OTTలోకి వచ్చేసిన బ్లాక్ బస్టర్ మూవీ... థియేటర్‌లో చూసినా మళ్లీ చూసేలా!

బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్... పఠాన్ తర్వాత జవాన్ సినిమాతో బాక్సాఫీస్ పై దండయాత్ర చేశాడు. ఇక ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.1100కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఇండియాన్ బాక్సాఫీస్ వద్ద ఎన్నో రికార్డులు కొల్లగొట్టిన ఈ సినిమా... ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చేసింది. మరి ఈ సినిమా థియేటర్లో చూసిన వాళ్లు కూడా చూసేలా కొత్తగా నెట్ ఫ్లిక్స్ లోకి అందుబాటులోకి వచ్చింది. అసలు ఈ సినిమా ఎక్కడ రిలీజ్ అవుతుంది.. కొత్తగా ఈ సినిమాకి ఏం యాడ్ చేశారు అనే వివరాలు ఈ స్టోరీలో చూద్దాం.

బాలీవుడ్ ఇండస్ట్రీ అంతా సౌత్ సినిమాలతో అల్లాడిపోతున్న సమయంలో... కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ ఎంట్రీ ఇచ్చాడు. పఠాన్ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఏకంగా వెయ్యి కోట్లకు పైగా వసూలు రాబట్టింది. ఇక ఈ సినిమాతో బాలీవుడ్ కు పూర్వ వైభవం తీసుకువచ్చాడు షారుఖ్. ఇక మళ్లీ జవాన్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

Shah Rukh Khan Nayanathara Jawan Extended Cut Movie Streaming Now on Netflix OTT HBD SRK Special

తమిళ దర్శకుడు అట్లీ, షారుఖ్ ఖాన్ కాంబోలో వచ్చిన జవాన్.. సెప్టెంబర్ 7వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఈ మూవీలో నయనతార హీరోయిన్ గా నటించింది. షారుఖ్ ను ఎదుర్కొనేందుకు తమిళ మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి విలన్ గా నటించాడు. ఇక ఈ మూవీలో ప్రియమణి, దీపికా పదుకునే, సంజయ్ దత్ వంటి స్టార్స్ కీలక పాత్రల్లో నటించారు. ఇక ఈ సినిమాకు అనిరుద్ సంగీతం అందించారు. ఈ మూవీని రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై గౌరీ ఖాన్ 300 కోట్ల రూపాయలతో నిర్మించారు.

Shah Rukh Khan Nayanathara Jawan Extended Cut Movie Streaming Now on Netflix OTT HBD SRK Special

జవాన్ సినిమా విడుదలకు ముందు నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి. టీజర్స్, ట్రైలర్స్ చూశాకా ఆ అంఛనాలు రెట్టింపు అయ్యాయి. ఈ మూవీకి ఓవర్సీస్‌లో వేసిన ప్రీమియర్స్ టాక్ ప్లస్ అయిందని చెప్పవచ్చు. ఇక ఇండియాలో కూడా అదే పాజిటివ్ టాక్ రావడంతో.. ఈ సినిమాకు ప్రేక్షకులు పట్టం కట్టారు. ఏకంగా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.1100 కోట్లను కొల్లగొట్టింది. బాక్సాఫీస్ వద్ద కింగ్ ఖాన్ రికార్డులు సృష్టించాడు.

ఇక ఈ మూవీ ఓటీటీ రిలీజ్ కోసం ఎంతగానో ప్రేక్షకులు ఎదురు చూశారు. ఇక అప్పట్లో జవాన్ ఓటీటీ వర్షన్ కొత్తగా ఉంటుందని దర్శకుడు చెప్పుకువచ్చాడు. థియేటర్లలో లేని సీన్స్ కూడా యాడ్ చేసి రిలీజ్ చేస్తామని తెలిపారు. దీంతో మరింత ఆసక్తి నెలకొంది. ఇక ఈ క్రమంలోనే ఈ సినిమాను ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ సంస్థ ఈ మూవీ డిజిటల్ రైట్స్‌ను భారీ రేటుకు కొనుగోలు చేసింది. థియేటర్లలో విడుదలైన 50 రోజుల తర్వాతనే ఈ చిత్రాన్ని ఓటీటీలో స్ట్రీమింగ్ చేసేలా నిర్మాతలు అగ్రిమెంట్ చేసుకున్నారు.

Shah Rukh Khan Nayanathara Jawan Extended Cut Movie Streaming Now on Netflix OTT HBD SRK Special

ఇక జవాన్ సినిమా మొత్తానికి కొత్తగా.. థియేటర్లో చూసినా.. మళ్లీ చూసేలా నవంబర్ 2 నుంచి నెట్ ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సినిమాను థియేటర్లలో చూపించిన వెర్షన్ కంటే ఎక్కువ కంటెంట్‌ తో తీసుకువచ్చారు. అంటే సినిమా హాళ్లలో ప్రదర్శించిన మూవీ కంటే ఎక్కువ నిడివితో ఇది స్ట్రీమింగ్ అవుతుంది.మీరు గనుక థియేటర్లో చూసినా సరే.. ఈ సినిమాను మళ్లీ చూసేయండి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X