సంక్రాంతికి వచ్చిన 6 సినిమాలు.. OTTలో విడుదలయ్యేది ఎప్పుడంటే?

ఈ ఏడాది సంక్రాంతి బరిలో మొత్తం ఆరు సినిమాలు నిలిచాయి. తెలుగులో వచ్చినవి నాలుగే అయినా కెప్టెన్ మిల్లర్, అయలాన్ లు తెలుగులో కాస్త ఆలస్యంగా విడుదల అవుతున్నాయి. ఇప్పటికే కెప్టెన్ మిల్లర్ తెలుగు వర్షన్ విడుదల కాగా.. అయలాన్ మాత్రం ఇంకా రిలీజ్ కాలేదు. ఇదంతా ఇలా ఉండగా.. ఈ ఆరు సినిమాలు ఓటీటీ విడుదల తేదీల వివరాలు మాత్రం వెలుగులోకి వచ్చాయి. అయితే ఏ సినిమా ఎప్పుడు విడుదల కాబోతుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

ముందుగా గుంటూరు కారం. మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో వచ్చిన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్టుగా నిలిచింది. శ్రీలీల, మీనాక్షి చౌదరిలు హీరోయిన్లుగా కనిపించిన ఈ చిత్రం విడుదల అయి నెలరోజులు కూడా కకముందే ఓటీటీలోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. కేవలం 28 రోజుల వ్యవధిలో అంటే ఫిబ్రవరి 9వ తేదీన నుంచి ప్రముఖ ఓటీటీ సంస్థ అయిన నెట్ ఫ్లిక్స్ వేధికగా స్ట్రీమింగ్ కాబోతుందని సమాచారం. ఒకవేళ ఆరోజు రాకపోతే 45 రోజుల వ్యవధిలో వస్తుందని టాక్ నడుస్తోంది.

Sankranthi 2024 Released MOvies OTT Streaming Details Check Here

సంక్రాంతి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్టుగా నిలిచిన హనుమాన్ సినిమా అనుకున్న తేదీ కంటే కాస్త ఆలస్యంగా ఓటీటీలోకి రాబోతుందట. ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో తేజా సజ్జా హీరోగా వచ్చిన ఈ సినిమా డిజిటల్ హక్కులను జీ5 సంస్థ దక్కించుకుంది. అయితే మూడు వారాలకే ఓటీటీలో వచ్చేలా ముందుగా అగ్రిమెంట్ చేసుకున్నప్పటికీ.. సినిమా బ్లాక్ బస్టర్ హిట్టు కావడంతో.. ఓటీటీ విడుదల తేదీని మార్చుకున్నారట.

Sankranthi 2024 Released MOvies OTT Streaming Details Check Here

అలాగే విక్టరీ వెంకటేష్ హీరోగా వచ్చిన సైంధవ్ సినిమా బాక్సాఫీసు వద్ద ఆశించిన స్థాయిలో వసూళ్లు రాబట్టుకోలేకపోయింది. ఈ సినిమా ఓటీటీ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజామ్ ప్రైమ్ వీడియోలో ఫిబ్రవరి 3వ తేదీ నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. అలాగే నాగార్జున హీరోగా, ఆషికా రంగనాథ్ హీరోయిన్ గా నటించిన నా సామి రంగా సూపర్ డూపర్ హిట్టుగా నిలిచింది. అయితే ఈ సినిమా హక్కులను డిస్నే ప్లస్ హాట్ స్టార్ దక్కించుకుంది. ఫిబ్రవరి 15వ తేదీ నుంచి ఈ సినిమాను ఓటీటీ వేధికగా విడుదల చేయాలని చిత్రబృందం ప్లాన్ చేస్తోందట.

Sankranthi 2024 Released MOvies OTT Streaming Details Check Here

మరోవైపు ధనుష్ హీరోగా వచ్చిన కెప్టెన్ మిల్లర్ సినిమా డిజిటల్ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకుందని తెలుస్తోంది. అలాగే శివకార్తికేయన్ హీరోగా చేసిన అయలాన్ సినిమా హక్కులను కూడా అమెజాన్ ప్రైమ్ వీడియోనే దక్కించుకుంది. ఈ రెండు సినిమాలను త్వరలోనే ఓటీటీ వేధికగా విడుదల చేస్తామని ప్రకటించినప్పటికీ.. ఎప్పుడు అనే దానిపై ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. కానీ మరో నెల రోజుల్లో ఈ సినిమాలు అన్నీ ఓటీటీలోకి వచ్చేస్తాయని తెలుస్తోంది. సంక్రాంతికి వచ్చిన సినిమాలను మీరు ఇప్పటి వరకు చూసి ఉండకపోతే ఓటీటీ వేధికగా చూసి ఫుల్ గా ఎంజాయ్ చేయండి.

Sankranthi 2024 Released MOvies OTT Streaming Details Check Here

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X