Save The Tigers 2 ఓటీటీలో దుమ్మురేపుతున్న సేవ్ ది టైగర్స్ 2.. సీజన్ 1 కు మించి ఊహించని రెస్పాన్స్!
యువ దర్శకుడు, నిర్మాత మహీ వీ రాఘవ రూపొందించిన తాజా వెబ్ సిరీస్ సేవ్ ది టైగర్స్. గతేడాది విడుదలై ఓటీటీలో క్రేజీ సక్సెస్ సాధించిన ఈ సిరీస్‌కు సీక్వెల్‌గా సేవ్ ది టైగర్స్ 2 ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సీజన్‌కు షో రన్నర్‌గా మహీ వీ రాఘవ వ్యవహరించారు. మార్చి 15 తేదీన రిలీజైన ఈ వెబ్ సిరీస్‌లో ప్రియదర్శి, అభినవ్ గోమటం, చైతన్య, సీరత్ కపూర్ తదితరులు నటించారు. ఈ సీక్వెల్ 2కు ఓటీటీలో దుమ్ము దులిపేస్తున్నది. ఈ సిరీస్‌కు సంబంధించిన వివరాల్లోకి వెళితే..
అరుణ్ కొత్తపల్లి దర్శకత్వంలో ప్రియదర్శి, అభినవ్ గోమటం, కృష్ణ చైతన్య, పావని గంగిరెడ్డి, జోర్దార్ సుజాత, తేజస్విని శర్మ మూడు జంటలుగా నటించారు. ఇక కిడ్నాప్ గురైన సినీ తారగా సీరత్ కపూర్ నటించారు. అయితే భార్యభర్తల మధ్య కలహాలు, ప్రేమాభిమానాల చుట్టు అల్లుకొన్న మధ్య తరగతి కుటుంబాలకు చెందిన బ్యాక్ డ్రాప్‌కు బ్రహ్మండమైన రెస్పాన్స్ వస్తున్నది.

డిస్నీ+హాట్ స్టార్‌లో రిలీజైన ఈ సిరీస్‌కు రికార్డు స్థాయి వ్యూయింగ్ మినిట్స్ నమోదైనట్టు చిత్ర యూనిట్ వెల్లడించింది. తొలి సీజన్‌కు మించి రెస్పాన్స్‌ను కూడగట్టుకోవడంపై ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. సీజన్ 1 సకెస్స్ తర్వాత ఛాలెజ్‌గా తీసుకొని నిర్మించిన కామెడీ, ఎమోషనల్ సిరీస్‌కు ఊహించని రెస్పాన్స్ రావడంపై షో రన్నర్ మహీ రాఘవ సంతృప్తిని వ్యక్తం చేశారు.
మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఉండే ఎమోషన్స్, సరదా సన్నివేశాలు ప్రేక్షకులు తమ జీవితాలకు అన్వయించుకొనేలా ఉండటం వల్ల ఈ సిరీస్‌కు మంచి స్పందన వస్తున్నది. భారతీయ కుటుంబాల మూలాలను ఆధారంగా చేసుకొని కథలు చెప్పాలనుకొంటున్నాం అని మహీ వీ రాఘవ అన్నారు.

సేవ్ ది టైగర్స్ 2 వస్తున్న రెస్పాన్స్ తర్వాత మా బ్యానర్‌లో విభిన్నమైన కంటెంట్‌తో ఉన్న చిత్రాలను నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్నాం. కొత్త దర్శకులు, రచయితలను ఎంకరేజ్ చేస్తున్నాం . ఓటీటీలో తెలుగుదనం ఉట్టిపడే చిత్రాలను, సిరీస్‌లను అందించే ప్రయత్నం చేస్తున్నాం అని మహీ వీ రాఘవ చెప్పారు.


Click it and Unblock the Notifications











