Kalyanam Kamaneeyam: ఓటీటీలో సంతోష్ శోభన్ మూవీ.. ఆ సీన్స్ కూడా యాడ్ చేసి!

తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎంతో మంది దర్శకుల కుమారులు హీరోలుగా పరిచయం అయ్యారు. కానీ, అందులో కొందరు మాత్రమే ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకుని సత్తా చాటుతున్నారు. తద్వారా వరుసగా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తోన్నారు. అలాంటి వారిలో ప్రముఖ దర్శకుడు శోభన్ కుమారుడు సంతోష్ శోభన్ ఒకడు. చిన్న వయసు నుంచే సినిమాల్లో నటిస్తోన్న అతడు.. హీరోగా మారిన తర్వాత వైవిధ్యాన్ని చూపిస్తూ ముందుకు సాగుతోన్నాడు. ఈ క్రమంలోనే గత సంక్రాంతికి సంతోష్ 'కళ్యాణం కమనీయం' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.

ఫుల్ లెంగ్త్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన 'కళ్యాణం కమనీయం' మూవీ ఆరంభంలోనే అందరి దృష్టినీ ఆకట్టుకోవడంతో దీన్ని సంక్రాంతి కానుకగా ఎంతో గ్రాండ్‌గా విడుదల చేశారు. అప్పుడు చిరంజీవి 'వాల్తేరు వీరయ్య', బాలకృష్ణ 'వీర సింహా రెడ్డి' మూవీలు విడుదల ఉన్నా.. దర్శక నిర్మాతలు దీన్ని కూడా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చారు. అయితే, ఈ చిత్రం మాత్రం చిత్ర యూనిట్ నమ్మకాన్ని నిలబెట్టుకోలేకపోయింది. ఆరంభంలోనే మిశ్రమ టాక్‌ను అందుకున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కూడా ఆశించిన రీతిలో స్పందనను దక్కించుకోలేదు. ఫలితంగా పరాజయం పాలైంది.

Santosh Shoban Kalyanam Kamaneeyam Streaming on AHA from February 17th

థియేటర్లలో పెద్దగా సందడి చేయలేకపోయిన 'కళ్యాణం కమనీయం' మూవీని అనుకున్న సమయానికి కంటే ముందుగానే డిజిటల్ స్ట్రీమింగ్ చేస్తారని జోరుగా ప్రచారం జరిగింది. కానీ, చిత్ర యూనిట్ మాత్రం దీనిపై ఎలాంటి ప్రకటనా చేయలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ మూవీని నెల తర్వాత అంటే ఫిబ్రవరి 17వ తేదీ నుంచే ఆహా సంస్థలో స్ట్రీమింగ్ చేయబోతున్నారు. తాజాగా దీనికి సంబంధించిన ప్రకటనను సదరు సంస్థ అధికారికంగా వదిలింది. అంతేకాదు, సెన్సార్ లేకుండానే ఈ చిత్రాన్ని స్ట్రీమింగ్ చేయబోతున్నారని తెలిసింది. దీంతో థియేటర్లలో ఈ చిత్రాన్ని మిస్ అయిన ప్రేక్షకులంతా ఆహాలో దీన్ని చూసేందుకు ఆసక్తిని చూపుతున్నారు.

యంగ్ హీరో సంతోష్ శోభన్ నటించిన తాజా చిత్రమే 'కళ్యాణం కమనీయం'. అనిల్ కుమార్ ఆళ్ల తెరకెక్కించిన ఈ మూవీలో ప్రియా భవానీ శంకర్ హీరోయిన్‌గా నటించింది. ఈ చిత్రాన్ని యూవీ కాన్సెప్టు బ్యానర్‌పై నిర్మించారు. దీనికి శ్రావణ్ భరద్వాజ్ సంగీతం అందించాడు. ఇందులో దేవీ ప్రసాద్, పవిత్ర లోకేష్, కేదార్ శంకర్, సత్యం రాజేష్, సప్తగిరిలు నటించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X