Sankranthi 2024 Releases: సంక్రాంతి బరిలో 6 సినిమాలు... అవి ఏ ఓటీటీల్లో రానున్నాయో తెలుసా?

గత ఏడాది సంక్రాంతి బరిలో రెండు తెలుగు పెద్ద సినిమాలు రెండు తమిళ సినిమాలు నిలిచాయి. చిరంజీవి వాల్తేరు వీరయ్య, బాలయ్య వీరసింహరెడ్డి సినిమాలు ఉండగా.. తమిళ చిత్రాలు వారసుడు, తెగింపు చిత్రాలు సైతం బరిలో నిలిచాయి. ఇక ఈ సారి సంక్రాంతి పండగ నిరుడు లెక్క ఉండదు.. ఈసారి బరిలోకి 6 సినిమాలు వచ్చాయి. గుంటూరు కారం, సైంధవ్, నా సామిరంగా, హనుమాన్ చిత్రాలే కాకుండా తమిళ చిత్రాలు కెప్టెన్ మిల్లర్, అయలాన్ చిత్రాలు సైతం బరిలో ఉన్నాయి. ఇక ఈ చిత్రాలు ఓటీటీ వివరాలు స్టోరీలో తెలుసుకుందాం.

ఈ సంక్రాంతి పండక్కి నాలుగు తెలుగు చిత్రాలు, రెండు తమిళ చిత్రాలు బరిలో ఉన్నాయి. ఇక అన్ని పెద్ద చిత్రాలే కావడంతో థియేటర్స్ కొరతతో సినిమాల మధ్య యుద్ధమే నడుస్తుంది. ఈసారి రవితేజ ఈగల్ కూడా సంక్రాంతి బరిలో ఉండాల్సింది కానీ... థియేటర్ల కొరత.. సినిమా పరిశ్రమ కోసం.. వెనక్కి తగ్గాడు. అలా ప్రస్తుతం సంక్రాంతి బరిలో 6 చిత్రాలు నిలిచాయి. అయితే ఈసారి సంక్రాంతి సినిమాల ఓటీటీవివరాలు బయటకు వచ్చాయి.

Sankranthi 2024 Releases: Gunturkaaram, Saindhav, Hanuman, Naa Saami Ranga, Captain Miller, ayaalaan OTT Details Here

గుంటూరు కారం:సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన చిత్రం గుంటూరు కారం. ఇక ఈ సినిమాలో శ్రీలీల, మీనాక్షి చౌదరి, జగపతి బాబు, రమ్యకృష్ణ, జయరామ్ ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా జనవరి 12, 2024న విడుదల కానుంది. గుంటూరు కారం సినిమాను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ భారీ ధరకు విక్రయించిందని తెలుస్తోంది.

Sankranthi 2024 Releases: Gunturkaaram, Saindhav, Hanuman, Naa Saami Ranga, Captain Miller, ayaalaan OTT Details Here

హనుమాన్ :ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన హనుమాన్ చిత్రంలో తేజ సజ్జా హీరోగా నటించాడు. ఈ సినిమా జనవరి 12, 2024న థియేటర్లలో విడుదల కానుంది. పాన్ వరల్డ్ చిత్రంగా వస్తున్న ఈ చిత్రంలో అమృత అయ్యర్, వరలక్ష్మి శరత్‌కుమార్, వినయ్ రాయ్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రం తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళం, జపనీస్, స్పానిష్, చైనీస్ అనేక ఇతర భాషలలో విడుదల కానుంది. ఇక ఈ చిత్రాన్ని ప్రముఖ ఓటీటీ సంస్థం జీ5 భారీ ధరకు విక్రయించింది. ఇక శాటిలైట్ రైట్స్ ను కూడా జీ5 దక్కించుకున్నట్లు సమాచారం.

Sankranthi 2024 Releases: Gunturkaaram, Saindhav, Hanuman, Naa Saami Ranga, Captain Miller, ayaalaan OTT Details Here

సైంధవ్:సైలేష్ కొలను దర్శకుడిగా వెంకటేష్ దగ్గుబాటి 75వ సినిమాగా తెరకెక్కింది సైంధవ్. యాక్షన్ థ్రిల్లర్ మూవీలో వెంకటేష్, నవాజుద్ధిన్ సిద్దిక్, ఆండ్రియా జెర్మియా, శ్రద్ధా శ్రీనాథ్, ఆర్య, జయప్రకాష్, జిషు సేన్‌గుప్తా ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రం జనవరి 13, 2024న విడుదల కానుంది. సంతోష్ నారాయణన్ సంగీతం అందించారు. సైంధవ్ సినిమాను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకుంది. ఇక ఈ సినిమాను శాటిలైట్ రైట్స్ ను ఈటీవీ దక్కించుకుంది.

నా సామి రంగా:నాగార్జున ప్రధాన పాత్రలో విజయ్ బిన్ని దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం నా సామి రంగా. పీరియాడికల్ యాక్షన్ ఎంటర్‌టైనర్ 1980- 1990ల నేపథ్యంలో ఈ చిత్రం సాగనుంది. ఈ చిత్రంలో నాగార్జున, అల్లరి నరేష్, ఆశికా రంగనాథ్ ప్రధాన పాత్రలు పోషించారు. నా సామి రంగా ఓటీటీ రైట్స్ ను డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ దక్కించుకుంది. ఇక శాటిలైట్ రైట్స్ ను స్టార్ మా దక్కించుకుంది.

సంక్రాంతికి విడుదల కానున్న తెలుగు, తమిళ్ చిత్రాల ఓటీటీ వివరాలు

గుంటూరు కారం - నెట్‌ఫ్లిక్స్
సైంధవ్ - ప్రైమ్ వీడియో
హనుమాన్ - జీ5
నా సామి రంగా - డిస్నీ ప్లస్ హాట్‌స్టార్
కెప్టెన్ మిల్లర్ మరియు అయాలాన్ - ప్రైమ్ వీడియో

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X