Saripodhaa Sanivaaram OTT: సరిపోదా శనివారం ఓటీటీ రిలీజ్..! స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
Saripodhaa Sanivaaram OTT: న్యాచురల్ స్టార్ నాని బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో దూసుకుపోతున్నారు. దసరా, హాయ్ నాన్న బ్లాక్ బస్టర్ హిట్స్ తరువాత 'సరిపోదా శనివారం'తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ మూవీని డైరెక్టర్ వివేక్ ఆత్రేయ తెరకెక్కించారు. ఈ మూవీలో హీరో నానికి జతగా ప్రియాంక అరుళ్ మోహన్ నటించింది. ఇక ఎస్ జే సూర్య విలన్ పాత్రలో దుమ్మురేపారు. స్టార్ ప్రొడ్యూసర్ డీవీవీ దానయ్య ఈ సినిమాను నిర్మించారు. ఈ మూవీ పాజిటివ్ రివ్యూలు, మౌత్ టాక్‌తో సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతూ కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది.
సరిపోదా శనివారం మూవీకి సంబంధించిన టైటిల్, పోస్టర్స్, టీజర్స్ , ట్రైలర్స్ రిలీజ్ కు ముందే హై బజ్ క్రియేట్ చేశాయి. అందుకు తగ్గట్టుగానే ఆగస్టు 29వ తేదీన పాన్ ఇండియా వైడ్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ టాక్ సంపాదించుకుంది. మెయిన్ గా ఈ మూవీలో నాని - ఎస్ జే సూర్య మధ్య వచ్చే సన్నివేశాలు హైలెట్. ఇక బీజీఎమ్ కూడా ఈ సినిమాను నెక్ట్స్ లెవెల్ కు తీసుకెళ్లాయి.

ప్రస్తుతం థియేటర్లలో సక్సెస్ పుల్ గా రన్ అవుతూ.. మూవీ మేకర్స్ కు కాసుల వర్షం కురిపిస్తుంది 'సరిపోదా శనివారం'. ఈ
సినిమాకి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరలవుతుంది. అదేంటంటే.. నాని 'సరిపోదా శనివారం' సినిమా మరికొన్ని రోజుల్లోనే ఓటీటీలో ప్రత్యేక్ష కానున్నదంట. ఈ సక్సెస్ పుల్ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ రిలీజ్ కి కొన్ని నెలల ముందే భారీ మొత్తానికి సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.
సాధారణంగా ఏ సినిమా అయినా థియేటర్లలో విడుదలైన ఎనిమిది వారాల తర్వాతనే ఓటీటీ లోకి వస్తుంది. ఈ నిబంధనలే ఆ సినిమాలు పాటిస్తున్నాయి. కానీ,సరిపోదా శనివారం మూవీ టీం మాత్రం కాస్త తొందర పడుతున్నారని తెలుస్తోంది. కేవలం నాలుగు వారాలకే ఓటీటీలో స్ట్రీమింగ్ కి తీసుకొచ్చేలా ప్రయత్నిస్తున్నారనీ, ఆ విధంగానే నెట్ ఫ్లిక్స్ తో ఒప్పందం చేసుకుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ఊహాగానాల ప్రకారం సెప్టెంబర్ 27 లేదా ఆ తరువాత రెండు మూడు రోజుల్లో ఈ సినిమా ఓటీటీలో ప్రత్యేక్షం కాబోతుందని టాక్.

అయితే.. ప్రస్తుతం నాని సినిమా జోరుగా కలెక్షన్లను రాబడుతోంది. భారీ వర్షాలు, వరదలు వచ్చినా ఏ మాత్రం తగ్గడం లేదు. పైగా.. ప్రస్తుతం పెద్ద సినిమాలు కూడా లేకపోవడం కూడా సరిపోదా శనివారం మూవీకి కలిసి వస్తోంది. మరికొన్ని రోజుల పాటు ఇదే జోరు సాగితే.. ఓటీటీ స్ట్రీమింగ్ ఆలస్యం కావచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ విషయంపై మూవీ మేకర్స్ ఏ విధంగా ఆలోచిస్తారో చూడాలి. త్వరలోనే దీనిపై క్లారిటీ రానుంది.


Click it and Unblock the Notifications











