OTT ఓటీటీలో సారా ఆలీఖాన్ మర్డర్ మిస్టరీ వెబ్ సిరీస్ .. ఎప్పుడు? ఎక్కడ చూడాలంటే?

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సారా ఆలీ ఖాన్ నటించిన మర్డర్ ముబారక్ సిరీస్ ఓటీటీ రిలీజ్‌కు సిద్దమైంది. మిస్టరీ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమాకు హోమీ అదాజనియా దర్శకత్వం వహించగా.. దినేష్ విజయన్ నిర్మించారు. ఈ చిత్రంలో పంకజ్ త్రిపాఠి, సారా ఆలీ ఖాన్, విజయ్ వర్మ, డింపుల్ కాపాడియా, కరిష్మా కపూర్, సంజయ్ కపూర్, టిస్కా చోప్రా, సుహైల్ నయ్యర్, తారా అలీషా బెర్నీ తదితరులు నటిస్తున్నారు. ఈ సిరీస్ కథ ఏమిటి? ఏ ఓటీటీలో రిలీజ్ అవుతున్నది అనే వివరాల్లోకి వెళితే..

మర్డర్ ముబారక్ చిత్రం ప్రముఖ రచయిత అనుజా చౌహాన్ రచించిన క్లబ్ యూ టూ డెత్ అనే నవల ఆధారంగా రూపొందింది. ఈ సీరిస్ కథ విషయానికి వస్తే.. సంపన్నులు సభ్యులగా ఉండే ది రాయల్ ఢిల్లీ క్లబ్‌లో మర్డర్ జరుగుతుంది. సంచలన రేపిన హత్యను వెనుక కారణాలను, మిస్టరీని ఛేదించేందుకు భవానీ సింగ్ (పంకజ్ త్రిపాఠి) అనే నిప్పులాంటి పోలీస్ ఆఫీసర్ రంగంలోకి దిగుతాడు. ఈ కేసును ఎలా సాల్వ్ చేశాడు? ఈ హత్యకు వెనుక ఉన్న హస్తం ఏమిటి అనేది ఈ సినిమా కథ.

Sara Ali Khan s Murder Mubarak ready to Streaming on Netflix Here is Pankaj Tripathi movie date and other details

ఉత్కంఠగా సాగే ఈ సిరీస్‌ను 2023 ఫిబ్రవరిలో షూట్ మొదలుపెట్టారు. దీనికి లినేష్ దేశాయ్ సినిమాటోగ్రఫి, సచిన్ జిగర్ మ్యూజిక్ అందించారు. ఈ సిరీస్‌ను మడోక్ ఫిల్మ్స్ బ్యానర్‌లో నిర్మించారు. ఈ సిరీస్ ఓటీటీ హక్కులను భారీ రేటు చెల్లించి ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ దక్కించుకొన్నది.

భారీ అంచనాల మధ్య రిలీజ్ కాబోతున్న ఈ మర్డర్ మిస్టరీ చిత్రాన్ని మార్చి 15వ తేదీన నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం కానున్నది. ఇప్పటికే ఈ సిరీస్ కోసం ఎప్పుడెప్పుడా అని ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. ఈ వెబ్ సిరీస్‌ను ఏ రేంజ్‌లో ప్రేక్షకులను ఆలరిస్తుందో వేచి చూడాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X