10 నెలల తర్వాత OTTలోకి వచ్చిన రియల్ ఇంట్రెస్టింగ్ స్టోరీ.. సినిమా ఏంటి, ఎక్కడ చూడాలంటే?
ఈ మధ్య కాలంలో అనేక అద్బుతమైన సినిమాలు ఓటీటీ వేధికగా స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఎవరూ ఊహించని విధంగా అతి త్వరగానే ఓటీటీ ప్రియులకు అందుబాటులోకి వచ్చేస్తున్నాయి. పెద్ద పెద్ద స్టార్ హీరోల చిత్రాలు సైతం టాక్ బాలేకపోతే నెల రోజుల వ్యవధిలోనే డిజిటల్ వేధికగా స్ట్రీమింగ్ అవుతున్నాయి. కానీ మరికొన్ని సినిమాలు మాత్రం చాలా కాలం గడిసినా ఓటీటీలోకి రావు. అలాంటి వాటిల్లో చాలానే చిత్రాలు ఉంటున్నాయి. అలాంటి ఓ రియల్ ఇంటెరెస్టింగ్ స్టోరీయే తాజాగా ఓటీటీలోకి వచ్చేసింది. అయితే ఆ సినిమా ఏంటి ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
అనేక తెలుగు సీరియల్స్ లో కనిపించే ఓ అద్భుతమైన నటి స్వప్న చెల్లి గురించి అందరికీ తెలిసే ఉంటుంది. అద్భుతమైన యాక్టింగ్ తో అందరినీ ఆకట్టుకునే ఈమె ఓ సినిమాలో తల్లిగా కనిపించి మెస్మరైజ్ చేసింది. స్పందన రెడ్డి, చెల్లి స్వప్న, మూల విరాట్ అశోక్ రెడ్డి ప్రధాన పాత్రలో వచ్చిన సినిమానే సాచి. గతేడాది అంటే 2023 మార్చి 3వ తేదీన విడుదల అయిందీ సాచి సినిమా. అయితే చిన్న సినిమా కావడంతో పెద్దగా చూసే వాళ్లు లేకపోయారు. అలాగే పెద్ద ఎత్తున ప్రమోషన్లు జరగపోవడం, జనాలకు ఈ సినిమా పేరు కూడా తెలియకపోవడంతో థియేటర్లలోకి వచ్చి వెళ్లిన విషయం కూడా ఎవరికీ తెలియలేదు.

విధాత ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సత్యానంద్ సమర్పణలో ఉపేన్ నడిపల్లి, వివేక్ పోతగోని నిర్మించిన ఈ సినిమాకు వివేక్ పోతగోని దర్శకత్వం వహించాడు. సంజన రెడ్డి, చెల్లి స్వప్న, అశోక రెడ్డి మూలవిరాట్ లతో పాటు గీతిక రధన్, టివి రామన్, ఏవిఎస్ ప్రదీప్ వంటి వాళ్లు కూడా కీలక పాత్రల్లో నటించి మెప్పించారు. అలాగే కేవీ భరద్వాజ్ ఈ సినిమాకు సంగీతం అందించగా.. వివేక్ పోతగోని సినిమాటోగ్రాఫర్ గా బాధ్యతలు నిర్వహించారు. ప్రసన్న కుమార్ పాటలు పాడగా.. పెద్దింటి అశోక్ కుమార్, వివేక్ పోతగోనిలు మాటలు అందించారు.
అద్బుతమైన కాన్సెప్ట్ వచ్చిన ఈ సినిమా ఎక్కువ కాలం ఆడలేదు. ముగ్గురు పిల్లలు కల్గిన దంపతులు.. భర్త బార్బర్ షాప్ నడిపిస్తూ.. కుటుంబ సభ్యలను పోషించేవాడు. ఉన్నకాడికి హాయిగా సాగుతున్న వీరి జీవితాల్లో బ్రెయిన్ ట్యూమర్ వచ్చి పెద్ద అగాథమే సృష్టిస్తుంది. కుటుంబ పెద్ద తండ్రికి బ్రెయిన్ ట్యూమర్ రావడంతో.. చేతికి అంది వచ్చిన కూతురు బార్బర్ షాప్ నడపాలని అనుకుంటుంది. ఈక్రమంలోనే ఆమె ఎదుర్కున్న సవాళ్లు, కుటుంబ సమస్యలు తీర్చిన విధానంతో ఈ సినిమాను తెరకెక్కించారు. నిజ జీవితంలో జరిగిన ఈ సంఘటన ఆధారంగా వచ్చిన సినిమా ప్రస్తుతం ఓటీటీలోకి వచ్చేసింది.

ప్రముఖ ఓటీటీ సంస్థ అయిన అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సాచి సినిమా స్ట్రీమింగ్ అవుతుంది. చడీ చప్పుడు లేకుండా.. సినిమా విడుదల అయిన పది నెలల తర్వాత ఈ సినిమా ఓటీటీలోకి రావడంతో అంతా షాకవుతున్నారు. అలా అని ఇండియాలో ఉన్న మీరు చూస్తారేమో. మీకు ఆ అవకాశం లేదు. భారత దేశంలో తప్ప ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా స్ట్రీమింగ్ అవుతుంది. కానీ ఇండియాలో ఇంకా అందుబాటులోకి రాలేదు. త్వరలోనే వచ్చే అవకాశం ఉంది. చూడాలి మరి ఏం జరుగుతుంది అనేది.


Click it and Unblock the Notifications











