30000 కోట్ల కుంభకోణం.. పూటకు తిండిలేని వ్యక్తి దేశంలోనే అతిపెద్ద స్కామ్.. ఆయన ఎవరో తెలుసా?

దేశంలో సంచలనం రేపిన కుంభకోణాల్లో స్టాంపు పేపర్ల స్కామ్ ఒకటి. స్టాంపు పేపర్ల కుంభకోణం దేశవ్యాప్తంగా దిగ్బ్రాంతికి గురిచేసింది. ఈ కుంభకోణంలో అబ్దుల్ కరీం తేల్గి ఆలియాస్ తేల్గి పేరు దేశంలో మార్మోగింది. సుధీర్ఘమైన దర్యాప్తులో ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఈ భారీ కుంభకోణానికి మూలాలు ఉన్నాయనే విషయం మరింత సంచలనం రేపింది. ఇలాంటి భారీ కుంభకోణం నేపథ్యంగా తెల్గీ జీవిత చరిత్ర ఆధరాంగా స్కామ్ 2003 త్వరలోనే ప్రసారం కాబోతున్నది. ఈ ఓటీటీ, తెల్గీ వ్యక్తిగత వివరాల్లోకి వెళితే..

అబ్దుల్ కరీం తేల్గి గురించిన వివరాల్లోకి వెళితే.. కర్ణాటకలోని ఖానాపూర్‌లో మధ్య దిగువ తరగతి కుటుంబంలో జన్మించారు. చిన్నతనంలో తండ్రి మరణించడంతో కుటుంబ పోషణ భారం తెల్గీపై పడింది. రైల్వే స్టేషన్‌లో పండ్ల అమ్ముతూ కుటుంబ పోషణ చేశారు. అలా పండ్లు అమ్ముతూ ప్రాథమిక విద్యను పూర్తి చేశారు. ఆ తర్వాత బతుకు తెరువు కోసం సౌదీ అరేబియాకు వెళ్లాడు.

Scam 2003 web Series on Abdul Karim Telgis 30,000 crore stamp paper scam to stream on SonyLiv

సౌదీ అరేబియాలో కొంత కాలం పనిచేసిన తర్వాత ఇండియాకు తిరిగి వచ్చి ముంబైకి మకాం మార్చాడు. ముంబైలో చేయడానికి ఉద్యోగం లభించకపోవడంతో పస్తులు ఉన్నాడు. ఆ తర్వాత ట్రావెల్ ఎజెన్సీలో పనిచేశాడు. ఆ సమయంలో నకిలీ ఇమ్మిగ్రేషన్ డాక్యుమెంట్లు తయారు చేసే పని చేయడం మొదలుపెట్టాడు. నకిలీ ఇమ్మిగ్రేషన్ డాక్యుమెంట్ల తయారీ చేస్తూ తొలిసారి 2001లో అరెస్ట్ అయ్యాడు.

నకిలీ ఇమ్మిగ్రేషన్ డాక్యుమెంట్ల కేసులో జైలులో శిక్ష అనుభవిస్తుండగా షేర్ పేపర్లు ఫోర్జరీ చేస్తూ అరెస్టైన రామ్ రతన్ సోని అనే స్టాంపు వెండర్‌తో పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత సోనితో కలిసి షేర్ మార్కెట్‌లోకి ప్రవేశించాడు. ఆ సమయంలో తక్కువ మోతాదులో ఎక్కువ డిమాండ్ ఉండే స్టాంపు పేపర్ల విషయంపై తెల్గీ దృష్టిపడింది.

దాంతో నాసిక్ నుంచి స్టాంపు పేపర్లు తయారు చేసే ప్రింటింగ్ మిషన్‌ను కొని తెచ్చారు. స్టాంప్ పేపర్లు తయారు చేస్తూ ప్రొడక్షన్ పెంచేందుకు భారీగా ప్రింటింగ్ మెషిన్లు కొన్నారు. ఆ క్రమంలో ఈ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. దాంతో 2001లో తొలిసారి అరెస్ట్ చేశారు.

Scam 2003 web Series on Abdul Karim Telgis 30,000 crore stamp paper scam to stream on SonyLiv

స్టాంపు పేపర్ల కుంభకోణంలో సంచలన విషయాలు బయటకు వచ్చాయి. దాదాపు 17 లక్షల స్టాంపు పేపర్లు అమ్మడం జరిగింది. దాదాపు 30000 కోట్ల రూపాయల కుంభకోణం జరిగింది అని దర్యాప్తులో తేలింది. ఈ కేసులో 30 ఏళ్ల శిక్ష పడింది. 2017లో పలు అవయవాలు పనిచేకపోవడంతో తేల్గి మరణించాడు.

ప్రస్తుతం తెల్గీ జీవితం ఆధారంగా రూపొందిన వెబ్ సిరీస్ స్కామ్ 2003 స్ట్రీమింగ్ కాబోతున్నది. ఈ వెబ్ సిరీస్‌కు దర్శకుడు హన్సల్ మెహతా దర్శకత్వం వహించాడు. సెప్టెంబర్ 2వ తేదీ నుంచి ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కానున్నది. అయితే ఈ వెబ్ సిరీస్‌లో ఆంధ్ర ప్రదేశ్‌లో జరిగిన అరెస్ట్‌ల గురించి ప్రస్తావిస్తారో లేదో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X