Mirza Malik Show: విడాకులు అంటూ వార్తలు.. ట్విస్ట్ ఇచ్చిన సానియా మీర్జా, షోయబ్ మాలిక్!
పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షోయబ్ మాలిక్ ఇండియన్ టెన్నిస్ ప్లేయర్ సానియా మీర్జా కొన్నాళ్ళు డేటింగ్ చేసిన అనంతరం వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. అప్పట్లో వీరి వివాహం అందరినీ ఎంతగానో ఆశ్చర్యాన్ని కలుగజేసింది. అయితే వీరిద్దరూ వివాహం చేసుకున్న తర్వాత స్వీట్ మెమోరీస్ తో విభిన్నమైన ఫోటోలను షేర్ చేసుకుంటూ వార్తల్లో నిలుస్తూ వస్తున్నారు. అయితే ఇటీవల వీరి మధ్య గొడవలు రావడంతో విడాకులు తీసుకోబోతున్నట్లు టాక్ కూడా వచ్చింది. ఇక ఇప్పుడు ఊహించని విధంగా ఇద్దరు కలిసి ఒక షో చేయబోతున్నట్లు అనౌన్స్మెంట్ రావడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే..

హైదరాబాద్ లో వివాహం
దయాదిదేశమైన పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ ను భారత టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా ప్రేమించి పెళ్లి చేసుకోవడం అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. వీరి వివాహం 2010లో హైదరాబాదులోనే ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. ఇక వీరి దాంపత్య జీవితం అయితే దుబాయ్ లోనే కొనసాగుతోంది. వీరికి 2018లో కుమారుడు కూడా జన్మించాడు.

వారిద్దరి మధ్య విభేదాలు
అయితే గతంలో ఎప్పుడు లేని విధంగా కొన్ని వారాల నుంచి షోయబ్ మాలిక్ సానియా మీర్జా విడిపోతున్నారు అని కథనాలు సోషల్ మీడియాలో చాలా వైరల్ అయ్యాయి. వారిద్దరి మధ్య విభేదాలు వచ్చాయి అని అందుకే కుటుంబ సమక్షంలో చర్చించుకున్న తర్వాత విడిపోవాలని డిసైడ్ అయినట్లు కూడా బాలీవుడ్ మీడియాలో ఎన్నో కథనాలు వెలుపడ్డాయి.

ఒక అమ్మాయి కారణంగా
అయితే ఇటీవల షోయబ్ మాలిక్ ఒక పాకిస్తానీ లేడీ ఫ్యాషన్ ఫోటోగ్రాఫర్ తో సన్నిహితంగా ఉంటున్నట్లు తెలుసుకున్న సానియా మీర్జా అతనితో గొడవ పడినట్లు తెలుస్తోంది. ఒక అమ్మాయి కారణంగానే వీరి మధ్యలో గొడవలు వచ్చాయని పాకిస్తాన్ మీడియాలో కూడా తరచుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇక మొత్తానికి సానియా మీర్జా అతనితో విడిపోవడానికి రెడీ అయినట్లు టాక్ అయితే ఒక రేంజ్ లో వైరల్ అయింది.
టాక్ షోతో న్యూ ట్విస్ట్
ఇక సానియా మీర్జా షోయబ్ మాలిక్ విడాకుల విషయంలో త్వరలోనే అధికారికంగా క్లారిటీ ఇవ్వబోతున్నారు అని టాక్ వస్తున్న తరుణంలో ఇద్దరు కలిసి ఒక రియాలిటీ షో చేయబోతున్నట్లు మరొక అనౌన్స్మెంట్ రావడం మరింత హాట్ టాపిక్ గా మారింది. వీళ్లిద్దరూ కలిసి మీర్జామాలిక్ షో చేయడానికి రెడీ అయ్యారు త్వరలోనే ఇది ప్రారంభం కాబోతోంది.

ఆ తరహాలో టాక్ షో
ప్రముఖ పాకిస్తానీ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఉర్దూప్లెక్స్ లో మీర్జా మాలిక్ షో కొనసాగబోతున్నట్లు సమాచారం. అయితే ఈ షో కపిల్ శర్మ టాక్ షో తరహాలోనే ఉంటుందట. వీరిద్దరూ కలిసి హోస్ట్ చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. ప్రముఖ ఇంటర్నేషనల్ క్రీడాకారులను ఈ షోలోకి పిలిచి వారి మనోగతాన్ని జీవితంలో సాధించిన విజయాలని షేర్ చేయబోతున్నారట. ఈ టాక్ షో కోసం వీరిద్దరికీ భారీ స్థాయిలో రెమ్యునరేషన్ కూడా అందుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఇక మొత్తానికి వీరు విడాకులు తీసుకుంటున్నట్లు వస్తున్న వార్తల్లో అయితే పెద్దగా నిజం లేదని అనిపిస్తోంది.


Click it and Unblock the Notifications











