OTTలోకి ఫుల్ ఫన్ అండ్ క్లీన్ ఎంటర్ టైనర్... స్ట్రీమింగ్ ఎక్కడంటే?

ఓటీటీలోకి ఫుల్ ఫన్ అండ్ క్లీన్ ఎంటర్టైనర్ వచ్చేస్తోంది. కడుపుబ్బా నవ్వేందుకు ప్రేక్షకులు రెడీ అయిపోండి. గత ఏడాది భార్యల చేతిల్లో నలిగిపోతున్న భర్తల బాధలు ఎలా ఉంటాయో చూపించిన సేవ్ ది టైగర్స్ ఎంతగా ఆకట్టుకుందో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఈ సిరీసుకు రెండో సీజన్ రాబోతుంది. సేవ్ ది టైగర్స్ సీజన్ 2 స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ అయింది. ఇక ఈ సారి డబుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుందని మేకర్స్ చెబుతున్నారు. మరి పూర్తి వివరాలు ఈస్టోరీలో చూద్దాం పదండి.

డిస్ని ప్లస్ హాట్ స్టార్ ఓటీటీ వేదికగా :కమెడియన్, క్యారెక్టర్ ఆర్టిస్టు ప్రియ‌ద‌ర్శి, ఈ నగరానికి ఏమైంది, మస్త్ షేడ్స్ ఉన్నాయ్ రా సినిమాల ఫేం అభిన‌వ్ గోమ‌ఠం, నటుడు చైత‌న్య కృష్ణ తదితరులు ప్రధాన పాత్రలు పోషించిన వెబ్ సిరీస్ సేవ్ ది టైగర్స్. ఈ సిరీస్ గత ఏడాది డిస్ని ప్లస్ హాట్ స్టార్ ఓటీటీ వేదికగా రిలీజ్ అయింది. విడుదల అయిన మొదటి రోజు నుంచే ఈ సిరీసుకు మంచి రెస్పాన్స్ అయితే దక్కింది. ఆడియెన్స్ కడుపుబ్బా నవ్వుకున్నారు. చాలా మంది ఈ సిరీసును ఎంజాయ్ చేశారు.

Save The Tigers Season 2 Web Series Streaming on Disney Plus Hotstar OTT From March 10th Full Details Here

ఫుల్ ఫన్ అండ్ క్లీన్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా:భార్యల చేతిల్లో నలిగిపోతున్న భర్తల బాధలు ఎలా ఉంటాయో ఈ సిరీసులు నవ్వులు పూయిస్తునే ఎమోషలన్ గా చూపించారు. ఫుల్ ఫన్ అండ్ క్లీన్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ఈ సిరీస్ ను తెరకెక్కించారు. యాత్ర సిరీస్ సినిమాల డైరెక్టర్ మహి.వి.రాఘవ్‌ ఈ సిరీస్ కు క్రియేటర్ గా వ్యవహరించగా... తేజ కాకుమాను దర్శకత్వం వహించారు. గతడాది ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ ఫామ్‌ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ వచ్చి ప్రేక్షకులను ఆకట్టుకుంది.

సెంకడ్ సీజన్ రిలీజ్ కు ముహూర్తం ఫిక్స్ :ప్రస్తుత కాలంలో వెబ్ సిరీసుల్లో అసభ్యకర డైలాగులు, ఆశ్లీల సీన్లు ఉంటున్నాయి. అయితే ఇందులో అలాంటివేవీ లేవనే చెప్పాలి. క్లీన్ ఎంటర్ టైనర్ గా ఈ సిరీసును తెరకెక్కించారు. ఇక మొదటి సీజన్ ఎండింగ్ లోనే సీక్వెల్ ను అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సేవ్ ది టైగర్స్ సెకెండ్ సీజన్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని ఓటీటీ ప్రేక్షకులు ఎదురు చూశారు. ఇక ఎట్టకేలకు ఈ సెంకడ్ సీజన్ రిలీజ్ కు ముహూర్తం ఫిక్స్ అయ్యినట్లు తెలుస్తోంది.

ఫస్ట్ సీజన్ ఫ్రీగా స్ట్రీమింగ్...:తాజాగా సేవ్ ది టైగర్స్ సీజన్ 2 సిరీస్ స్ట్రీమింగ్ వివరాలపై మేకర్స్ సోషల్ మీడియా వేదికగా అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. అదేంటంటే.. మార్చి 10 వ‌ర‌కు సేవ్ ది టైగర్స్ సీజ‌న్ 1 ను డిస్నీ ప్ల‌స్ హాట్‌ స్టార్‌లో ఫ్రీగా చూడొచ్చని తెలిపారు. అంటే ఫస్ట్ సీజన్ ను ఫ్రీగా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. అంటే డిస్నీ ప్ల‌స్ హాట్‌స్టార్ స‌బ్‌స్కైబ‌ర్లు అంద‌రూ ఉచితంగా ఈ సిరీస్‌ను చూడొచ్చని తెలుస్తోంది. సేవ్ ది టైగ‌ర్స్ సీజ‌న్ 2 మార్చి 10 నుంచి డిస్నీ ప్ల‌స్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానున్నట్లు హింట్ ఇచ్చారు.

రెండో సీజన్ పై ఆసక్తి...:మార్చి 10వరకు సీజన్ 1ను ఫ్రీగా చూసేసి.. మార్చి 10న డిస్ని ప్లస్ హాట్ స్టార్ లో సీజన్ 2 స్ట్రీమింగ్ కానుంది. దీంతో ఫస్ట్ సీజన్ చూసిన వారంత సెకండ్ సీజన్ చూసేందుకు ఆసక్తి చూపుతారు. దీనిపై అధికారిక ప్రకటన త్వరలో రానుందని అంటున్నారు. ఇక సేవ్ ది టైగ‌ర్స్ వెబ్‌సిరీస్‌లో జోర్దార్ సుజాత‌, పావ‌ని గంగిరెడ్డి, దేవ‌యాని, హర్ష వర్దన్‌, శ్రీకాంత్ అయ్యాంగార్, గంగవ్వ, వేణు యెల్దండి, రోహిణీ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. మరి ఇంకేందుకు ఆలస్యం.. ఫస్ట్ సీజన్ మీరు చూడకపోతే.. ఫ్రీగా చూసేసి.. సెకండ్ సీజన్ కూడా చూసి ఎంజాయ్ చేయండి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X