Bigg Boss 7 Telugu: బిగ్‌బాస్ కంటెస్టెంట్ ఇంట తీవ్ర విషాదం.. ఎంట్రీ క్యాన్సిల్ చేసుకున్న నటి
ఇక మరికొద్ది గంటల్లో బిగ్ బాస్ షూటింగ్ మొదలు కానుంది. సెప్టెంబరు 3 వ తేదీన ప్రసారం కానున్న బిగ్ బాస్ షో... సెప్టెంబర్1,2వ తేదీల్లో షూటింగ్ జరుపుకోవాల్సి ఉంది. అయితే అందులో పాల్గొనే ఓ కంటెస్టెంట్ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆమె బిగ్ బాస్ హౌజ్ లోకి అడుగు పెట్టాల్సి ఉంది. కానీ ఇంతలోనే ఆమె తండ్రి మరణించారు. దీనితో బిగ్ బాస్ హౌజ్ ఎంట్రీ క్యాన్సిల్ అయింది. ఆ వివరాల్లోకి వెళితే....
తెలుగులో ఎంతో ప్రేక్షకాదరణ పొందిన షోల్లో బిగ్ బాస్ ఒకటి. ఇక ఈ రియాలిటీ షో.. ఇప్పటికే విజయవంతగా 6 సీజన్స్ పూర్తి చేసుకున్న ఈ షో... ఇప్పుడు 7వ షోలోకి అడుగుపెట్టనుంది. ఇప్పటికే కంటెస్టెంట్స్ ను ఫైనల్ కూడా చేశారు. కాసేపట్లో షూటింగ్ అనగా... ఓ కంటెస్టెంట్ ఇంట్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఇక ఆమె ఎంట్రీ క్యాన్సిల్ అయింది.

కర్ణాటక రాష్ట్రం బెంగళూరుకు చెందిన పూజా మూర్తి... తెలుగు సీరియల్స్ లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈమె కన్నడ సీరియల్స్ లో మొదట నటించగా... ఆ తర్వాత తెలుగులో గుండమ్మ కథ అనే సీరియల్ ద్వారా బుల్లితెరపై మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక ఈ సీరియల్ లో ఇద్దరు పిల్లల తల్లిగా కనిపిస్తూ.. లావుగా ఉన్న అమ్మాయి సంసారం ఎలా సాగిస్తుంది అనే కథాంశంతో సాగింది. జీ తెలుగులో ప్రసారం అయిన ఈ సీరియల్ కు మంచి టీఆర్పీ కూడా వచ్చేది.

ఇక యాంకర్ ప్రదీప్ మాచిరాజు హోస్ట్ చేస్తున్న క్వీన్ ప్రోగ్రామ్ లో కూడా ఈమె పాల్గొని.. మంచి పాపులారిటి అయితే సాధించుకుంది. ఇక ఈమెను ఈ సారి బిగ్ బాస్ సీజన్ 7లో తీసుకోవాలని అనుకున్నారు. ఆమెతో చర్చలు కూడా జరిపారు నిర్వాహకులు. అంతా సెట్ అయింది. ఇక మరి కొద్ది గంటల్లో హోజ్ లోకి ఎంట్రీ ఇవ్వాల్సి ఉంది. కానీ ఇంతలోనే ఆమె ఇంట తీవ్ర విషాదం నెలకొంది.

ఆమె బిగ్ బాస్ షో కోసం డ్యాన్స్ ప్రాక్టీస్ కూడా చేసిందట. అయితే చివరి నిముషంలో ఆమె తండ్రి మరణించినట్లుగా వార్త రావడంతో... షో క్యాన్సిల్ చేసుకుంది. ఈ విషయాన్ని తన ఇన్ స్టా గ్రామ్ వేదికగా ఓ పోస్టు పెట్టింది. తన తండ్రితో కలిసి ఉన్న ఫోటో షేర్ చేసి... తన తండ్రి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నానంటూ ఇన్ స్టా వేదికగా స్టోరీ పెట్టింది. ఇక వీలుంటే వెనక్కి వచ్చేయాలంటూ రాసుకొచ్చింది.

మీరు లేరనే ప్రతి సెకను ఫీల్ అవుతున్నాను.. మిమ్మల్ని ప్రతి రోజు ప్రేమిస్తూనే ఉంటాను.. ఏదో ఒక రోజు మిమ్మల్ని గర్వపడేలా చేస్తాను.. నాకు తెలిసి తెలియక చేసిన ఏదైనా పొరపాటు ఉంటే సారీ.. మీరు ఎప్పుడు నాతోనే ఉంటారు.. మీ ఆశీస్సులు కూడా నాతోనే ఉంటాయి... నా మీద... అమ్మ మీద మీ ఆశీస్సులు నిరంతరం ఉంటాయి... రెస్ట్ ఇన్ పీస్ డాడీ.. అంటూ సోషల్ మీడియా వేదికగా పూజా మూర్తి ఎమోషల్ అయింది. ప్రస్తుతం ఈ వార్త విని బిగ్ బాస్ లవర్స్ బాధపడుతున్నారు.


Click it and Unblock the Notifications











