ఓటీటీలో బెస్ట్ మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్ మూవీ.. సడన్‌గా వచ్చిన దీన్ని ఎక్కడ చూడాలంటే!
తెలుగు చిత్ర పరిశ్రమలో గతంలో కంటే ఈ మధ్య కాలంలో క్రైమ్ థ్రిల్లర్ మూవీలు ఎక్కువగా వస్తున్న సంగతి తెలిసిందే. అలాంటి వాటికి థియేటర్లతో పాటు ఓటీటీలోనూ అదిరిపోయే స్పందన లభిస్తోంది. ఫలితంగా ఇలాంటి సినిమాలు మంచి విజయాలను, ఫీడ్ బ్యాక్‌ను అందుకుంటున్నాయి. అలా ఇటీవలే విడుదలైన మరో క్రైమ్ థ్రిల్లర్ మూవీనే 'టెనెంట్' (Tenant).
సత్యం రాజేష్ ప్రధాన పాత్రలో వై యుగంధర్ దర్శకత్వంలో రూపొందిన చిత్రమే 'టెనెంట్'. హత్య, ఆత్మహత్య వెనుకున్న మిస్టరీని ఛేదించే కథతో ఈ సినిమా రూపొందింది. దీనికితోడు ప్రచార చిత్రాలు ఆకట్టుకోవడంతో ఈ మూవీ ఆరంభంలోనే అందరి దృష్టిని ఆకర్షించింది. ఫలితంగా విడుదలకు ముందే భారీ స్థాయిలో అంచనాలను కూడా ఏర్పరచుకుంది.

మంచి బజ్‌తో 'టెనెంట్' మూవీ ఏప్రిల్ 19వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా ఎంతో గ్రాండ్‌గా రిలీజ్ అయింది. కానీ, ఆరంభంలోనే ఈ సినిమాకు మంచి టాక్ రాలేదు. దీనికి కారణం ఇందులో పాయింట్ పర్‌ఫెక్ట్‌గా ఉన్నా.. రోటీన్‌గా సాగడం.. పైగా దాన్ని చూపించిన విధానం కాస్త నిరాశ పరచడమే. ఫలితంగా ఈ చిత్రం టార్గెట్‌ను చేరుకోలేక పరాజయాన్ని మూటగట్టుకుంది.
క్రేజీ కాంబినేషన్‌లో ఆద్యంతం థ్రిల్ చేసేలా రూపొందిన మూవీ కావడంతో పాటు విడుదలకు ముందే అంచనాలను ఏర్పరచుకోవడంతో 'టెనెంట్' డిజిటల్ స్ట్రీమింగ్ హక్కుల కోసం ఓటీటీ సంస్థ నుంచి మంచి పోటీనే వచ్చింది. ఈ పరిస్థితుల్లో ఈ మూవీ ఓటీటీ రైట్స్‌ను అమెజాన్ ప్రైమ్ సంస్థ సొంతం చేసుకుంది. ఇందుకోసం మంచి మొత్తాన్నే నిర్మాతలకు ముట్టజెప్పింది.

సత్యం రాజేష్ ప్రధాన పాత్రలో నటించిన 'టెనెంట్' మూవీని అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ గత ఆర్ధరాత్రి నుంచే స్ట్రీమింగ్‌కు తీసుకు వచ్చేసింది. సాధారణ సబ్‌స్క్రిప్షన్ ఉన్న వాళ్లు కూడా ఈ సినిమాను అందులో చూసేలా స్ట్రీమింగ్ చేస్తోంది. ఇక, థియేటర్లలో మాదిరిగా కాకుండా అమెజాన్ ప్రైమ్ వీడియోలో 'టెనెంట్'కు మంచి రెస్పాన్స్ లభిస్తోందని తెలిసింది.
ఇదిలా ఉండగా.. సత్యం రాజేష్ - వై యుగంధర్ కాంబినేషన్‌లో రూపొందిన 'టెనెంట్' చిత్రాన్ని మహాతేజ క్రియేషన్స్ బ్యానర్‌పై చంద్రశేఖర్ మొగుల్ల నిర్మించారు. ఇందులో మేఘా చౌదరి హీరోయిన్‌గా.. భరత్ కాంత్, చందన పయ్యావుల, ఆడుకాలమ్ నరేన్, ఎస్తర్ తదితరులు నటించారు. ఈ మూవీకి సాహిత్య సాగర్ మ్యూజిక్ ఇచ్చారు.


Click it and Unblock the Notifications











