ఫేమస్ ఓటీటీలో సత్యదేవ్ కృష్ణమ్మ.. ఏంటి అన్ని రోజులకే వచ్చేస్తుందా!
తెలుగు చిత్ర పరిశ్రమలో టాలెంట్ ఉన్న ఎంతో మంది యంగ్ హీరోలు ఉన్నారు. కానీ, అందులో అతి తక్కువ మంది మాత్రమే విలక్షణమైన నటనతో విభిన్నమైన సినిమాలు చేస్తున్నారు. అలాంటి వారిలో టాలెంటెడ్ గాయ్ సత్యదేవ్ ఒకడు. కెరీర్ ఆరంభం నుంచీ డిఫరెంట్ కాన్సెప్టులతో సినిమాలు చేస్తోన్న అతడు.. తాజాగా 'కృష్ణమ్మ' అనే చిత్రంలో నటించాడు.
సత్యదేవ్ హీరోగా, వీవీ గోపాలకృష్ణ తెరకెక్కించిన చిత్రమే 'కృష్ణమ్మ'. ఎమోషనల్ అండ్ మాస్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రాన్ని బడా డైరెక్టర్ కొరటాల శివ సమర్పించడంతో దీనిపై అందరి దృష్టి పడింది. తర్వాత ప్రచార చిత్రాలు ఆకట్టుకోవడంతో అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఫలితంగా ఈ సినిమా మే 10వ తేదీన ఎంతో గ్రాండ్‌గా విడుదల అయింది.

సత్యదేవ్ హీరోగా చేసిన 'కృష్ణమ్మ' సినిమా శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రానికి ప్రీమియర్స్ నుంచి డీసెంట్ టాక్ వచ్చింది. కానీ, నార్మల్ షోలకు వచ్చే సరికి మిక్స్‌డ్ టాక్ అయింది. అయినప్పటికీ ఇది ఆడియెన్స్‌ను రప్పించడంలో సఫలం అయింది. ఫలితంగా ఈ సినిమాకు మొదటి రోజు మంచి వసూళ్లు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.
ఎమోషనల్ మాస్ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన 'కృష్ణమ్మ' సినిమా సందడి ఇప్పటికే థియేటర్లలో రన్ అవుతుండగా.. ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ వివరాలు తాజాగా రివీల్ అయ్యాయి. దీని ప్రకారం.. ఈ సినిమాను తీవ్ర పోటీ నడుమ అమెజాన్ ప్రైమ్ సంస్థ కొనుగోలు చేసిందట. ఇందుకోసం సదరు సంస్థ నిర్మాతలకు మంచి మొత్తాన్నే ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి.

విలక్షణ నటుడు సత్యదేవ్ నటించిన 'కృష్ణమ్మ' సినిమాను థియేటర్లలో విడుదలైన 30 రోజుల తర్వాతనే ఓటీటీలో స్ట్రీమింగ్ చేసేలా అమెజాన్ ప్రైమ్ సంస్థతో నిర్మాతలు ఒప్పందం చేసుకున్నారని కూడా ఓ న్యూస్ తాజాగా బయటకు వచ్చింది. అంటే మే 10వ తేదీన విడుదలైన ఈ చిత్రం జూన్ రెండో వారంలో స్ట్రీమింగ్ అయ్యే ఛాన్స్ ఉందని చెప్పుకోవచ్చు.
ఇదిలా ఉండగా.. 'కృష్ణమ్మ' సినిమాను అరుణాచల క్రియేషన్స్ బ్యానర్‌పై కొరటాల శివ సమర్పణలో కృష్ణ కొమ్మలపాటి నిర్మించారు. ఇందులో అనిత రాజ్ హీరోయిన్‌గా నటించగా.. మీసాల లక్ష్మణ్, కృష్ణ బూరుగుల, అర్చన తదితరులు నటించారు. కాల భైరవ దీనికి మ్యూజిక్‌ను కంపోజ్ చేశాడు.


Click it and Unblock the Notifications











