డైరెక్ట్‌గా OTTలోకి రాబోతున్న రియల్ థ్రిల్లర్ డ్రామా, ఏంటి, ఎక్కడ చూడాలంటే?
ఈ మధ్య కాలంలోనే అనేక థ్రిల్లర్ సినిమాలు ఓటీటీ వేధికగా స్ట్రీమింగ్ అవుతున్నాయి. ముఖ్యంగా థియేటర్లలో కంటే కూడా ఓటీటీ వేధికగానే సినిమాలను విడుదల చేసేందుకు పలువురు ఆసక్తి కనబరుస్తున్నారు. చిన్న చిత్రాలు కావడమో, థియేటర్లు దొరక్క పోవడం వల్లో, పోటీనీ తట్టుకోలేకపోవడం వల్లనో ఓటీటీ వేధికగా రావాలని చూస్తున్నారు. ముఖ్యగా హర్రర్, థ్రిల్లర్ సినిమాలు అయితే ఎక్కువగా ఓటీటీ వేధికగా వచ్చేందుకు ప్లాన్ చేసుకుంటున్నాయి. అయితే తాజాగా ఓ అద్భుతమైన రియల్ థ్రిల్లర్ డ్రామా సినిమా ఓటీటీ వేధికగా స్ట్రీమింగ్ కానుంది.
సారా అలీఖన్ ప్రధాన పాత్రలో రాబోతున్న తాజా చిత్రమే ఏ వతన్ మేరే వతన్. కణ్ణన్ అయ్యర్ డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమాకు కరణ్ జోహార్, అపూర్వ మేథలు ప్రొడ్యూసర్లుగా వ్యవహరించారు. అలాగే ఇమ్రాన్ హష్మి, సచిన్ ఖేడ్కర్, అభయ్ వర్మ, స్పార్ట్ శ్రీవాత్సవ, అలెక్ట్ ఓ నేలి, ఆనంద్ తివారీ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. అద్భుతమైన కథాంశంతో.. నిజ జీవిత సంఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు.

ముఖ్యంగా భారత స్వాతంత్ర్య సమయంలో.. ఉద్యమాన్ని బలోపేతం చేసేందుకు ఓ మహిళ పడిన కష్టాలను ఈ సినిమాలో చూపించబోతున్నారు. అండర్ గ్రౌండ్ రేడియో స్టేషన్ ఏర్పాటు చేసి ఉద్యమ కారుల్లో ఉత్సాహాన్ని నింపిన విధానాన్ని ఆమె ఎదుర్కున్న సవాళ్లను సవివరంగా ఈ చిత్రం ద్వారా వివరించబోతున్నారు. ఆద్యంతం ఆకట్టుకునే విధంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించడమే కాకుండా.. నేరుగా ఈ చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేసేందుకు ప్లాన్ చేశారు.
ప్రముఖ ఓటీటీ సంస్థ అయిన అమెజాన్ ప్రైమ్ వీడియో వేధికగా సారా అలీఖాన్ ప్రధాన పాత్రలో వచ్చిన ఏ వతన్ మేరే వతన్ సినిమాను విడుదల చేయబోతున్నారు. మార్చి 21వ తేదీ నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ చేయనున్నట్లు తాజాగా అమెజాన్ ప్రైమ్ వీడియో ఎక్స్ వేధికగా వెల్లడించింది. అలాగే సినిమాకు సంబంధించిన గ్లింప్స్ ను కూడా విడుదల చేసింది. అద్భుతమైన రియల్ థ్రిల్లర్ డ్రామాగా రాబోతున్న ఈ చిత్రాన్ని మార్చి 21వ తేదీ నుంచి చూసేయండి.

నేరుగా ఓటీటీలో విడుదల కాబోతున్న ఈ సినిమాను.. ఇంట్లోనే ఫ్యామిలీ మెంబర్స్ లేదా స్నేహితులతో కలిసి కూర్చొని ఫుల్ గా ఎంజాయ్ చేయండి. అద్భుతమైన సినిమాను చూసి మరింత థ్రిల్ అవుతూ.. స్పెషల్ అనుభూతిని పొందండి.


Click it and Unblock the Notifications











