మీ ఇంట్లోకే వచ్చి క్షుద్రపూజలు చేయబోతున్న సత్యం రాజేశ్.. ఎలా, ఎప్పటి నుంచో తెలుసా?
ఓటీటీలో విడుదలై సక్సెస్ అయిన పొలిమేర చిత్రానికి సీక్వెల్‌గా వచ్చిన హర్రర్ మూవీ 'మా ఊరి పొలిమేర 2' సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సత్యం రాజేష్ ప్రధాన పాత్ర చేసిన దీన్ని అనిల్ విశ్వనాథ్ తెరకెక్కించారు. ఇందులో కామాక్షి భాస్కర్ల, బాలాదిత్య, గెటప్ శ్రీను, రాకేందు మౌళి తదితరులు నటించారు. ఈ చిత్రాన్ని శ్రీ కృష్ణ క్రియేషన్స్ బ్యానర్‌పై గౌరీ కృష్ణ నిర్మించారు. దీనికి జ్ఞాని సంగీతం అందించారు.
చేతబడులు చేసే కాన్సెప్టుతో వచ్చిన ఈ భయంకరమైన చిత్రం నవంబర్ 3వ తేదీన థియేటర్లలో గ్రాండ్ గా విడుదల అయింది. సినిమా అద్భుతమైన టాక్ ను సొంతం చేసుకని హిట్టు దిశగా దూసుకెళ్తోంది. ఇప్పటికీ థియేటర్లలో నడుస్తున్న ఈ సినిమా అతి తక్కువ కాలంలో ఓటీటీలోకి తీసుకు రాబోతున్నారు. మెల రోజులు అయ్యిందో లేదో ఈ చిత్రాన్ని నేరుగా ఓటీటీలో విడుదల చేయబోతున్నారు. అయితే ఎందులో, ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ కాబోతుందనే విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం.

మా ఊరి పొలిమేర 2 సినిమా ప్రముఖ ఓటీటీ సంస్థ అయిన ఆహాలో డిసెంబర్ 8వ తేదీన విడుదల కాబోతుంది.ఈ విషయాన్ని నేరుగా చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. డిసెంబర్ 8వ తేదీ నుంచి ఇంట్లో కూర్చొని ఓటీటీ ప్రియులు సినిమను చూడచ్చు. అద్భుతైన హిట్టుగా నిలిచిన ఈ భయపెట్టే సినిమాను ఫ్యామిలీతో కలిసి చూడండి. ఫుల్లుగా ఎంజాయ్ చేయండి. ఆహా గోల్డ్ సబ్ స్క్రిప్షన్ ఉన్న వాళ్లు అయితే ఒక రోజు ముందు అంటే 2 గంటల ముందుగానే ఈ చిత్రాన్ని చూడవచ్చు. అంటే డిసెంబర్ 7వ తేదీనే వీక్షించవచ్చు.
చేతబడుల కాన్సెప్టుతో వచ్చిన 'మా ఊరి పొలిమేర' పార్ట్ 1 సినిమా ఓటీటీ వేదికగా విడుదల అయి భారీ స్పందన అందుకుంది. పార్ట్ 1 డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వేదికగా స్ట్రీమింగ్ కాగా పార్ట్ 2 మాత్రం ఆహా చేతికి వెళ్లింది. ఓటీటీలో బ్లాక్ బస్టర్ హిట్టుగా నిలిచిన పార్ట్ 1 పొలిమేర చిత్రానికి సీక్వెల్ కూడా తీసుకొస్తే బాగుంటుందని భావించిన చిత్రబృందం 'మా ఊరి పొలిమేర 2' మూవీని థియేటర్లలో తీసుకు రావాలని డిసైడ్ అయ్యారు. అదే విషయాన్ని అధికారికంగా ప్రకటించగా అనూహ్య స్పందన వచ్చింది. ఇలా సినిమాను తీసుకొచ్చారు మూవీం టీం.

పొలిమేర 2 సినిమాకు సంబంధించిన ప్రచార చిత్రాలకు కూడా విపరీతమైన స్పందన రావడంతో సినిమా చూసేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపించారు. ఇలా చిత్రం బ్లాక్ బస్టర్ హిట్టుగా నిలిచింది. ఇక ఇంకెందుకు ఆలస్యం థియేటర్లకు వెళ్లి సినిమా చూడలేరని వాళ్లంతా ఇంట్లోనే ఉండి ఈ అద్భుతమైన చిత్రాన్ని ఆస్వాదించండి.


Click it and Unblock the Notifications











