OTT: ఎట్టకేలకు ఓటీటీలోకి సమంత వెబ్ సిరీస్.. సిటాడెల్ రిలీజ్ ఎప్పుడంటే?
తెలుగు సినిమా దగ్గర భారీ స్టార్డం తెచ్చుకున్న టాలెంటెడ్ హీరోయిన్స్ లో స్టార్ బ్యూటీ సమంత కూడా ఒకామె కాగా కెరీర్ ని సెకండ్ హీరోయిన్ స్థాయి నుంచి స్టార్ట్ చేసినప్పటికీ తన కో స్టార్స్ ని మించి ఇప్పుడు సమంత పాన్ ఇండియా మార్కెట్ వరకు వెళ్లగలిగింది. మరి ఇలా ఇప్పుడు ఇండియన్ సినిమా దగ్గర టాప్ మోస్ట్ హీరోయిన్స్ లో ఒక హీరోయిన్ గా సమంత నటిస్తుండగా మధ్యలో అక్కినేని యువ హీరో నాగ చైతన్యతో తనకి పెళ్లి కావడం ఆ తర్వాత విడిపోవడం కూడా జరుగాయి.
అయితే ఈ విడాకులు తర్వాతే సమంత తన హెల్త్ విషయంలో అందరికీ షాకిచ్చింది. మాయోసైటిస్ అనే కండరాల సంబంధిత వ్యాధి తనకి ఉన్నట్టుగా రివీల్ చేసి దానికి సుమారు రెండున్నరేళ్ల పాటుగా చికిత్స తీసుకుంటూ వచ్చింది. ఈ సమయంలోనే పలు సినిమాలు, వెబ్ సిరీస్ లు కూడా చేసిన సామ్ వాటికి బ్రేక్ ఇచ్చి పూర్తిగా ట్రీట్మెంట్ తీసుకోవాలని డిసైడ్ అయ్యింది.

అయితే తన ట్రీట్మెంట్ కి ముందే ఆమె ఓకే చేసిన పలు సినిమాలు వెబ్ సిరీస్ కూడా ఆమె పూర్తి చేసేసి తనని నమ్ముకున్న ప్రొడ్యూసర్స్ కి ఎలాంటి అన్యాయం చేయలేదు. కాగా అలా ఆమె పూర్తి చేసిన వెబ్ సిరీస్ నే "సిటాడెల్ హనీ బని". ఈ సిరీస్ హాలీవుడ్ లో ఆల్రెడీ తెరకెక్కించిన సిరీస్ "సిటాడెల్" కి రీమేక్ గా ఇండియన్ వెర్షన్ లా తెరకెక్కింది.
కాగా ఒరిజినల్ సిరీస్ లో ప్రియాంక చోప్రా ఫీమేల్ లీడ్ లో కనిపించగా ఈ పాత్రని సమంత పోషించింది. అయితే ఎప్పుడో సంవత్సర కాలం కితమే పూర్తయిపోయిన ఈ సిరీస్ ఎంతకీ రిలీజ్ కి రావడం లేదు. దీనితో క స్టేజ్ లో సిరీస్ ని నిలిపేశారు అని కూడా రూమర్స్ వచ్చాయి. కానీ ఈ ఏడాదిలో అమెజాన్ ప్రైమ్ వీడియో వారు చేసిన ఓ ఓటిటి ఫెస్ట్ తో ఆగిపోలేదు తీసుకొస్తున్నామని చెప్పారు.

దీనితో ఈ సిరీస్ ఆగలేదు అని కన్ఫర్మ్ అయ్యింది. కానీ మళ్ళీ ఇదే ఫెస్ట్ తర్వాత నెలలు గడుస్తున్నా మళ్ళీ పత్తా లేకుండా పోయింది ఈ సిరీస్.. మరి ఫైనల్ గా ఇపుడు ఒక క్లారిటీని దర్శకులు, కంటెంట్ క్రియేటర్స్ రాజ్ అండ్ డీకే లు రివీల్ చేశారు ఈ ఆగస్ట్ 1 అంటూ వారు పెట్టిన ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ ఇండియన్ ఓటిటి ఆడియెన్స్ లో వైరల్ గా మారింది.
దీనితో ఈ అగస్ట్ 1 నుంచే ఈ సిరీస్ ప్రైమ్ వీడియోలో అందుబాటులోకి వస్తుందా అని ఇప్పుడు వినిపిస్తుంది. మరి ఇది సిరీస్ రిలీజ్ డేటేనా లేక ఆరోజున మరో డేట్ తో ఎప్పుడు రాబోతుంది అనేది రివీల్ చేస్తారా అనేది చూడాలి. కాగా ఒరిజినల్ సిరీస్ లో హాలీవుడ్ నటుడు రిచర్డ్ మాడన్ నటించగా తన రోల్ లో ఇండియన్ వెర్షన్ కి గాను వారు ధావన్ నటించాడు. అలాగే ఈ సిరీస్ ఒక స్పై యాక్షన్ థ్రిల్లర్ సిరీస్ గా రాబోతుంది.


Click it and Unblock the Notifications











