మూడేళ్ల తర్వాత OTTలోకి రాబోతున్న స్టార్ నటుడి కొడుకు సినిమా.. ఎలా చూడాలంటే?
చిన్న, పెద్ద అనే తేడా లేకుండా అనేక చిత్రాలు ఓటీటీల వేదికగా విడుదల అవుతూ సెన్సేషన్ క్రియేట్ చేస్తుంటాయి. ముఖ్యంగా బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచిన పెద్ద పెద్ద స్టార్ హీరోల సినిమాలు కూడా నెల కాకముందే ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతూ అందరినీ సర్ ప్రైజ్ చేస్తుండగా... పలు చిన్న చిత్రాలు మాత్రం థియేటర్లలో విడుదల అయిన చాలా రోజుల తర్వాత గానీ ఓటీటీల్లోకి రావట్లేదు. అలాంటి వాటిలో ముందుండే సినిమానే మనం మాట్లాడుకోబోయే చిత్రం. థియేటర్లలో విడుదల అయిన మూడేళ్లకు ఓటీటీలోకి రాబోతుందీ సినిమా. అదేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
శివాజీ రాజా తనయుడు హీరోగా ఓ సరికొత్త సినిమా తెరకెక్కించింది. ముఖ్యంగా విజయ్ రాజా హీరోగా చేసిన ఈ సినిమా పేరే "జెమ్". ఈ చిత్రంలో విజయ్ సరసన రాశీ సింగ్ హీరోయిన్ గా నటించగా.. సంపూర్ణేష్ బాబు, రచ్చ రవి, అజయ్, ఆర్జే హేమంత్, నక్షత్ర వంటి వాళ్ల ప్రధాన పాత్రల్లో నటించి మెప్పించారు. మహాలక్ష్మీ మూవీ మేకర్స్ బ్యానర్ పై పత్తికొండ కుమారస్వామి నిర్మించిన ఈ సినిమాకు సుశీల సుబ్రహ్మణ్యం దర్శకత్వం వహించాడు.

అదిరిపోయే యాక్షన్ ఎంటర్‌టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాను 2021వ సంవత్సరం సెప్టెంబర్ 17వ తేదీన థియేటర్లలో గ్రాండ్ గా విడుదల చేశారు. చిన్న సినిమా కావడం, హీరో కూడా కొత్త వాడే కావడంతో ఈ సినిమాకు పెద్దగా గుర్తింపు రాలేదు. థియేటర్లలోకి వచ్చి వెళ్లినట్లు కూడా చాలా మందికి తెలియలేదు. ఇలా ఆద్యంతం ఆకట్టుకునే కాన్సెప్ట్ తో వచ్చినా ప్రేక్షకులకు చేరువకాలేకపోవడంతో అంతా ఈ చిత్రం గురించి మర్చిపోయారు. కానీ తాజాగా ఈ సినిమా గురించి ఓ అదిరిపోయే న్యూస్ వెలుగులోకి వచ్చింది. ముఖ్యంగా ఈ సినిమాను ఓ ప్రముఖ ఓటీటీ సంస్థ డిజిటల్ స్ట్రీమింగ్ చేయబోతుంది.
ముఖ్యంగా ప్రముఖ ఓటీటీ సంస్థ అయిన ఈటీవీ విన్ ఈ సినిమా హక్కులను ఇటీవలే కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఏప్రిల్ 18వ తేదీ నుంచి ఈటీవీ విన్ వేదికగా స్ట్రీమింగ్ కూడా చేయబోతున్నట్లు ఎక్స్ వేదికగా ప్రకటించింది. మరో నాలుగు రోజుల్లో అందుబాటులోకి రాబోతున్న ఈ సినిమాను ఖాళీగా ఉన్న సమయంలో చూసి ఫుల్ గా ఎంజాయ్ చేయండి. వీకెండ్ కు కూడా కలిసి వస్తుంది కాబట్టి.. టైం పాస్ చేసేయొచ్చు.
అసలీ సినిమా కథేంటంటే.. ముఖ్యంగా ఈ సినిమాలో హీరో అయిన విజయ్ రాజా పేరు జెమ్. ఈయన ఓ అనాథ కాగా.. అనుకోని పరిస్థితుల్లో ఆపదలో ఉన్న అమ్మాయి శ్రీలక్ష్మి ( రాశి సింగ్)ని రక్షిద్దాం అనుకుంటాడు. అప్పుడే ఆమెతో ప్రేమలో పడతాడు. పెళ్లి కూడా చేసుకోవాలనుకోగా.. వారి వివాహం జరిగిందా లేదా అనేది అసలు కథ.


Click it and Unblock the Notifications











