OTT: మరోసారి బోల్డ్ సీన్స్ తో రెచ్చిపోనున్న సమంత.. ఆ క్రేజీ సిరీస్ కోసమే

ఒక్క సౌత్ ఇండియా సినిమా దగ్గర మాత్రమే కాకుండా పాన్ ఇండియా సినిమా భాషలు దాదాపు అన్నిట్లో కూడా మంచి ఫేమ్ ఉన్న హీరోయిన్ కొంచెం మందే ఉంటారు. మరి అలాంటి కొద్దీ మంది హీరోయిన్స్ లో స్టార్ బ్యూటీ సమంత కూడా ఒకరు. మరి సినిమాల నుంచి కొంచెం బ్రేక్ తీసుకున్నప్పటికీ సమంతకి డిమాండ్ ఏమాత్రం తగ్గలేదు. ఇంకా అపుడు మీద ఇప్పుడు మరిన్ని అవకాశాలు వచ్చి పడుతున్నాయి.

కాగా ఇప్పుడు సమంత తన హెల్త్ ఇస్స్యూస్ నుంచి కోలుకొని మళ్ళీ తెరంగేట్రం చేస్తుండడంతోనే పాన్ ఇండియా ప్రాజెక్ట్ లని మూటగట్టుకొని సిద్ధం అయ్యింది. ఇలా వీటిలో పలు సినిమాలతో పాటుగా క్రేజీ వెబ్ సిరీస్ లని కూడా సమంత ఓకే చేసింది. మరి ఈ సిరీస్ లలో బాలీవుడ్ బోల్డ్ సిరీస్ రక్త బీజ్/ రక్త బ్రహ్మాండ సిరీస్ కూడా ఒకటి.

samantha to act in bold scenes with mirzapur actor ali fazal in this ott series

ఇండియాస్ ప్రైడ్ సినిమా "తుంబాడ్" దర్శకుడు రాహి అనీల్ బార్వే తెరకెక్కించనున్న ఈ క్రేజీ వెబ్ సిరీస్ లో సమంత ముఖ్య పాత్ర చేయనుండడం ఖరారు కాగా ఇపుడు ఆమె పాత్ర సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ఇపుడు తెలుస్తున్నాయి. కాగా ఈ సిరీస్ లో కూడా సమంతకి వచ్చింది. ఒక బోల్డ్ క్యారక్టరే కాగా ఇపుడు ఈ సీన్స్ అన్నీ ఎవరితో ఉంటాయో అనేది కూడా వినిపిస్తుంది.

తాజా బజ్ ప్రకారం సమంత బాలీవుడ్ నటుడు అలీ ఫజల్ కి జోడిగా కనిపించనుందట. గుడ్డు భయ్యా అలియాస్ అలీ ఫజల్ హిందీ మాస్ ఓటిటి సిరీస్ "మీర్జాపూర్" తో బాగా ఫేమస్. జస్ట్ కొన్ని రోజులు కితమే మీర్జాపూర్ 3 సీజన్ తో కూడా వచ్చి మరోసారి ఓటిటి వీక్షకులని తాను పలకరించాడు. కాగా ఇప్పుడు ఫైనల్ గా ఈ క్రేజీ కలయిక ఆ భారీ ఓటిటి సిరీస్ కోసం జరగనున్నట్టుగా తెలుస్తుంది.

samantha to act in bold scenes with mirzapur actor ali fazal in this ott series

మరి ఈ ఇద్దరి నడుమ మంచి హాట్ అండ్ బోల్డ్ సీన్స్ ఉంటాయని బాలీవుడ్ వర్గాల్లో టాక్ నడుస్తుంది. మరి తుంబాడ్ లోనే సాలిడ్ కంటెంట్ తో పాటుగా కొన్ని అడల్ట్ సీన్స్ కూడా ఉంటాయి. మరి ఈసారి అనీల్ బార్వే ఎలాంటి సీన్స్ డిజైన్ చేసాడో వేచి చూడాలి. కాగా ఈ సిరీస్ లో బాలీవుడ్ నటి వామికా గబ్బి కూడా కీలక పాత్ర చేస్తుండగా ఆదిత్య రాయ్ కపూర్ కూడా నటిస్తున్నాడు.

ప్రస్తుతానికి ఇదే ప్రధాన తారాగణం అన్నట్టుగా కూడా వినికిడి. ఇంకా ఈ మాసివ్ సిరీస్ ని ప్రముఖ హిట్ సిరీస్ "ది ఫ్యామిలీ మ్యాన్" దర్శకులు రాజ్&డీకే లు నిర్మాణం వహిస్తుండగా వరల్డ్ టాప్ నిర్మాణం సంస్థ నెట్ ఫ్లిక్స్ ఈ పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ సిరీస్ ని అందుబాటులోకి తీసుకురానుంది. మరి చిత్రీకరణ ఈ ఏడాదిలోనే మొదలు కానుండగా స్ట్రీమింగ్ కి మాత్రం వచ్చే ఏడాది లేదా కాస్త ఆలస్యంగానే వచ్చే అవకాశం ఉంది.

More from Filmibeat

Read more about: samantha ali fazal
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X