OTTలోకి వచ్చేసిన ఓటు విలువ తెలియజేసే మూవీ... ఎందులో చూడాలంటే?
తెలంగాణలో ఎన్నికలకు అంతా సిద్ధం అయిపోయింది. రేపు అందరూ ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. బాధ్యతగా అందరూ ఓటు వేసి.. సరైన నాయకుడిని ఎన్నుకోవాలి. అయితే చాలా మంది ఎవరు వేస్తారులే అని ఇంట్లో కూర్చొంటారు. మరికొంత మంది డబ్బులు ఎవరు ఇస్తే వారికే ఓటు వేస్తామని అమ్ముకుంటారు. ఇక అలాంటి వారి కోసం ఓ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చింది. ఓటు విలువను తెలియజేసే కామెడీ మూవీ ఓటీటీలో సందడి చేస్తుంది. ఆ సినిమా ఏంటి.. ఎందులో స్ట్రీమింగ్ అవుతుందనే వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
ఎలక్షన్ల సందడి మొదలైంది.. మరోవైపు సినిమాల సందడి కూడా ప్రారంభం కాబోతుంది. డిసెంబర్ 1న భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. మరోవైపు ఓటీటీలో ఇంట్రెస్టింగ్ మూవీస్ వచ్చేస్తున్నాయి. అయితే నవంబర్ 30 ఓటీటీలో దాదాపు 20కి పైగా సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. ఇదిలా ఉంటే.. ఓటు విలువను తెలియజేసే ఓ మూవీ ఓటీటీలోకి వచ్చి స్ట్రీమింగ్ అవుతుంది. అనుకున్న తేదీ కంటే ముందుగానే ఓ రోజు ఓటీటీలోకి వచ్చేసింది.

సంపూర్ణేష్ బాబు నటించిన మార్టిన్ లూథర్ కింగ్ సినిమా ఇప్పుడు ఓటీటీలో రిలీజ్ అయి ఆకట్టుకుంటుంది. అక్టోబర్ 17న ఈ సినిమా థియేటర్లోకి వచ్చింది. ఇక విడుదలైన ఈ మూవీకి బాక్సాఫీస్ వద్ద మిక్స్ డ్ టాక్ లభించింది. ఇందులో బర్నింగ్ స్టార్ సంపూర్ణేశ్ బాబు ప్రధాన పాత్రలో నటించగా.. పూజ కొల్లూరు ఈ సినిమాకు డైరెక్షన్ చేశారు. కేరాఫ్ కంచరపాలెం సినిమా డైరెక్టర్ వెంకటేశ్ మహా ఈ చిత్రానికి మాటలు, స్క్రీన్ ప్లై అందించారు.
మార్టిన్ లూథర్ కింగ్ అనే సినిమా తమిళ చిత్రం మండేలాకి రీమేక్. ఈ సినిమాను తెలుగులో మార్టిన్ లూథర్ కింగ్ పేరుతో రీమేక్ చేశారు. కథకు అనుగుణంగా మార్పులు చేసి రిలీజ్ చేశారు. ఇక ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలోకి అందుబాటులోకి వచ్చేసింది. మార్టిన్ లూథర్ కింగ్ సినిమాను ప్రముఖ ఓటీటీ ప్లా్ట్ ఫాం సోనిలీవ్ లో నవంబర్ 29న స్ట్రీమింగ్ కానున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

అయితే చెప్పిన డేట్ కంటే ముందే అంటే నవంబర్ 28న ఈ సినిమా సోనీ లివ్ లో స్ట్రీమింగ్ కు వచ్చేసింది. ఈ సినిమా తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో అందుబాటులో ఉంది. ఈ సినిమాలో శరణ్య ప్రదీప్, నరేశ్, వెంకటేశ్ మహా కీలకపాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి స్మరణ్ మ్యూజిక్ సమకూర్చాడు.
ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే.. ఓటు విలువను తెలియజేసేలా.. ఓటు ఎంత శక్తిమంతమైనదో చెబుతుంది. పొలిటికల్ సెటైర్ మూవీగా ఈ సినిమాను దర్శకుడు రూపొందించాడు. తమకు ఓటు వేయాలంటూ ఇద్దరు రాజకీయ నాయకులు మార్టిన్ లూథర్ కింగ్ (సంపూ)ను ప్రలోభాలకు గురిచేయగా.... అయితే అప్పటివరకు అనామకుడిగా ఉన్న అతడి జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది అన్నదే ఈ చిత్రం కథ. ఎలక్షన్స్ టైంలో ఇలాంటి సినిమా ప్రతి ఒక్కరు చూడాల్సిందే. ఓటీటీలో ఎంచాక్కా ఇంట్లోనే కూర్చొని చూసేయండి.


Click it and Unblock the Notifications











