OTTలోకి మరో సెన్సేషనల్ హిట్ మూవీ.. ఫలించిన ఎదురుచూపులు.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

ఇంతకు ముందు సినిమాలు చూడాలంటే థియేటర్ల బాట పట్టాల్సిన అవసరం ఉండేది. కానీ, కరోనా లాక్ డౌన్ తర్వాత ఓటీటీల హవా విపరీతంగా పెరిగిపోయింది. అందుకు కారణం వాటిలో విభిన్న జోనర్లలో సినిమాలు, వెబ్ సిరీసులను అందించడమే. ఇక మూవీ లవర్స్ కు ఎప్పుడూ ఏ కొత్త సినిమా వస్తుందా.. ఎప్పుడూ చూసేద్దామా అన్నట్లుగా కాచుకుని కూర్చోంటారు. స్టోరీ, కంటెంట్ బాగుంటే ఎలాంటి జోనర్ అయినా తిలకిస్తారు. ఇక థియేటర్లలో సంచలనం సృష్టించిన సినిమాలు ఓటీటీలో విడుదలవుతూ ఎంటర్టైన్ మెంట్ పంచుతున్నాయి. అలా మరో సెన్సేషనల్ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ కు రెడీ అయింది.

పాపులర్ యాక్టర్ శరత్ కుమార్ (R Sarathkumar) గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేదు. అల్లు అర్జున్ బన్నీ సినిమాతో మంచి ఫేమ్ సంపాదించుకున్న ఆయన ఎన్నో తెలుగు సినిమాలతో ఆకట్టుకున్నాడు. తండ్రిగా, విలన్ గా పవర్ ఫుల్ రోల్స్ చేస్తూ అలరించారు. అలాంటి శరత్ కుమార్ పోలీస్ ఆఫీసర్ గా నటించిన సినిమానే 'పోర్ తోడిల్' (Por Thozhil). తమిళ హీరో అశోక్ సెల్వన్ (Ashok Selvan), నిఖిలా విమల్ (Nikhila Vimal) మరో ప్రధాన పాత్రలు పోషించారు.

Sarathkumar Ashok Selvan Por Thozhil Movie OTT Release Date

ప్రేక్షకులకు బాగా నచ్చిన జోనర్లలో మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ ఒకటి. అలాంటి జోనర్లో వచ్చిన ఈ పోర్ తోడిల్ (Por Thozhil Movie)సినిమా జూన్ 9న తమిళంలో థియేటర్లలో విడుదలై ఘన విజయం సాధించింది. తమిళంలో సెన్సేషన్ హిట్ గా నిలిచిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ. 50 కోట్లకుపైగా వసూళ్లను రాబట్టింది. ఇక అప్పటి నుంచి ఈ సినిమా ఓటీటీలోకి ఎప్పుడెప్పుడూ వస్తుందా అని మూవీ లవర్స్ ఎదురుచూడటం ప్రారంభించారు. ఎట్టకేలకు ఈ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేస్తున్నట్లు డేట్, ప్లాట్ ఫామ్ పై అధికారిక ప్రకటన వచ్చేసింది.

పోర్ తోడిల్ (Por Thozhil OTT) సినిమాను ప్రముఖ ఓటీటీ సంస్థ సోని లివ్ (Sony Liv)లో ఆగస్టు 11న విడుదల చేస్తున్నట్లు డిజిటల్ ప్లాట్ ఫామ్ అనౌన్స్ చేసింది. అయితే ఈ సినిమా ముందుగా ఆగస్టు 4న రిలీజ్ అవుతుందని టాక్ వచ్చింది. కానీ, అప్పుడు రిలీజ్ కాకుండా ఆగస్టు 11 శుక్రవారం విడుదల చేయనున్నట్లు సోని లివ్ ప్రకటించింది. క్రైమ్ బ్రాంచ్ లో పలు పోస్టుల్లో పని చేస్తున్న శరత్ కుమార్, అశోక్ సెల్వన్, నిఖిలా విమల్ ఓ బాలిక హత్య కేసుపై పని చేయాల్సి వస్తుంది. దాన్ని దర్యాప్తు చేస్తున్నప్పుడు వెలుగు చూసిన సంఘటనలతో తెరకెక్కిందే పోర్ తోడిల్. దీనికి విఘ్నేష్ రాజా దర్శకత్వం వహించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X