Shaakuntalam OTT: ఆ ఓటీటీలోనే శాకుంతలం.. విడుదలైన అన్ని రోజులకేనా!
తెలుగు సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకుని.. సుదీర్ఘ కాలంగా స్టార్ హీరోయిన్‌గా హవాను చూపిస్తూ దూసుకుపోతోంది టాలెంటెడ్ లేడీ సమంత రూత్ ప్రభు. ఎప్పటికప్పుడు సరికొత్త ప్రయోగాలు చేస్తూ ముందుకు సాగుతోన్న ఈ భామ.. ఇటీవలి కాలంలో లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు ఎక్కువగా మక్కువ చూపుతోంది. ఈ క్రమంలోనే గత ఏడాది 'యశోద'గా వచ్చి భారీ హిట్‌ను ఖాతాలో వేసుకుంది. ఈ జోష్‌లోనే ఇప్పుడు స్టార్ హీరోయిన్ సమంత 'శాకుంతలం' అనే చారిత్రక నేపథ్యం ఉన్న సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు ప్రధాన పాత్రలో గుణశేఖర్ తెరకెక్కించిన చిత్రమే 'శాకుంతలం'. ఈ మూవీకి అమెరికాలోని ప్రీమియర్స్ నుంచే మంచి టాక్ వచ్చింది. అయితే, తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఈ చిత్రం మిక్స్‌డ్ టాక్‌ను సొంతం చేసుకుంది. అయినప్పటికీ ప్రేక్షకుల నుంచి స్పందన కూడా భారీగానే దక్కుతోంది. దీంతో మొదటి రోజు షోలు దాదాపుగా ఫుల్ అయిపోయాయి. దీంతో ఈ చిత్రానికి మంచి ఓపెనింగ్స్ వచ్చే అవకాశం ఉన్నట్లు ట్రేడ్ విశ్లేషకులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా 'శాకుంతలం' మూవీ ఓటీటీ డీల్ గురించి ఓ న్యూస్ బయటకు వచ్చింది.

క్రేజీ కాంబినేషన్‌లో భారీ బడ్జెట్‌తో రూపొందిన 'శాకుంతలం' మూవీపై నెలకొన్న అంచనాల కారణంగా.. దీని డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులకు తీవ్ర స్థాయిలో పోటీ ఏర్పడింది. అందుకు అనుగుణంగానే ఓటీటీ దిగ్గజం అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ ఈ డిజిటల్ రైట్స్‌ను భారీ ధరకు కొనుగోలు చేసినట్లు తెలిసింది. అంతేకాదు, థియేటర్లలో విడుదలైన కేవలం నాలుగు వారాల తర్వాతనే ఈ చిత్రాన్ని ఓటీటీలో స్ట్రీమింగ్ చేసేలా నిర్మాతలు ఒప్పందం చేసుకున్నారని అంటున్నారు. అంటే నేడు విడుదలైన 'శాకుంతలం' మే మూడో వారంలో స్ట్రీమింగ్‌కు వస్తుందనే టాక్ ఫిలిం నగర్‌లో వినిపిస్తోంది.
సమంత రూత్ ప్రభు - గుణశేఖర్ కాంబోలో వచ్చిన చిత్రమే 'శాకుంతలం'. ఈ చిత్రాన్ని గుణ టీమ్ వర్స్క్ బ్యానర్‌పై నీలిమ నిర్మించాయి. దిల్ రాజు ఈ మూవీకి నిర్మాణ భాగస్వామిగా ఉన్నారు. దీనికి మణి శర్మ సంగీతం ఇచ్చారు. ఇందులో దేవ్ మోహన్, సచిన్ ఖేడ్కర్, మోహన్ బాబు, అనన్య నాగళ్ల, ప్రకాశ్ రాజ్, గౌతమి తదితరులు నటించారు.


Click it and Unblock the Notifications











