Save the Tiger 2 ఇండియాలో టాప్ లేపిన సేవ్ ది టైగర్.. వెబ్ సిరీస్‌లో ఎన్నో స్థానమంటే?
సెన్సేషనల్ డైరెక్టర్ మహీ వీ రాఘవ షో రన్నర్‌గా అరుణ్ కొత్తపల్లి దర్శకత్వంలో మహీ వీ రాఘవ, చిన్నా వాసుదేవ్ రెడ్డి నిర్మాతలుగా వ్యవహరించి రూపొందించిన వెబ్ సిరీస్ సేవ్ ది టైగర్స్ 2. సీరత్ కపూర్, ప్రియదర్శి పులికొండ, అభినవ్ గోమటం, హర్ష వర్ధన్, గంగవ్వ, కృష్ణ చైతన్య, జోర్దార్ సుజాత, రోహిణి, ముక్కు అవినాష్, పావని గంగిరెడ్డి, శ్రీకాంత్ అయ్యాంగర్, వేణు ఎల్దండి తదితరులు కీలక పాత్రల్లో నటించారు. మార్చి 15వ తేదీన ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ+హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతున్నది. అయితే ఈ వెబ్ షో ప్రస్తుతం ఓటీటీలో అరుదైన రికార్డును సొంతం చేసుకొన్నది. ఆ వివరాల్లోకి వెళితే..
మధ్య తరగతి కుటుంబాలు కష్టసుఖాలు, వారి జీవితాల్లో ఉండే భావోద్వైగమైన అంశాలతో వినోదాత్మకంగా ఈ వెబ్ షోను రూపొందించారు. ఓటీటీలో మొదటి సీజన్‌కు అనూహ్యమైన స్పందన లభించింది. దాంతో ఈ సీజన్ కొనసాగింపుపై ఆసక్తి, ఎదురు చూపులు పెరిగాయి. ఆ క్రమంలో సేవ్ దీ టైగర్స్ వెబ్ సిరీస్ 2 ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి సీజన్‌కు లభించిన స్పందన కంటే రెండో సీజన్‌కు భారీగా రెస్పాన్స్ వచ్చింది. ఓటీటీలో ఇటీవల స్ట్రీమింగ్ అవుతున్న అన్ని వెబ్ సిరీస్‌ల కంటే అత్యధిక వ్యూయింగ్ మినట్స్ వచ్చాయి.

ఢిస్నీ+హాట్ స్టార్ ఓటీటీ మాధ్యమంలో సేవ్ ది టైగర్స్ సిరీస్‌కు టాప్ 3 మూడో స్థానం లభించింది. తాము రూపొందించిన వెబ్ షోకు అత్యధిక రేటింగ్ దక్కడంతో షో రన్నర్ మహీ వీ రాఘవ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. కంటెంట్ బాగుంటే.. ప్రేక్షకులు ఆదరిస్తారనే విషయాన్ని ప్రేక్షకులు మరోసారి రుజువు చేశారు. మేము ఊహించిన దాని కంటే ఎక్కువగా ఫలితాన్ని అందించింది. ఇంత పెద్ద విజయం దక్కినందుకు మా యూనిట్ సభ్యులకు నా ధన్యవాదాలు అని అన్నారు.
మానవ సంబంధాలు, వివాహ వ్యవస్థకు సంబంధించిన అంశాలను ఆధారంగా చేసుకొన్న వెబ్ షో ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయింది. చక్కటి కథలను ఆవిష్కరిస్తే అవి మంచి విజయాలను సాధిస్తాయని దీంతో రుజువైంది. కామెడీ వెబ్ షోలను ప్రేక్షకులు ఫ్యామిలీ చిత్రాలను భావిస్తారని నమ్మకం కుదిరింది అని మహీ వీ రాఘవ పేర్కొన్నారు.
సేవ్ ది టైగర్ 2 సంచలన రీతిలో, అత్యధిక వ్యూస్ సాధించిన వెబ్ సిరీస్‌గా రికార్డు సాధించిన నేపథ్యంలో చిత్ర యూనిట్.. మూడో సీజన్‌ను శరవేగంగా చిత్రీకరించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. త్వరలోనే సేవ్ ది టైగర్ 3 సీరీస్ ప్రేక్షకుల ముందుకు రానున్నది.


Click it and Unblock the Notifications











