ వరకు ఆగాల్సిందే అని చెప్పాలి. అయితే ఈ టీజర్ లో ఆసక్తికర అంశం ఏమిటంటే దర్శకులు ఒరిజినల్ సిరీస్ ని ఇండియన్ వెర్షన్ కి అడాప్ట్ చేసిన విధానం బాగుంది.

చాలా మార్పులు చేర్పులు చేసినట్టుగా కనిపిస్తుంది. ఒకవేళ దీనికంటే ముందు ఒరిజినల్ సిరీస్ ని చూడాలి అనుకునేవారు అయితే ఇదే అమెజాన్ ప్రైమ్ వీడియోలోనే అది కూడా తెలుగులో కూడా అందుబాటులోకి ఉంది చూడాలి అనుకునేవారు కంటెంట్ కోసం ముందే చూడొచ్చు. కాగా ఈ సిరీస్ ని హాలీవుడ్ దర్శకుడు అవెంజర్స్ సినిమాలు ఫేమ్ రస్సో బ్రదర్స్( జో రస్సో, ఆంటోనీ రస్సో) లు నిర్మాణం వహించారు. ఇండియన్ వెర్షన్ కూడా వారి సమర్పణలోనే వస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X