5 ఏళ్ల తర్వాత OTTలోకి వచ్చిన సూపర్ హిట్ తమిళ్ మూవీ.. ఎలా చూడాలంటే?
ఈ మధ్య కాలంలో ఓటీటీల హవా ఎక్కువగా కొనసాగుతోంది. అనేక సినిమాలు థియేటర్లలో విడుదల అయిన అతి తక్కువ కాలానికే ఓటీటీలోకి వచ్చేస్తూ అందరినీ అలరిస్తున్నాయి. చిన్న, పెద్ద సినిమాలు అనే తేడా లేకుండా నెల తిరక్కముందే ఓటీటీలోకి వస్తుండగా.. ఓ తమిళ సూపర్ హిట్ సినిమా మాత్రం చాలా ఆలస్యంగా ఓటీటీలోకి వచ్చింది. దాదాపు ఐదేళ్ తర్వాత సైలెంట్ గా ఓటీటీలోకి వచ్చి సదండి చేస్తున్న ఈ సినిమాను ఎలా, ఎక్కడ చూడాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
కమెడియన్ సంతానం గురించి అందరికీ తెలిసిందే. అయితే ఈయన హీరోగా ఐదేళ్ల క్రితం వచ్చిన సూపర్ హిట్ సినిమానే ఏ1. రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాకు జాన్సన్ కె దర్శకత్వం వహించారు. ఈయన డైరెక్ట్ చేసిన తొలి చిత్రం ఇదే కావడం గమానార్హం. సర్కిల్‌బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై నిర్మాత ఎస్. రాజ్ నారాయణన్ ఈ చిత్రాన్ని నిర్మించగా.. సంతానం సరసన తారా అలీషా బెర్రీ హీరోయిన్ గా చేసింది.

2019 జులై 26వ తేదీన థియేటర్లలో గ్రాండ్ గా విడుదల అయిన ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం అందించారు. అలాగే గోపి జగదీశ్వరన్ ఛాయాగ్రహణ బాధ్యతలు చూసుకోగా.. లియో జాన్ పాల్ ఎడిటర్ గా పని చేశారు. ఇలా క్రేజీ కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలవగా.. బాక్సాఫీసు వద్ద భారీగానే వసూళ్లు వచ్చాయి. సినిమాలో నటించిన ప్రతీ ఒక్కరికీ మంచి పేరు వచ్చింది. అలాగే దర్శక, నిర్మాతలకు కూడా మంచి గుర్తింపు తీసుకొచ్చిందీ చిత్రం.
రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ గా నిలిచిన ఏ1 సినిమా సైలెంట్ గా ఓటీటీలోకి వచ్చేసింది. దాదాపు ఐదేళ్ల తర్వాత ఓటీటీలోకి వచ్చిన ఈ సినిమా ప్రముఖ ఓటీటీ దిగ్గజం అయిన అమెజాన్ ప్రైమ్ వీడియో వేధికగా స్ట్రీమింగ్ అవుతుంది. అలా అని నేరుగా ఈ సినిమా చూసేయొచ్చు అనుకుంటున్నారామే. అలా కుదరదండి. ఈ సినిమా చూడాలంటే కచ్చితంగా డబ్బులు చెల్లించాల్సిందే. ఎందుకు అంటే ఈ సినిమాను రెంటల్ విధానంలో తెలుగులోకి అందుబాటులోకి తీసుకు వచ్చారు.

అమెజాన్ ప్రైమ్ సబ్ స్క్రిప్షన్ ఉన్నా సరే రూ.79 చెల్లిస్తేనే మీరు ఇంట్లో కూర్చొని హాయిగా ఈ చిత్రాన్ని చూడొచ్చు. లేదంటే సినిమా చూడడం కుదరదు. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి సూపర్ డూపర్ హిట్ గా నిలిచిన ఈ సినిమా చాలా బాగుంటుంది. అద్భుతమైన కామెడీతో అంతా కలిసి నవ్వుకునేలా ఉన్న ఈ చిత్రాన్ని ఫ్యామిలీతో కలిసి హాయిగా ఇంట్లోనే కూర్చొని చూసేయండి. ఫుల్ గా ఎంజాయ్ చేసేయండి. ఇంకా ఎందుకు ఆలస్యం.


Click it and Unblock the Notifications











