Save The Tigers 2 ఓటీటీలోకి సూపర్ హిట్ ఫ్యామిలీ డ్రామా.. సేవ్ ది టైగర్స్ ఎక్కడ? ఎప్పుడు రిలీజ్ అంటే?
తెలుగు వెబ్ సిరీస్‌లో సూపర్ హిట్ అయిన వాటిలో సేవ్ ది టైగర్స్ ముందుంటుంది. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ సిరీస్ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకొన్నది. అయితే ఓటీటీ ప్రేక్షకులు ఈ సిరీస్‌ను ఆదరించిన తీరు చూసి వెంటనే రెండో సీజన్‌ను మొదలు పెట్టి పూర్తి చేశారు. ఈ వెబ్ సిరీస్‌ను ఎప్పుడెప్పుడు చూద్దామా? అనే వారికి చిత్ర యూనిట్ శుభవార్తను అందించారు. సేవ్ ది టైగర్స్ 2 సీజన్ ఎప్పడు స్ట్రీమింగ్ అవుతుంది? దానిని ఎక్కడ చూడాలి అనే వివరాల్లోకి వెళితే..
సేవ్ ది టైగర్స్ సీజన్ 1 కు ఊహించని రెస్సాన్స్ వచ్చింది. యూత్, ఫ్యామిలీ ఆడియెన్స్ ఆదరించడంతో డిస్నీ హాట్ స్టార్‌లో అత్యధికంగా స్ట్రీమింగ్ వ్యూస్ వచ్చాయి. సినీ విమర్శకుల ప్రశంసలు అందుకోవడంతో భారీ హిట్ సొంతం చేసుకొన్నది. దాంతో సీజన్ 2పై భారీ అంచనాలు పెరిగాయి.

భారీ అంచనాలతో వస్తున్న ఈ సిరీస్‌లో నటీనటులు ప్రియదర్శి, అభినవ్ గోమటం, చైతన్యకృష్ణ, పావని, జోర్దార్ సుజాత, శ్రీకాంత్ అయ్యంగార్, గంగవ్వ, వేణు యెల్దండి, సీరత్ కపూర్, పావని గంగిరెడ్డి, దేవయాని, దర్శన బానిక్, హర్ష వర్థన్ కీలక పాత్రలు పోషించారు.
ఫ్యామిలీ ఎమోషన్స్, ఫన్ తదితర అంశాలతో సేవ్ ది టైగర్స్‌ను ప్రముఖ దర్శకుడు మహీ వీ రాఘవ్, ప్రదీప్ అద్వైతం క్రియేటివ్ హెడ్స్‌గా వ్యవహరించారు. ఈ సిరీస్‌కు అరుణ కొత్తపల్లి దర్శకత్వం వహించారు. ఈ వెబ్ సిరీస్‌ను ప్రముఖ ఓటీటీ సంస్థ డీస్నీ+హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ కానున్నది.

సేవ్ ది టైగర్స్ సిరీస్ స్క్రిప్టు కోసం ప్రదీప్, విజయ్, కార్తీక్ వర్క్ చేశారు. దర్శకుడు అరుణ్ స్క్రిప్టును అద్బుతంగా తెరమీదకు తెచ్చారు. ఫస్ట్ సీజన్ కంటే రెండో సీజన్ మరింత ఆకట్టుకొంటుందనే విశ్వాసాన్ని టీమ్ మెంబర్స్ వ్యక్తం చేశారు. వినోదం, ఫ్యామిలీ ఎమోషన్స్ బాగా కనెక్ట్ అవుతాయని చెప్పారు.
ఇక తెలుగు ఓటీటీ అభిమానులు ఎదురు చూస్తున్న ఈ వెబ్ సిరీస్ డిస్నీ+హాట్ స్టార్‌లో మార్చి 15వ తేదీన స్ట్రీమింగ్ కానున్నది. ఫన్, కామెడీతో కూడిన ఈ సిరీస్ ఎలాంటి అనుభూతిని పంచుతుందో అనేది వేచి చూడాల్సిందే. దర్శకుడు మహీ వీ రాఘవ్ మార్క్ మరోసారి కనిపిస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది.


Click it and Unblock the Notifications











