Aryan Khan మరోసారి హాట్ టాపిక్‌గా షారుక్ కుమారుడు, కుమార్తె.. బాలీవుడ్‌లో టాప్ ట్రెండింగ్‌గా..

ముంబైలో డ్రగ్స్ కేసులో పట్టుబడి దేశవ్యాప్తంగా సంచలనం రేపిన షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ మరోసారి వార్తల్లో నిలిచాడు. ఈసారి డ్రగ్స్ విషయంలో కాకుండా కెరీర్ విషయంలో మీడియా పతాక శీర్షికలను ఆకర్షించాడు. త్వరలోనే సినీ రంగం ప్రవేశం చేయబోతున్నాడు. అయితే నటుడిగా కాకుండా ఆర్యన్ ఖాన్ డైరెక్టర్‌గా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. అయితే సినీ రంగంలో కాకుండా వెబ్ సిరీస్ ద్వారా సినీ రంగ ప్రవేశం చేయడం తాజాగా ట్విస్టుగా మారింది. ఈ వార్త వివరాల్లోకి వెళితే..

Suhana Khans OTT entry with Web series

ఆర్యన్ ఖాన్ తన కెరీర్‌ను ఆరంభించేందుకు సిద్దమయ్యాడు. ముంబైలోని ఓ స్టూడియోలో వెబ్ సిరీస్‌కు సంబంధించిన టెస్ట్ షూట్‌ను ఇటీవల వల చేశఆడు. త్వరలోనే వెబ్ సిరీస్‌కు పూర్తి స్థాయిలో డైరెక్ట్ చేయబోతున్నాడు అని బాలీవుడ్‌కు చెందిన ప్రముఖ పత్రిక కథనాన్ని వెల్లడించింది.

Shah Rukh Khans son Aryan Khan

ఆర్యన్ ఖాన్ గత శుక్ర, శనివారాల్లో టెస్ట్ షూట్ చేశాడు. అదే వెబ్ సిరీస్‌కు సంబంధించిన కీలక సన్నివేశాలకు త్వరలోనే దర్శకత్వం వహించబోతున్నాడు. సాంకేతిక నిపుణులను, నటీనటుల ఎంపిక ప్రక్రియ జరుగుతున్నది. తాజాగా జరిగిన టెస్ట్ షూట్‌లో మస్కా నటి ప్రిత్ కమానీ కనిపించారు. అయితే ఈ చిత్రంలో ప్రీత్ నటించనున్నారనే విషయం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

ఇక ఆర్యన్ ఖాన్ డైరెక్టర్‌గా ఎంట్రీ ఇవ్వబోతుంటే.. షారుఖ్ కూతురు సుహానా ఖాన్ ప్రముఖ డైరెక్టర్ రూపొందించే వెబ్ సిరీస్ ద్వారా నటిగా బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నది. ఈ వెబ్ సిరీస్‌లో అమితాబ్ మనవడు అగస్త్య నందా, శ్రీదేవి కుమార్తె ఖుషీ కపూర్ నటించడం విశేషంగా మారింది. దాంతో ఆర్యన్ ఖాన్, సుహానా ఖాన్ సోషల్ మీడియాలో ట్రెండింగ్గా మారింది.

ఇదిలా ఉండగా, కొద్ది నెలల క్రితం ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయి.. ఆ తర్వాత బెయిల్‌పై విడుదలైన సంగతి తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X