Shaakuntalam: సమంత ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్.. ఆ ఓటీటీలోకి వచ్చేసిన శాకుంతలం
టాలీవుడ్‌లో సుదీర్ఘ కాలంగా స్టార్ హీరోయిన్‌గా హవాను చూపిస్తూ.. వరుసగా సినిమాల మీద సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతోంది టాలెంటెడ్ బ్యూటీ సమంత రూత్ ప్రభు. గతంలో గ్లామరస్ పాత్రలకే ప్రాధాన్యం ఇచ్చిన ఈ చిన్నది.. ఈ మధ్య కాలంలో తన పంథాను పూర్తిగా మార్చేసుకుని ఇంపార్టెంట్ రోల్స్ ఉన్న చిత్రాలనే చేస్తూ వస్తోంది. ముఖ్యంగా కొన్నేళ్లుగా లేడీ ఓరియెంటెడ్ చిత్రాలతో సందడి చేస్తోంది. ఇందులో భాగంగానే ఇటీవలే సమంత 'శాకుంతలం' అనే భారీ బడ్జెట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేసిన విషయం తెలిసిందే.
సమంత రూత్ ప్రభు ప్రధాన పాత్రలో గుణశేఖర్ తెరకెక్కించిన మూవీనే 'శాకుంతలం'. విడుదలకు ముందే ఈ చిత్రం భారీ అంచనాలను ఏర్పరచుకుంది. అయితే, ఊహించని విధంగా ఈ మూవీకి మొదట్లోనే మిక్స్‌డ్ టాక్ వచ్చింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో దీనికి చాలా తక్కువ కలెక్షన్లు వచ్చాయి. ఇలా దాదాపు రూ. 80 కోట్లు బడ్జెట్‌తో వచ్చిన ఈ సినిమా.. ఫుల్ రన్‌లో కేవలం రూ. 4 కోట్లు షేర్‌ను మాత్రమే వసూలు చేసింది. ఫలితంగా రూ. 19.00 కోట్లు బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బరిలోకి దిగిన ఈ సినిమా.. ఏకంగా రూ. 15 కోట్ల వరకూ నష్టాలను ఎదుర్కొని డిజాస్టర్‌గా మిగిలింది.

థియేటర్లలో పెద్దగా రాణించలేకపోయిన సమంత 'శాకుంతలం' మూవీ.. అనుకున్న సమయానికి కంటే ఓటీటీలోకి వచ్చేస్తుందని జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే, ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్‌ను సొంతం చేసుకున్న అమెజాన్ ప్రైమ్ వీడియో మాత్రం దీనిపై ఎలాంటి ప్రకటన చేయలేదు. ఈ పరిస్థితుల్లో తాజాగా (మే 11) ఈ చిత్రం ఓటీటీలో ప్రత్యక్షం అయిపోయింది. అమెజాన్ ప్రైమ్‌లో ఇది తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం, హిందీ భాషల్లో స్ట్రీమింగ్‌కు అందుబాటులోకి వచ్చేసింది. ఈ బిగ్ సర్‌ప్రైజ్‌తో సమంత అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.

సమంత రూత్ ప్రభు - గుణశేఖర్ కాంబినేషన్‌లో వచ్చిన 'శాకుంతలం' మూవీని గుణ టీమ్ వర్స్క్ బ్యానర్‌పై నీలిమ నిర్మించాయి. దిల్ రాజు ఈ మూవీకి నిర్మాణ భాగస్వామిగా ఉన్నారు. దీనికి మణి శర్మ సంగీతం ఇచ్చారు. ఇందులో దేవ్ మోహన్ హీరోగా నటించగా.. సచిన్ ఖేడ్కర్, మోహన్ బాబు, అనన్య నాగళ్ల, ప్రకాశ్ రాజ్, గౌతమి తదితరులు కీలక పాత్రలు చేశారు.


Click it and Unblock the Notifications











