OTTలోకి సంజయ్ లీలా భన్సాలీ న్యూ వెబ్ సిరీస్.. ఆరుగురు స్టార్ హీరోయిన్లు నటించిన దీన్ని ఎక్కడ చూడాలంటే?
ఈ మధ్య కాలంలో అదిరిపోయే సినిమాలు, వెబ్ సిరీస్ లు ఓటీటీ వేదికగా వస్తూ సినీ ప్రియులను తెగ అలరిస్తున్నాయి. ఓటీటీల హవా పెరిగినప్పటి నుంచి సినిమాలకు ఇచ్చిన ప్రాధాన్యతనే వెబ్ సిరీస్ లకు కూడా ఇస్తున్నారు. పెద్ద పెద్ద హీరోహీరోయిన్లు, స్టార్ డైరెక్టర్లు సైతం వెబ్ సిరీస్ లపై దృష్టి సారిస్తున్నారు. అయితే తాజాగా ఆరుగురు స్టార్ హీరోయిన్లు కలిసి నటించిన ఓ సూపర్ వెబ్ సిరీస్ ను ఓటీటీ వేదికగా విడుదల చేయబోతున్నారు. అయితే ఆ వెబ్ సిరీస్ ఏంటి, ఎక్కడ, ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ కాబోతుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
బాలీవుడ్ టాప్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ తాజాగా రూపొందించిన వెబ్ సిరీస్ హీరామండి. అదిరిపోయే కాన్సెప్ట్ తో వచ్చిన ఈ వెబ్ సిరీస్ లో ఆరుగురు స్టార్ హీరోయిన్లు నటించారు. ముఖ్యంగా మనీషా కొయిరాలా, సోనాక్షి సిన్హా, అదితి రావు హైదరీ, రిచా చద్దా, సంజీదా షేక్, షర్మిన్ సెగల్ లు ప్రధాన పాత్రల్లో కనిపించారు. బ్రిటీష్ రాజ్‌కు వ్యతిరేకంగా భారత స్వాతంత్య్ర ఉద్యమం సమయంలో లాహోర్‌లోని హీరా మండిలోని రెడ్ -లైట్ ఏరియాలోని వేశ్యల గురించి కథే ఈ వెబ్ సిరీస్.

సంజయ్ లీలా భన్సాలీ, మితాక్షర కుమార్ దర్శకులుగా పని చేస్తున్న ఈ వెబ్ సిరీస్ ను భన్సాలీ ప్రొడక్షన్స్ పై నిర్మిస్తున్నారు. అయితే అదిరిపోయే కథాంశంతో వస్తున్న ఈ వెబ్ సిరీస్ ను చూసేందుకు చాలా మంది ఆసక్తి కనబరుస్తున్నారు. ముఖ్యంగా ఆరుగురు స్టార్ హీరోయిన్లు ఈ వెబ్ సిరీస్ లో కనిపించడంతో అంతా మరింత ఎగ్జైట్ అవుతున్నారు. ఇది మాత్రమే కాకుండా సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో అనగా మరింత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.
అయితే అందా ఎంతో ఆతృతుగా ఎదురు చూస్తున్న ఈ వెబ్ సిరీస్ ను ప్రముఖ ఓటీటీ దిగ్గజం అయిన నెట్ ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ చేయనున్నారు. అసలైన వేసవి కాలం అయిన మే 1వ తేదీ నుంచి ఈ హీరామండి వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కాబోతుంది. అయితే తాజాగా ఈ వెబ్ సిరీస్ ఓటీటీ విడుదల తేదీన ప్రకటించగా.. అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎప్పుడెప్పుడు ఈ వెబ్ సిరీస్ చూద్దామా అని ఎగ్జైట్ అవుతున్నారు.

హీరామండి ప్రాంతంలో వేశ్యల కథతో పాటు అక్కడి సాంస్కృతిక వాస్తవాలను కూడా ఈ వెబ్ సిరీస్ లో చూపించబోతున్నారు. అలాగే ప్రేమ, ద్రోహం, వారసత్వం, రాజకీయాలను ప్రధానాంశాలుగా చూపించబోతున్న ఈ వెబ్ సిరీస్ ను ఇంట్లోనే కూర్చుని ఫ్యామిలీతో కలిసి చూసేయండి. ఫుల్ గా ఎంజాయ్ చేసేయండి.


Click it and Unblock the Notifications











