The Legend: ఓటీటీలోకి మోస్ట్ ట్రోలింగ్ మూవీ.. 8 నెలల తర్వాత స్ట్రీమింగ్

దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని ఇండస్ట్రీల నుంచి ఈ మధ్య కాలంలో ఎన్నో చిత్ర విచిత్రమైన సినిమాలు వస్తున్నాయి. కానీ, అందులో చాలా తక్కువ మూవీలు మాత్రమే నేషనల్ వైడ్‌గా హైలైట్ అవుతున్నాయి. అలా గత ఏడాది ఇండియా మొత్తంగా మారుమ్రోగుతూ సంచలనంగా మారిన సినిమానే 'ది లెజెండ్'. దీనికి కారణం ఈ చిత్రంలో ప్రముఖ వ్యాపారవేత్త శరవణన్ హీరోగా నటించడమే అన్న విషయాన్ని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆరంభంలోనే అందరి దృష్టినీ ఆకర్షించిన ఈ చిత్రం గత ఏడాది జూలైలో ప్రపంచ వ్యాప్తంగా ఎంతో గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది.

ప్రముఖ వ్యాపారవేత్త శరవణన్ హీరోగా.. తెలుగు, తమిళంలో రూపొందిన 'ది లెజెండ్' మూవీ 2022 జూలై 28న ఎంతో గ్రాండ్‌గా రిలీజ్ అయింది. తమిళంలో మాదిరిగానే ఇక్కడ కూడా ఈ చిత్రాన్ని అత్యధిక థియేటర్లలోనే విడుదల చేశారు. విడుదలకు ముందే ఎన్నో ట్రోల్స్ రావడంతో ఈ సినిమా అందరి దృష్టినీ ఆకర్షించింది. అందుకు అనుగుణంగానే దీనికి విడుదల రోజు ఊహించని రీతిలో స్పందన దక్కింది. కానీ, ఆ తర్వాత మాత్రం ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద వెలవెలబోయింది. ఫలితంగా భారీ నష్టాలతో 'ది లెజెండ్' రన్‌ను ముగించుకుంది.

Saravanan Starrer The Legend Movie Streaming on Hotstar From Today

విభిన్నమైన కాన్సెప్టుతో రూపొందిన 'ది లెజెండ్' మూవీ థియేటర్లలో ఆశించిన స్థాయిలో ఆడలేదు. దీంతో ఇది వీలైనంత త్వరగానే ఓటీటీలోకి వచ్చేస్తుందని అంతా అనుకున్నారు. కానీ, అది మాత్రం జరగలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ చిత్రం నేటి నుంచి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. దీన్ని ఈరోజు మధ్యాహ్నం 12.30 గంటల నుంచి అందుబాటులోకి తీసుకు వచ్చారు. దీంతో ఇప్పుడీ సినిమా మరోసారి నేషనల్ వైడ్‌గా ట్రెండ్ అవుతోంది. ఫలితంగా ఈ చిత్రానికి మంచి స్పందన వచ్చే అవకాశం కనిపిస్తోంది.

శరవణన్ హీరోగా జేడీ అండ్ జెర్రీ ద్వయం తెరకెక్కించిన చిత్రమే 'ది లెజెండ్'. ఊర్వశీ రౌటేలా హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాను శరవణా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై శరవణన్ స్వయంగా నిర్మించారు. దీనికి హారీశ్ జయరాజ్ సంగీతం అందించాడు. ఇందులో సుమన్ విలన్‌గా నటించగా.. ఎంతో మంది ప్రముఖులు కీలక పాత్రలు చేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X