OTT: ఓటీటీలో సరిపోదా శనివారం రికార్డు.. హాలీవుడ్ మూవీస్‌‌కు మించి టాప్ రేటింగ్!

ఈ ఏడాది టాలీవుడ్ సినిమా నుంచి వచ్చిన అన్ని సినిమాలో మన స్టార్ హీరోస్ నుంచి వచ్చిన హిట్ సినిమాలు మాత్రం తక్కువే అని చెప్పాలి. దాదాపు అందరి స్టార్ హీరోలు మిడ్ రేంజ్ హీరోలు నుంచి కూడా సినిమాలు థియేటర్స్ లో వచ్చాయి కానీ అందరూ సక్సెస్ కాలేకపోయారు. ఇలా ఒకింత తెలుగులో టాప్ హీరోల సినిమాలు ఇండస్ట్రీలో కొన్ని షైన్ అయితే మరికొన్ని చతికల పడ్డాయి.

అలాగే ఒక టైం లో బాగా డ్రై వాతావరణం కొనసాగుతున్న సమయంలో ఎవరొకరు వచ్చి సినిమా థియేటర్స్ తలుపులు తీయాల్సి వచ్చింది. కాగా అలా కొంచెం థియేటర్స్ కి జనం రావడం తగ్గించారు అనే సమయంలో నాచురల్ స్టార్ నాని తన మాస్ ప్రాజెక్ట్ "సరిపోదా శనివారం" తో వచ్చాడు. కాగా నానితో అప్పటికే క్లాస్ చిత్రం "అంటే సుందరానికీ" చేసి ప్లాప్ ఇచ్చాడు.

saripodhaa sanivaaram trending in global level with record views

అయితే ఇది కంటెంట్ పరంగా మార్కులు తెచ్చుకుంది కానీ కమర్షియల్ గా అనుకున్న రేంజ్ సక్సెస్ కాలేదు. దీంతో ఈసారి మాస్ తో కొట్టాలి అన్నట్టుగా చేసిన సినిమానే ఈ సరిపోదా శనివారం. మరి ఈ చిత్రం రిలీజ్ కావడంతోనే మంచి ఓపెనింగ్స్ సాధించి నాని కెరీర్ లో మరో బెస్ట్ ఓపెనర్ గా నిలిచింది. అంతేకాకుండా నాని కెరీర్ లో 100 కోట్లకి పైగా ప్రపంచ వ్యాప్త గ్రాస్ ని అందుకొని దసరా తర్వాత మళ్ళీ రెండో 100 కోట్ల సినిమాగా నిలిచి దుమ్ము లేపింది.

ఇలా గత ఆగష్టు 29న థియేటర్స్ లో వచ్చిన ఈ చిత్రం థియేటర్స్ లో మూడు వారాలు సాలిడ్ గా రన్ అయ్యింది. మేకర్స్ ని డిస్ట్రిబ్యూటర్స్ కి కూడా మంచి లాభాలు వచ్చేసాయి. ఇక నెక్స్ట్ నాలుగో వారంలోనే సినిమా ఓటిటిలో వచ్చేసింది. కాగా ఈ సినిమాని వరల్డ్ పాపులర్ స్ట్రీమింగ్ సంస్థ నెట్ ఫ్లిక్స్ కొనుగోలు చేసి గత వారమే స్ట్రీమింగ్ కి తీసుకొచ్చింది.

అయితే ఇపుడు సరిపోదా శనివారం ఒక్క ఇండియా లోనే కాకుండా గ్లోబల్ లెవెల్లో ట్రెండింగ్ లో నిలిచి సంచలనం సెట్ చేసింది. నాని గత చిత్రం హాయ్ నాన్న అయితే ఇండియా వైడ్ గా వారాలు ట్రెండింగ్ ల్లో నిలిచింది కానీ ఈ ఏడాదిలో మన తెలుగు సినిమాల నుంచి గ్లోబల్ ఛార్ట్స్ లో నిలిచింది సరిపోదా శనివారం అని తెలుస్తుంది.

saripodhaa sanivaaram trending in global level with record views

కాగా నెట్ ఫ్లిక్స్ లో నాన్ ఇంగ్లీష్ చిత్రాల జాబితాలో గత సెప్టెంబర్ 23 నుంచి 29 మధ్యలో ట్రెండింగ్ లొస్త్ లో సరిపోదా శనివారం గ్లోబల్ గా 6వ స్థానాన్ని దక్కించుకుంది. అంతే కాకుండా నెట్ ఫ్లిక్స్ లో భారీ మొత్తంలో ఒక్క మొదటి వారంలో 26 లక్షల మందికి పైగా సినిమాని వీక్షించారట.

దీనితో గ్లోబల్ లెవెల్లో ఓటిటిలో నాని సినిమా మాస్ చూపిస్తుంది అని చెప్పాలి. కాగా ఈ సినిమాలో నాని సరసన ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటించగా ప్రముఖ దర్శకుడు ఎస్ జే విలన్ రోల్ లో నటించారు. అలాగే డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణం అందించిన సంగతి తెలిసిందే.

More from Filmibeat

Read more about: nani sj suryah jakes bejoy
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X