OTTలో దూసుకుపోతున్న కొత్త సినిమా.. థియేటర్లలో ప్లాప్-ఓటీటీలో ట్రెండింగ్.. 240 దేశాల్లో అలా!
పేపర్ బాయ్, ఏక్ మినీ కథ, మంచి రోజులొచ్చాయ్, ది బేకర్ అండ్ ది బ్యూటి వంటి విభిన్నమైన లవ్ స్టోరీస్ తో నటుడిగా మంచి పేరు తెచ్చుకున్న యంగ్ హీరో సంతోష్ శోభన్. ప్రస్తుతం వరుస పెట్టి సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇటీవల అన్నీ మంచి శకునములే సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ ఏడాది మే 18న థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకు ప్లాప్ టాక్ వచ్చింది. కానీ ఇప్పుడు ఓటీటీలో మాత్రం ఊహించని విధంగా దూసుకుపోతోంది.
వర్షం వంటి బ్లాక్ బస్టర్ సినిమాలు అందించిన డైరెక్టర్ శోభన్ కుమారుడిగా తెలుగు సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టాడు సంతోష్ శోభన్. విభిన్నమైన కథలతో కాన్సెప్ట్ ఒరియెంటెడ్ చిత్రాలతో ఆకట్టుకునే ఈ యంగ్ హీరో చేసినవి లవ్ స్టోరిస్ అయినప్పటికీ అందులో కొత్తదనం చూపించే ప్రయత్నం చేశాడు. ఇటీవలే మరొక లవ్ అండ్ రొమాంటిక్, ఫ్యామిలీ ఎమోషన్స్ తో కలగలపిన అన్నీ మంచి శకునములే అనే సినిమాతో సందడి చేశాడు.

యూవీ క్రియేషన్ బ్యానర్ లో స్వప్న చిత్ర, మిత్రవింద మూవీస్ పతాకంపై నందిని రెడ్డి దర్శకత్వంలో ప్రియాంక దత్ నిర్మించిన చిత్రమే కల్యాణం కమనీయం. సాఫ్ట్ చిత్రాలు తెరకెక్కించే నందిని రెడ్డి దర్శకత్వం వహించడంతో సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి. కానీ మే 18న థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకు అంతగా పాజిటివ్ టాక్ రాలేదు. దీంతో మూవీ ప్లాప్ గా మిగిలిపోయింది.
ఇక ఇటీవల జూన్ 17న ఓటీటీలోకి వచ్చింది అన్నీ మంచి శకునములే మూవీ. ఇండియాతో సహా ప్రపంచవ్యాప్తంగా 240 దేశాల్లో ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో ద్వారా ఈ సినిమాను వీక్షించవచ్చు. తెలుగుతో పాటు తమిళం, హిందీ, కన్నడ, మలయాళ డబ్ వెర్షన్ స్ట్రీమింగ్ అవుతోంది. అయితే థియేటర్లలో మిశ్రమ స్పందన తెచ్చుకున్న ఈ సినిమా ఇప్పుడు ఓటీటీల్లో అదరగొడుతోంది. ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు.
అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతున్న అన్ని చిత్రాల్లో తమ సినిమా టాప్ ట్రెండింగ్ లో నిలిచినట్లు చిత్రబృందం పేర్కొంది. ట్రెండింగ్ లో మూడో స్థానంతో దూసుకుపోతున్నట్లుగా అన్నీ మంచి శకునములే మూవీ టీమ్ మేకర్స్ తాజాగా వెల్లడించారు.


Click it and Unblock the Notifications











