OTTలోకి సడెన్‌గా వచ్చేసిన ఎమోషనల్ హిట్ మూవీ.. ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఇతర పరిశ్రమకు చెందిన నటీనటులు తెలుగులో కూడా మంచి సత్తా చాటుతుంటారు. అలాంటి వారిలో కోలీవుడ్ విలక్షణ నటుడు సముద్రఖని ఒకరు. అనేక తెలుగు చిత్రాల్లో మంచి నటనతో అలరించిన ఆయన పలు సినిమాలకు దర్శకత్వం వహించి సూపర్ హిట్ అందుకున్నారు. రవితేజ, అల్లరి నరేష్ శంభో శివ శంభో సినిమాతో డైరెక్టర్ గా తెలుగులో మంచి పేరు తెచ్చుకున్న ఆయన తర్వాతి కాలంలో నటుడిగా క్రేజ్ అందుకున్నారు. ఇటీవల ఆయన ప్రధాన పాత్ర పోషించిన ఎమోషనల్ రైడ్ మూవీ విమానం ఓటీటీలోకి (Vimanam OTT) వచ్చి ఆశ్చర్యపరిచింది. మరి ఈ విమానం ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందనే వివరాల్లోకి వెళితే..

తెలుగు వారికి పెద్దగా పరిచయం లేని నటుడు సముద్రఖని. డైరెక్టర్ గా తెలుగు వారికి మొదట పరిచయమైన తర్వాతి కాలంలో విలక్షణ నటుడిగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. రఘువరన్ బీటెక్ సినిమాతో తండ్రిగా అలరించిన ఆయన అల వైకుంఠపురములో, క్రాక్ చిత్రాల్లో విలన్ గా మెప్పించారు. క్రాక్ సినిమాలో కటారి క్రిష్ణగా పవర్ ఫుల్ విలన్ గా అదరగొట్టారు. తర్వాత సర్కారు వారి పాట సినిమాలో కూడా ప్రతి నాయకుడిగా చేశారు. ప్రస్తుతం పవన్ కల్యాణ్-సాయి ధరమ్ తేజ్ బ్రో సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు.

ఇదిలా ఉంటే సముద్రఖని ఇటీవల ప్రధాన పాత్ర పోషించిన చిత్రం విమానం (Vimanam Movie). శివ ప్రసాద్ యానాలా రచన, దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో బ్యూటిఫుల్ యాంకర్ అనసూయ వేశ్య పాత్రలో ఆకట్టుకుంది. అలాగే మాస్టర్ ధృవన్, రాహుల్ రామకృష్ణ, ధన్ రాజ్ కీలక పాత్రలు పోషించారు. సీనియర్ హీరోయిన్ మీరా జాస్మిన్ ఈ సినిమాతో తెలుగులోకి రీ ఎంట్రీ సైతం ఇచ్చారు. జీ స్టూడియోస్ సంస్థతో కిరణ్ కొర్రపాటి క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ పై నిర్మాత కిరణ్ కొర్రపాటి విమానం చిత్రాన్ని నిర్మించారు. చరణ్ అర్జున్ సంగీతం అందించారు.
తండ్రీ కొడుకుల అనుబంధం నేపథ్యంలో తెరకెక్కిన విమానం సినమా జూన్ 9న థియేటర్లలో విడుదలై ప్రేక్షకుల మన్ననలు పొందింది. కలెక్షన్స్ సంగతి ఎలా ఉన్నా ఎమోషనల్ మూవీగా పేరు తెచ్చుకుంది. అలాంటి ఈ మూవీ ఇప్పుడు సడెన్ గా ఓటీటీలో ప్రత్యక్షమైంది. ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5లో (ZEE5) జూన్ 30న అంటే శుక్రవారం నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. అంటే సాధారణంగా నాలుగు వారాల కంటే ముందుగానే విమానం చిత్రాన్ని డిజిటల్ ప్రీమియర్ గా ఆడియెన్స్ ముందుకు తీసుకొచ్చి సర్ ప్రైజ్ ఇచ్చారు మేకర్స్.


Click it and Unblock the Notifications











