twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Jawan సినిమాకు అమెజాన్ దిమ్మతిరిగే ఆఫర్.. విజయ్ వల్లే ఆ రేంజ్ లో ఓటీటీ రైట్స్?

    |

    బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ చాలా కాలం తర్వాత వరుసగా సినిమాలను లైన్లో పెట్టిన విషయం తెలిసిందే. ఇక తమిళ దర్శకుడు అట్లీ దర్శకత్వంలో జవాన్ అనే సినిమాను పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాపై అంచనాలు అయితే మామూలుగా లేవు. ఎందుకంటే తమిళ దర్శకుడు అట్లీ ఇదివరకే తమిళ సినిమాలతో తెలుగులో కూడా మంచి గుర్తింపు అందుకున్నాడు.

    ఇక అందులోనూ జవాన్ సినిమాలో నయనతార నటిస్తుండడం మరొక ముఖ్యమైన గెస్ట్ పాత్రలో విజయ్ నటిస్తూ ఉండడంతో జవాన్ సినిమాపై అంచనాలు తారస్థాయికి చేరుకున్నాయి. ఈ సినిమాను ఫ్యాన్ ఇండియా రేంజ్ కు తగ్గట్టుగానే వివిధ భాషల్లో విడుదల చేయబోతున్నారు. అయితే జవాన్ సినిమాకు సంబంధించిన ఓటీటీ హక్కుల కోసం కొన్ని ప్రముఖ సంస్థలు భారీ స్థాయిలో పోటీపడుతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా అమెజాన్ ప్రైమ్ అయితే ఈ సినిమా ఓటీటీ హక్కులను దక్కించుకునేందుకు భారీ ఆఫర్ కూడా ప్రకటించిందట.

    Shah Rukh Khan jawan movie mind blowing ott deals discussions started

    రీసెంట్ గా 100 కోట్ల వరకు చెల్లించడానికి ఆ సంస్థ ముందుకు వచ్చినట్లు ఒక టాక్ అయితే వినిపిస్తోంది. అయితే ముందుగానే నెట్ ప్లిక్స్ ఈ సినిమా అన్ని భాషల హక్కులను దక్కించుకునేందుకు 80 కోట్ల వరకు ఆఫర్ చేసినట్లు వార్తలు వచ్చాయి. ఇక ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ అంతకంటే ఎక్కువ స్థాయిలో రౌండ్ ఫిగర్ అమౌంట్ తో ఆఫర్ చేస్తూ ఉండటంతో నిర్మాతలు టెంప్ట్ అయ్యే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఏదేమైనా కూడా అమెజాన్ ప్రైమ్ అయితే ఈ సినిమాను ఎట్టి పరిస్థితుల్లో వదులుకోవద్దు అని ఫిక్స్ అయినట్లుగా తెలుస్తోంది.

    ఎందుకంటే విజయ్ కు సౌత్ ఇండస్ట్రీలో చాలా మంచి క్రేజ్ అయితే ఉంది. అలాంటి హీరో షారుక్ ఖాన్ సినిమాలో గెస్ట్ పాత్రలో కనిపిస్తున్నాడు అంటే తప్పకుండా సినిమా మరొక రేంజ్ లో ఉంటుంది అని అంచనాలు పెట్టుకుంటున్నారు. అందులోను అట్లీ దర్శకత్వం వహించడం నయనతార హీరోయిన్ గా ఉండడం మరొక మేజర్ ప్లస్ పాయింట్. కాబట్టి ఈ సినిమా అన్ని వర్గాలు వారిని ఆకట్టుకుంటుంది అని అమెజాన్ ప్రైమ్ ఓటిటి హక్కులపై దృష్టి పెట్టినట్లు సమాచారం. మరి ఈ సినిమా థియేట్రికల్ గా ఎలాంటి రికార్డులను క్రియేట్ చేస్తుందో చూడాలి.

    English summary
    Shah Rukh Khan jawan movie mind blowing ott deals discussions started
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X