సైలెంట్‌గా OTTలోకి వచ్చేసిన సముద్రఖని సరికొత్త థ్రిల్లర్ మూవీ.. ఎలా చూడాలంటే?

ఈ మధ్య కాలంలో అనేక అద్భుతమైన సినిమాలు ఓటీటీలోకి వచ్చేస్తూ తెగ సందడి చేస్తున్నాయి. ముఖ్యంగా హార్రర్, క్రైమ్, థ్రిల్లర్ చిత్రాల హవా రోజురోజుకూ పెరిగిపోతుంది. ఆ విషయం అర్థం చేసుకున్న దర్శకనిర్మాతలు కూడా అలాంటి చిత్రాలనే తీసుకు వస్తూ... సినీ ప్రియులను తెగ అలరిస్తున్నారు. అలాగే ఆ చిత్రాలను ఓటీటీలోకి తీసుకు వస్తూ.. ఓటీటీ సంస్థలు మరింత సందడి చేస్తుండగా.. ఓటీటీ ప్రియులు సమ్మర్ ను మరింతగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పటికీ ఓటీటీ వేదికగా అనేక హార్రర్, థ్రిల్లర్ చిత్రాలు ఉండగా.. ఇప్పుడు మరో క్రేజీ థ్రిల్లర్ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. ఆ సినిమా ఏంటి, ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

ది గ్రేట్ యాక్టర్ అండ్ డైరెక్టర్ గా దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న సముద్రఖని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన హీరోగా వచ్చిన తాజా థ్రిల్లర్ డ్రామా సినిమానే యావారుం వల్లవారే. అయితే ఈ సినిమా సముద్రఖని ప్రధాన పాత్రలో నటించి మెప్పించాడు. అలాగే యోగిబాబు, రిత్విక, అరుంధతి, రాజేంద్రన్, ఇళవరసు, దేవర్శిని, మయిల్సామి, బోస్ వెంకట్, జో మల్లూరి, పోస్టర్ నందకుమార్, చేరన్ రాజ్ లు తదితర పాత్రల్లో నటించి మెప్పించారు.

Samuthirakani Super Thriller Drama Movie Yaavarum Vallavare Streaming Details Here

ఎన్ ఏ రాజేంద్ర చక్రవర్తి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాను మార్చి 15వ తేదీన థియేటర్లలో గ్రాండ్ గా విడుదల చేశారు. అద్భుతమైన కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సినిమాను ఎలెవెన్ ఎలెవన్ ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ది కమ్యూనిటీ పిక్చర్స్ బ్యానర్ పై సి ఆనంద్, జోసెఫ్ రాజ్ లు నిర్మించారు. ఎన్ఆర్ రఘునందన్ సంగీతం అందించగా.. జై సినిమాటోగ్రాఫర్ గా పని చేశాడు. అలాగే జి రామారావు ఎడిటర్ గా పని చేశారు. ఇలా అధ్భుతమైన థ్రిల్లర్ కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సినిమా థియేటర్ల వద్ద నార్మల్ గా ఆడింది. పాజిటివ్ టాక్ రాబట్టుకుంది.

Samuthirakani Super Thriller Drama Movie Yaavarum Vallavare Streaming Details Here

కానీ అంతా ఊహించినట్లు బ్లాక్ బస్టర్ హిట్ గా మాత్రం నిలవలేదీ చిత్రం. అయితే తాజాగా ఈ సూపర్ థ్రిల్లర్ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ సంస్థ అయిన అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా యావారుం వల్లవారే అనే సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. ఏప్రిల్ 26వ తేదీ అంటే నిన్నటి నుంచి అందుబాటులోకి వచ్చిన ఈ చిత్రాన్ని చూసేందుకు అంతా తెగ ఎగ్జైట్ అవుతున్నారు. ముఖ్యంగా ఈ సినిమా థ్రిల్లర్ కాన్సెప్ట్ తో రావడంతో.. అంతా ఆసక్తిగా చూస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X