OTT: షారుక్ ఖాన్ కొడుకు ఓటీటీలోకి .. ఆర్యన్ ఖాన్ వెబ్ సిరీస్ రిలీజ్ డేట్ ఎప్పుడంటే?

బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ వారసుడు ఆర్యన్ ఖాన్ దర్శకత్వం వహిస్తున్న వెబ్ సిరీస్ ఏడాది కాలంగా షూటింగ్ జరుపుకుంటుంది. మరి ప్రస్తుతం ఈ వెబ్ సిరీస్ ఎక్కడిదాకా వచ్చింది అనే ఇంట్రెస్టింగ్ విషయంపై ఓ లుక్కేద్దాం.

సాధారణంగా స్టార్స్ వారసులంతా హీరోలు గానే ఎంట్రీ ఇవ్వాలని అనుకుంటారు. కానీ ప్రస్తుతం వస్తున్న కొత్త జనరేషన్ మాత్రం సరికొత్తగా ఆలోచిస్తుంది. స్టార్ కిడ్స్ అయితే హీరోలు మాత్రమే ఎందుకు కావాలి? అంటూ దర్శకత్వం వైపు కొత్తగా అడుగులు వేస్తున్నారు.

Shah rukh khan son Aryan Khan s Web Series into OTT Here is the release date details

ప్రస్తుతం కోలీవుడ్ దళపతి విజయ్ తనయుడు డైరెక్టర్ గా మారడానికి సన్నాహాలు చేసుకుంటున్న విషయం తెలిసిందే. ఇప్పుడు షారుఖ్ వారసుడు ఆర్యన్ ఖాన్ కూడా అదే బాటలో నడుస్తున్నాడు. దర్శకుడిగా తన టాలెంట్ ను ప్రూవ్ చేసుకోవడానికి ముందుగా వెబ్ సిరీస్ ను ఎంచుకున్నాడు ఆర్యన్.

అందులో భాగంగానే ఆర్యన్ ఖాన్ 'స్టార్‌డమ్‌' అనే సిరీస్‌కి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సిరీస్ గురించి తాజాగా కొత్త అప్‌డేట్ వచ్చింది. ఈ సిరీస్ చివరి దశ షూటింగ్ ఇటీవలే ప్రారంభమైంది. ఈ ఏడాది చివర్లో స్టార్‌డమ్‌ సిరీస్ విడుదలయ్యే అవకాశం ఉందని అంటున్నారు.

కొంతకాలం క్రితం ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో పట్టుబడ్డ సంగతి తెలిసిందే. ఈ కేసుపై సర్వత్రా చర్చ జరిగింది. ఈ ఘటన నుంచి ఆర్యన్ ఇప్పుడు పూర్తిగా కోలుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన సినిమా డైరెక్షన్ వైపు మళ్లాడు. 'స్టార్‌డమ్' సినిమా షూటింగ్ 2023 జూన్‌లో ప్రారంభమైంది.

ఇటీవల ఆర్యన్ ఖాన్ గురుగ్రామ్‌లోని రాయల్ పామ్స్ హోటల్ లో స్టార్ డమ్ షూటింగ్ కోసం జరిపారు. ఐదు రోజుల పాటు ఇక్కడే చిత్రీకరించారు. దీంతోపాటు అంధేరీ ఈస్ట్‌, మరికొన్ని దీవుల్లో షూటింగ్‌ జరిగింది. మే నెలాఖరు నాటికి షూటింగ్ పూర్తయ్యే అవకాశం ఉంది.

Shah rukh khan son Aryan Khan s Web Series into OTT Here is the release date details

స్టార్ డమ్ సిరీస్ లో ఆరు ఎపిసోడ్‌లు ఉంటాయి. అయితే ఇందులో ఎవరెవరు నటిస్తున్నారు అనే విషయాన్ని మాత్రం టించారనేది గోప్యంగా ఉంచారు. సమాచారం ప్రకారం షారుఖ్ ఖాన్, రణబీర్ కపూర్, రణవీర్ సింగ్, బాబీ డియోల్ అతిధి పాత్రల్లో నటించనున్నారు.

'రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్‌' పతాకంపై షారూఖ్‌ భార్య గౌరీ ఖాన్‌ ఈ సిరీస్ ను భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఏ ఓటీటీ స్టార్ డమ్ సిరీస్‌ని విడుదల చేయబోతున్నారు? అనేది ఆసక్తికరంగా మారింది. దర్శకత్వంతో పాటు ఆర్యన్ ఖాన్ బ్రాండెడ్ దుస్తుల స్టోర్ ను కూడా ప్రారంభించాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X