రిలీజై నెల తిరక్కముందే OTTలోకి రాబోతున్న పొలిటికల్ సెటైరికల్ ఫిల్మ్.. ఎక్కడ స్ట్రీమింగ్ అంటే?

హీరోగా, కమెడియన్ గా తెలుగు సినీ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించడంలోనైనా కంటతడి పెట్టించడంలోనైనా ఎప్పుడూ ముందుండేది సంపూర్ణేష్ బాబు. హృదయ కాలేయం సినిమాతో తెలుగు సినీ రంగంలో అడుగు పెట్టిన ఆయన.. అతి తక్కువ కాలంలోనే అద్భుతమైన క్రేజ్ సంపాధించుకున్నాడు. అడపాదడపా చిత్రాలు చేస్తూ సినీ ప్రేక్షకులను అలరిస్తున్నాడు. అయితే ఆయన ప్రధాన పాత్రలో తాజాగా వచ్చిన చిత్రం మార్టిన్ లూథర్ కింగ్. అక్టోబర్ 27వ తేదీన థియేటర్లలో గ్రాండ్ గా రిలీజ్ అయిందీ పొలిటికల్ సెటైరికల్ డ్రామా.

అద్భుతమైన కథతో అందరినీ మెప్పించిన ఈ చిత్రానికి మాతృక తమిళంలో వచ్చిన మండేలా సినిమా. అయితే ఆ సినిమాలో యోగిబాబు హీరోగా నటించగా... తెలుగుకి ఈ చిత్రాన్ని డబ్ చేశారు. అయితే ఇక్కడి నేటివిటీకి దగ్గరగా ఉండేలా కథలో కూడా కొన్ని మార్పులు చేసి మరీ తెలుగులో చిత్రాన్ని తెరకెక్కించారు. సంపూర్ణేష్ బాబు హీరోగా వచ్చిన ఈ సినిమాకి మంచి మార్కులే పడ్డప్పటికీ.. బాక్సాఫీసు వద్ద భారీ కలెక్షన్లను రాబట్టడంలో విఫలం అయింది. కానీ కథ మాత్రం అద్భుతంగా ఉందని తెలుస్తోంది.

Sampoornesh Babu Martin Luther King Streaming Date Confirmed Check Details

సంపూర్ణేష్ బాబుతో పాటు వీకే నరేష్, వెంకటేష్ మహా, శరణ్య ప్రదీప్ లు ఈ చిత్రంలో ప్రధాన పాత్రల్లో నటించారు. అలాగే పూజ కొల్లూరి ఈ సినిమాకు దర్శకత్వం వహించగా... కేరాఫ్ కంచెరపాలెం సినిమా డైరెక్టర్.. డైలాగ్స్ రాశారు. వైనాట్ స్టూడియోస్, రిలయన్స్ ఎంటర్ టైన్ మెంట్స మహాయానా మోషన్ పిక్చర్స్ బ్యానర్ పై ఎస్ శశికాంత్, చక్రవర్తి రామచంద్ర ఈ చిత్రాన్ని నిర్మించారు. ఓటు విలువ గురించి చాటి చెచ్పిన ఈ సినిమా గురించి ఇప్పుడు ఎందుకు చెబుతున్నారు అనుకుంటున్నారా.. అదేం లేదండీ. ఈ సినిమాకు సంబంధించిన ఓ తాజా అప్ డేట్ వచ్చింది.

థియేటర్లలో విడుదల అయి నెల కూడా పూర్తి కాకముందే ఈ ఓటీలోకి రాబోతుంది. ప్రముఖ ఓటీటీ సంస్థ అయిన సోనీ లీవ్ లో మార్టిన్ లూథర్ కింగ్ సినిమా స్ట్రీమింగ్ కాబోతుందట. ఈనెల 29వ తేదీ నుంచి ఈ చిత్రం అందుబాటులో ఉండబోతుందని.. సోనీ లివ్ సంస్థ సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. అలాగే ఈ చిత్రానికి సంబంధించిన తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ, హిందీ భాషలకు సంబంధించిన ఆడియో కూడా అందుబాటులో ఉంటుందని వివరించింది.

Sampoornesh Babu Martin Luther King Streaming Date Confirmed Check Details

ఇప్పటి వరకు మీరు ఈ చిత్రాన్ని చూసి ఉండకపోతే మాత్రం కచ్చితంగా ఓటీటీ వేదికగా చూసేయండి. ఫ్యామిలీతో కలిసి కూర్చొని మరీ ఎంజాయ్ చేయండి. అప్పుడప్పుడు మాత్రమే ఇలాంటి అద్భుతమైన సినిమాలు వస్తాయి. బాక్సాఫీసు వద్ద భారీగా వసూళ్లు రాబట్టకపోయినప్పటికీ.. సినిమా మీకు మంచి ఫీల్ ను ఇస్తుంది. సో ఇంకెందుకు ఆలస్యం.. గెట్ రెడీ ఫర్ సీ దిస్ మూవీ.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X