షాకింగ్: వారానికే ఓటీటీలోకి వచ్చిన హిట్ మూవీ.. థ్రిల్ చేసే దీన్ని ఎక్కడ చూడాలంటే!

టాలీవుడ్‌లో అతి తక్కువ మంది హీరోలు మాత్రమే తమదైన నటనతో ప్రేక్షకులను ఫిదా చేస్తూ ప్రత్యేకంగా నిలుస్తున్నారు. అలాంటి వారిలో టాలెంటెడ్ గాయ్ సత్యదేవ్ ఒకడు. ఆరంభం నుంచీ విభిన్నమైన చిత్రాలతో వస్తోన్న అతడు.. విజయాలను పెద్దగా అందుకోవడం లేదు. కానీ, ఈ సారి ఎలాగైనా సక్సెస్ సాధించాలన్న లక్ష్యంతో 'కృష్ణమ్మ' అనే సినిమాతో వచ్చేశాడు.

విలక్షణ నటుడు సత్యదేవ్ హీరోగా, వీవీ గోపాలకృష్ణ తెరకెక్కించిన చిత్రమే 'కృష్ణమ్మ'. ఎమోషనల్ అండ్ మాస్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమాను బడా డైరెక్టర్ కొరటాల శివ సమర్పించడంతో దీనిపై అందరి ఫోకస్ పడింది. తర్వాత ప్రచార చిత్రాలు ఆకట్టుకోవడంతో అంచనాలు పెరిగిపోయాయి. ఫలితంగా ఈ సినిమా మే 10వ తేదీన గ్రాండ్‌గా విడుదల అయింది.

Satyadev Kancharana Starrer Krishnamma Movie Digital Streaming Started

సత్యదేవ్ హీరోగా చేసిన 'కృష్ణమ్మ' సినిమాకు ప్రీమియర్స్ నుంచి డీసెంట్ టాక్ వచ్చింది. కానీ, నార్మల్ షోలకు వచ్చే సరికి మిక్స్‌డ్ టాక్ అయింది. అయినప్పటికీ ఇది ఆడియెన్స్‌ను రప్పించడంలో సఫలం అయింది. ఫలితంగా ఈ సినిమాకు మొదటి రోజు మంచి వసూళ్లు వచ్చాయి. ఇలా ఆరు రోజుల్లోనే ఇది బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను చేరుకుని హిట్‌గా నిలిచింది.

ఎమోషనల్ అండ్ మాస్ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన 'కృష్ణమ్మ' సినిమాపై అందరిలోనూ అంచనాలు నెలకొన్నాయి. దీంతో ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులకు మంచి పోటీ కూడా ఏర్పడింది. ఇలాంటి పరిస్థితుల్లో అమెజాన్ ప్రైమ్ సంస్థ ఈ రైట్స్‌ను కొనుగోలు చేసింది. ఇందుకోసం సదరు సంస్థ నిర్మాతలకు మంచి మొత్తాన్నే ఇచ్చినట్లు తెలుస్తోంది.

Satyadev Kancharana Starrer Krishnamma Movie Digital Streaming Started

సత్యదేవ్ నటించిన 'కృష్ణమ్మ' సినిమాను థియేటర్లలో విడుదలైన 30 రోజుల తర్వాతనే ఓటీటీలో స్ట్రీమింగ్ చేస్తారని ప్రచారం జరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో కేవలం వారం రోజుల్లోనే ఈ చిత్రం అందుబాటులోకి వచ్చేసింది. అమెజాన్ ప్రైమ్ సంస్థ దీన్ని గత అర్ధరాత్రి నుంచే స్ట్రీమింగ్ చేస్తోంది. తద్వారా ఈ మధ్య కాలంలో ఇంత త్వరగా వచ్చిన చిత్రంగా ఇది నిలిచింది.

ఇదిలా ఉండగా.. సత్యదేవ్ - వీవీ గోపాలకృష్ణ కాంబినేషన్‌లో రూపొందిన 'కృష్ణమ్మ' సినిమాను అరుణాచల క్రియేషన్స్ బ్యానర్‌పై కొరటాల శివ సమర్పణలో కృష్ణ కొమ్మలపాటి నిర్మించారు. ఇందులో అనిత రాజ్ హీరోయిన్‌గా నటించగా.. మీసాల లక్ష్మణ్, కృష్ణ బూరుగుల, అర్చన తదితరులు నటించారు. కాల భైరవ దీనికి మ్యూజిక్‌ను అందించాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X