OTT: 19ఏళ్ల తర్వాత ఓటీటీలోకి గుండెల్ని పిండేసే మూవీ.. చూశారంటే ఎమోషనల్ అవ్వాల్సిందే!

కరోనా కాలం తర్వాత ఇండస్ట్రీలో ఓటీటీకి బాగా డిమాండ్ ఏర్పడింది. సినిమాలు థియేటర్లలో రిలీజ్ అయిన నెలలోపే ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. కొన్ని అయితే వారం రోజులకే వచ్చిన సినిమాలు కూడా ఉన్నాయి. అంతేనా కొన్ని డైరెక్టుగా ఓటీటీలోనే సినిమాలను రిలీజ్ చేస్తున్నారు దర్శకనిర్మాతలు. అయితే 19 ఏళ్ల తర్వాత ఓ సూపర్ హిట్ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. దీనికోసం ఎన్నో ఏళ్లుగా ప్రేక్షకులు ఎదురుచూశారు. వారి ఎదురుచూపులకు మోక్షం కలిగిస్తూ ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫిక్స్ ఆ సినిమా ఓటీటీలోకి తీసుకువచ్చింది. అసలు ఆ సినిమా ఏంటి.. దాని కథేంటి అనే వివరాలు చూద్దాం.

ఈ మధ్య కాలంలో థియేటర్లలో రిలీజ్ అయిన నెలలోపే సినిమా ఓటీటీలోకి వచ్చేస్తుంది. కానీ ఓ 19ఏళ్ల తర్వాత ఓటీటీలోకి వచ్చింది. ఆ సినిమా మరేంటో కాదు.. బ్లాక్. ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు సంజయ్‌లీలా భన్సాలీ తెరకెక్కించిన ఈ సినిమాకు థియేటర్లలో బ్రహ్మరథం పట్టారు ప్రేక్షకులు. అసలు సంజాయ్ లీలా భన్సాలీ సినిమా అంటేనే స్పెషల్ ఫ్యాన్స్ ఉంటారు. ఆయన సినిమాలు ఎంత రిచ్‌ గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు.

Sanjay Leela Bhansali Amitabh Bachchan Black movie Streaming on Netflix ott

సినిమాలవర్స్ కు ఆయన సినిమాలు ఇష్టమే. భన్సాలీ సినిమాలు పూర్తి ఎమోషనల్‌ గా ప్రేక్షకులను కట్టిపడేస్తాయి. తను తీసే ఒక్కో సినిమా ఒక్కో కళాఖండంలా ఉంటుందంటే అతిశయోక్తి కాదు. అలా ఆయన 19 ఏళ్ల క్రితం తెరకెక్కించిన ఓ మాస్టర్‌ పీస్‌ 'బ్లాక్‌' చిత్రం ఓటీటీలోకి వచ్చేసింది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్, రాణి ముఖర్జీ ప్రధానపాత్రల్లో నటించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అప్పట్లోనే భారీ వసూళ్లు రాబట్టింది.

విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అంతేనా ఈ సినిమాను చూసి చాలా మంది ఎమోషనల్ అయిపోతారు. ఇక ఈ మూవీ విషయానికి వస్తే... హీరోయిన్‌ గా నటించిన రాణీ ముఖర్జీకి కళ్లు కనబడవు.. చెవులు వినబడవు. ఆమెకు టీచర్‌ అమితాబ్‌ బచ్చన్‌. వీరి మధ్య మంచి అనుబంధం ఏర్పడుతుంది. కానీ అతడికి క్రమంగా అల్జీమర్స్‌ (మతిమరుపు) వచ్చి రాణి ముఖర్జీని మరిచిపోతాడు. ఆ ఇద్దరి మధ్య నడిచే డ్రామానే ఈ బ్లాక్‌ కథ.

2005లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన బ్లాక్ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్‌ హిట్టుగా నిలిచింది. ఎంతోమంది మనసులను మెలిపెడుతూ ఎమోషనల్ కు గురిచేసింది. అంతేకాదు, మూడు జాతీయ అవార్డులను కూడా సొంతం చేసుకుంది. అయితే ఇప్పటివరకు ఈ సినిమా ఏ ఓటీటీలోనూ స్ట్రీమింగ్ కు రాలేదు. అయితే 19ఏళ్ల తర్వాత ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చేసింది.

తాజాగా ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ ఫ్లిక్స్‌ ఈ సినిమా గురించి శుభవార్త తెలిపింది. నేటి నుంచి నెట్‌ ఫ్లిక్స్‌ ఓటీటీలో ప్రసారం చేస్తున్నట్లు చెప్పుకువచ్చింది.ఈ మేరకు అధికారిక ప్రకటన చేసింది. దీంతో ఈ సినిమా ఫ్యాన్స్ అంతా సంబరపోతున్నారు. ఈ సినిమా ఓటీటీలోకి వస్తే బాగుండని చాలా కాలం నుంచి వెయిట్ చేసిన వారి కల ఫైనల్ గా నేరవేరింది. ఈ సండే మీరు మంచి ఎమోషనల్ మూవీ చూడాలనుకుంటే.. ఈ సినిమాను చూసి ఎంజాయ్ చేయిండి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X