3 ఏళ్లకు OTTలోకి రాబోతున్న క్రేజీ సైకో కిల్లర్ మూవీ.. వెన్నులో వణుకుపుట్టించే దీన్ని ఎక్కడ చూడాలంటే?
రోజురోజుకూ ఓటీటీల హవా ఎక్కువవుతుండగా.. పాత సినిమాలను కూడా ఓటీటీలోకి తీసుకు వస్తూ తెగ సందడి చేస్తున్నారు. ముఖ్యంగా ఓటీటీ ప్రియులు సినిమా బాగుందని తెలిస్తే చాలు.. ఏ భాషలో వచ్చినా సబ్ టైటిల్స్ పెట్టుకుని మరీ చూసేస్తున్నారు. ఆ విషయం అర్థం చేసుకున్న దర్శక, నిర్మాతల పాత చిత్రాలను అందుబాటులోకి తేవడంతో పాటు అన్ని భాషల్లోనూ డబ్ చేసి మరీ ఓటీటీలో విడుదల చేస్తున్నారు. అయితే మూడేళ్ల క్రితం తమిళంలో వచ్చి క్రేజీ సైకో కిల్లర్ మూవీని తాజాగా తెలుగులోకి డబ్ చేసి నేరుగా ఓటీటీలో రిలీజ్ చేయబోతున్నారు. అయితే ఆ సినిమా ఏంటి ఎక్కడ స్ట్రీమింగ్ కాబోతుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
తమిళ బిగ్ బాస్ సీజన్ 4లో పాల్గొన్న కంటెస్టెంట్ సమన్ శెట్టి.. ప్రధాన పాత్రలో 2021లో వచ్చి క్రేజీ క్రైమ్ థ్రిల్లర్ మూవీయే "ఊమై సెన్నై". అదిరిపోయే సైకో కిల్లర్ కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రంలో సనమ్ శెట్టితో పాటు మైఖేల్ తంగదురై, విజయ శ్రీ, గజరాజ్, జయకుమార్, జయరావు, సాయి రాజ్ కుమార్, అరౌల్ డి శంకర్, విక్రమ్ జగదీష్, బేబీ రుద్రక్షణ వంటి వాళ్ల ప్రధాన పాత్రల్లో నటించి మెప్పించారు. అర్జునన్ ఏకలైవన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు శివ సంగీతం అందించారు.

అలాగే కళ్యాణ్ వెంకట్రామన్ సినిమాటోగ్రఫర్ గా పని చేయగా.. అతుల్ విజయ్ ఎడిటింగ్ బాధ్యతలు చూసుకున్నారు. క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని 2021 డిసెంబర్ 10వ తేదీన థియేటర్లలో గ్రాండ్ గా విడుదల చేశారు. అద్భుతమైన కథాంశంతో వచ్చినా చిన్న చిత్రం కావడంతో.. ప్రేక్షకులకు అంతగా దగ్గర కాలేకపోయింది. కానీ చూసిన వాళ్లందరూ ఈ చిత్రం చాలా బాగుందంటూ ప్రశంసల వెల్లువ కురిపించారు. అయితే మూడేళ్లకు ఈ క్రేజీ మూవీని తెలుగులోకి కూడా డబ్ చేస్తున్నారు.
అయితే తమిళంలో ఊమై సెన్నైగా తెరకెక్కించిన ఈ చిత్రాన్ని తెలుగులో మాత్రం పార్థుగా విడుదల చేయబోతున్నారు. అయితే థియేటర్లలో కాకుండా ఈ సైకో కిల్లర్ మూవీని నేరుగా ఓటీటీలోకి తీసుకు వస్తున్నారు. ప్రముఖ ఓటీటీ సంస్థ అయిన ఈటీవీ విన్ వేదికగా ఈ సినిమా స్ట్రీమింగ్ కాబోతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఈటీవీ విన్ యే ఎక్స్ వేదికగా ఈ విషయాన్ని ప్రకటించింది. మే 9వ తేదీ నుంచి ఈటీవీ విన్ లో పార్థు సినిమా అందుబాటులో ఉండబోతున్నట్లు చెప్పింది. సైకో కథ అనగానే అంతా ఆసక్తిగా ఈ సినిమా చూడాలని ప్లాన్ చేసుకుంటున్నారు. మరి మరో రెండ్రోజుల్లో రాబోతున్న ఈ సినిమాను మీరు కూడా చూసి ఫుల్ గా ఎంజాయ్ చేసేయండి. ఏమాత్రం మిస్ కాకండి.


Click it and Unblock the Notifications











