అది సినిమా కాదు.. బ్లూ ఫిల్మ్.. వెంకటేష్ సిరీస్ పై సీనియర్ నటుడి కామెంట్స్ వైరల్
టాలీవుడ్ స్టార్ హీరోలలో దగ్గుబాటి విక్టరీ వెంకటేష్ ఒకరు. ఎన్నో కుటుంబ కథా చిత్రాల్లో నటించిన ఆయన ఫ్యామిలీ హీరోగా పేరు తెచ్చుకున్నారు. స్టార్ ప్రొడ్యూసర్ కుమారుడిగా సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఆయన తన నటనతో ఎంతో మంది ఫ్యాన్స్ ను సంపాదించుకున్నారు. సాఫ్ట్ క్యారెక్టర్స్ చేస్తూ మంచి స్టార్ డమ్ అందుకున్నారు.
అయితే ఇటీవల కాలంలో ఆయన ఎక్కువగా మల్టీస్టారర్ చిత్రాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా ఓటీటీలోకి కూడా ఎంట్రీ ఇచ్చారు. వెంకటేష్ మొదటగా చేసిన వెబ్ సిరీస్ రానా నాయుడు ప్రస్తుతం వివాదాస్పదంగా మారింది. ఈ సిరీస్ పై సీనియర్ నటుడు శివకృష్ణ ఘాటుగా స్పందించారు.

బాబాయ్ అబ్బాయి కలిసి..
బాబాయ్ అబ్బాయి అయిన వెంకటేష్, దగ్గుబాటి రానా ఒకేసారి కలిసి ఓటీటీలోకి కాలు మోపారు. అలా వీళ్లిద్దరు డిజిటల్ ఎంట్రీ ఇచ్చిన వెబ్ సిరీస్ రానా నాయుడు. ఈ సిరీస్ లో రానా, వెంకటేష్ ఇద్దరు తండ్రీ కొడుకులుగా కలిసి నటించడం విశేషం. ఈ వెబ్ సిరీస్ ను ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్ ఫ్లిక్స్ నిర్మించగా.. సుపర్ణ్ వర్మ, కరణ్ అన్షుమన్ దర్శకత్వం వహించారు.

కీలక పాత్రల్లో వారు..
ఫ్యామిలీ ఎమోషన్స్ అండ్ క్రైమ్ డ్రామాగా తెరకెక్కిన రానా నాయుడు వెబ్ సిరీస్ పాపులర్ అమెరికన్ సిరీస్ 'రే డోనోవర్' కు ఇండియన్ అడాప్షన్ వెర్షన్ గా రూపొందింది. సుర్విన్ చావ్లా, ఆశిష్ విద్యార్థి, సుశాంత్ సింగ్, అభిషేక్ బెనర్జీ, ఆదిత్య మీనన్, ముకుల్ చద్దా తదితరులు కీలక పాత్రలు పోషించారు.
రానా నాయుడు వెబ్ సిరీస్ ను హిందీతోపాటు తెలుగు, తమిళంలో కూడా విడుదల చేశారు. మార్చి 10న నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది.

బూతులు చెప్పడం ఏంటీ..
అయితే రానా నాయుడు వెబ్ సిరీస్ పై తెలుగు ప్రేక్షకులు కాస్తా అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఇందులో ఎక్కువగా బూతులు, శృతిమించిన అడల్ట్ కంటెంట్ ఉందని ఆరోపిస్తున్నారు. అయితే సాధారణమై వెబ్ సిరీస్ లలో అలా ఉండటాన్ని యాక్సెప్ట్ చేసిన తెలుగు ప్రజలు ఫ్యామిలీ హీరోగా స్టార్ బ్రాండ్ తెచ్చుకున్న వెంకటేష్ తో అలా బూతులు చెప్పించడం తెలుగు ప్రేక్షకులు అంగీకరించలేక పోతున్నారు.

జనం ఎగబాకుతున్నారు..
తాజాగా రానా నాయుడు వెబ్ సిరీస్ పై సీనియర్ నటుడు శివకృష్ణ ఘాటు వ్యాఖ్యలు చేశారు. "నేను సెన్సార్ బోర్డ్ మెంబర్ గా ఉన్నప్పుడు ట్రైలర్, యాడ్ కంటెంట్ కు కూడా సెన్సార్ చేయాలంటూ సెంట్రల్ గరవర్నమెంట్ కి లెటర్ రాశాను. దూరదర్శన్ సహా ప్రైవేట్ ఛానెల్ లో వచ్చే సినిమాలను కూడా సెన్సార్ చేయాలన్నాను. మనం పద్ధతిగా సినిమాలు తీస్తుంటే ఇంగ్లీష్ వాడు అన్నీ తీసి పెట్టేస్తున్నాడు. దాంతో జనం అక్కడకు ఎగబాకుతున్నారు. ఇది అన్యాయమనే రూల్ పెట్టాను. కానీ అది పెద్దగా వర్కౌట్ కాలేదు" అని శివకృష్ణ తెలిపారు.

డబ్బులు పెట్టి వస్తారు.. కానీ..
"నేను రీసెంట్ గా ఓటీటీలో ఓ సినిమా చూశాను. నా పిల్లలు వస్తుంటే దాన్ని ఆఫ్ చేశాను. ఎందుకు చూశానురా దేవుడా అనిపించింది. ఆల్ మోస్ట్ అది బ్లూ ఫిల్మే. ఓటీటీలో అలాంటివి అవసరమా. ఓటీటీ కాదు వాడు బాబు ఎవడైనా సరే సెన్సార్ చేయాలి. అడల్ట్ కంటెంట్ ను థియేటర్స్ లో చూడాలనుకుంటే జనాలు డబ్బులు పెట్టి వస్తారు. కానీ ఓటీటీలో అలా కాదు. ఇంట్లోనే అమ్మా నాన్న ఉంటే ఒకడు రూమ్ లో టిఫిన్ తింటూ ఇవే చూస్తుంటాడు" అని శివకృష్ణ పేర్కొన్నారు.

తలుపులు తీసి చూడటమేంటీ..
"ఇవాళ భారతదేశంలో చాలమంది డ్రగ్స్ కు బానిసలు అయిపోయినా.. చిన్నవాళ్లు సెXలో పాల్గొంటున్నా.. వాళ్లు పాడయ్యారంటే ఈ ఓటీటీ సినిమాల వల్లనే. ఓటీటీకి సెన్సార్ ఉండాలి. పేరెందుకు చెప్పడం కానీ. అలాంటి కంటెంట్ ఉన్నప్పుడు ఫ్యామిలీతో కలిసి ఎలా చూస్తాం. ఆ సీన్ వస్తుందని ఎవరు ఊహిస్తారు. బెడ్ రూమ్ లో భార్యాభర్తలుంటారు.
కిచెన్ లో వంట చేస్తారు. అలాంటిది బెడ్ రూమ్ తలుపులు తీసేసి అందరూ చూడటమేంటి. మనం సాంప్రదాయం ఏంటీ. మనం హైందవ ధర్మం ఏంటీ. ఎలా బతికాం. ఎక్కడికి వెళ్తున్నాం. పిల్లలు పాడవుతున్నారు.
ఇలా అయితే దేశం నాశనం అవుతుంది" అని శివకృష్ణ చెప్పుకొచ్చారు. అయితే ఆయన పేరు చెప్పలేదు కానీ.. ఇన్ డైరెక్ట్ గా రానా నాయుడు సిరీస్ గురించే మాట్లాడారని టాక్ వినిపిస్తోంది.


Click it and Unblock the Notifications











