Dunki OTT: షారూక్ సినిమాకు ఓటీటీ డేట్ ఫిక్స్.. అందులో అందరికీ ఫ్రీగానే!
ఇండియన్ సినిమాపై కొందరు హీరోలు మాత్రమే ప్రభావాన్ని చూపిస్తూ దూసుకుపోతోన్నారు. అందులో బాలీవుడ్ బాద్‌షా షారూక్ ఖాన్ ఒకడు. విలక్షణమైన నటనతో పాటు విభిన్నమైన సినిమాలు చేస్తోన్న అతడు.. ఇప్పటికీ తన రేంజ్‌ను పెంచుకునే సినిమాలు చేస్తున్నాడు. దీనికితోడు ఈ మధ్య కాలంలో వరుసగా హిట్లను కొడుతూ ఫుల్ ఫామ్‌తో దూసుకుపోతోన్నాడు.
గత ఏడాది వరుసగా 'పఠాన్', 'జవాన్' వంటి బ్లాక్ బస్టర్ హిట్లు కొట్టిన షారూక్ ఖాన్.. గత డిసెంబర్ 'డంకీ' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. సెన్సేషనల్ డైరెక్టర్ రాజ్‌కుమార్ హిరాణీ తెరకెక్కించిన ఈ చిత్రం ఫుల్ లెంగ్త్ ఎమోషనల్ సబ్జెక్టుతో వచ్చింది. ఈ మూవీకి ప్రీమియర్స్ నుంచే మంచి టాక్ వచ్చింది. అదే ఇండియాలో కూడా కనిపించింది.

'డంకీ' మూవీకి డీసెంట్ టాక్ రావడంతో ప్రేక్షకుల నుంచి స్పందన భారీగానే లభించింది. ఫలితంగా ఈ చిత్రం ఫుల్ రన్‌లో రూ. 230 కోట్లు వరకూ నెట్ వసూళ్లను, రూ. 460 కోట్లు వరకూ గ్రాస్ కలెక్షన్లను రాబట్టింది. తద్వారా క్లీన్ హిట్‌గా నిలవడంతో పాటు లాభాలను కూడా అందుకుంది. అలాగే, షారూక్ ఖాతాలో హ్యాట్రిక్ హిట్‌గానూ రికార్డును నెలకొల్పింది.
విభిన్నమైన కాన్సెప్టుతో రూపొందిన 'డంకీ' మూవీపై నెలకొన్న అంచనాల కారణంగా.. దీని డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులకు తీవ్ర స్థాయిలో పోటీ నెలకొంది. అందుకు అనుగుణంగానే ఓటీటీ దిగ్గజం జియో సినిమా సంస్థ ఈ మూవీ డిజిటల్ రైట్స్‌ను ఏకంగా రూ. 180 కోట్ల రేటుకు దక్కించుకుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా స్ట్రీమింగ్‌పై క్లారిటీ వచ్చేసింది.
షారూక్ ఖాన్ నటించిన 'డంకీ' మూవీ స్ట్రీమింగ్ ఎప్పుడో అవుతుందని అంతా అనుకున్నారు. కానీ, ఊహించని విధంగా ఈ చిత్రాన్ని జియో సంస్థ అందుబాటులోకి తీసుకు రాలేదు. అయితే, తాజా సమాచారం ప్రకారం.. ఇది ఫిబ్రవరి 16వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కాబోతుందట. అంతేకాదు, జియో సినిమా ఈ చిత్రాన్ని ఫ్రీగానే అందరికీ చూపించబోతుందని కూడా తెలుస్తోంది.

ఇదిలా ఉండగా.. 'డంకీ' మూవీని రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్స్, రాజ్‌కుమార్ హిరాణీ ఫిల్మ్స్, జియో స్టూడియో బ్యానర్లపై గౌరీ ఖాన్, రాజ్‌కుమార్ హిరాణీ, జ్యోతి దేశ్‌పాండేలు నిర్మించారు. ఇందులో తాప్సీ పన్ను, విక్కీ కౌశల్ వంటి ప్రముఖులు కీలక పాత్రలు చేశారు. ఈ చిత్రానికి ప్రీతమ్, అమాన్ సంగీతాన్ని సమకూర్చారు.


Click it and Unblock the Notifications











