Dunki OTT: కొత్త ఓటీటీలో షారూక్ సినిమా.. అన్ని రోజులకే స్ట్రీమింగ్ అయ్యేలా కోట్ల డీల్
దాదాపు మూడున్నర దశాబ్దాలుగా బాలీవుడ్‌లో సినిమాలు చేస్తున్నా.. దేశ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకుని పాన్ ఇండియా స్టార్‌గా వెలుగొందుతోన్నాడు బాద్‌షా షారూక్ ఖాన్. చాలా కాలం పాటు ఫ్లాపుల పరంపరతో ఇబ్బంది పడిన అతడు.. ఈ ఏడాది ఆరంభంలో వచ్చిన 'పఠాన్'తో మరోసారి హిట్ ట్రాక్ ఎక్కాడు. అదే సమయంలో కెరీర్‌లోనే హయ్యెస్ట్ కలెక్షన్లను సాధించాడు. ఈ ఊపులోనే ఇటీవలే 'జవాన్'తో వచ్చి మరో క్రేజీ హిట్‌ను అందుకున్నాడు. ఇలా యమ ఫామ్‌లో ఉన్న షారూక్ ఇప్పుడు 'డంకీ' అనే మూవీతో ఆడియెన్స్ ముందుకొచ్చాడు.
బాలీవుడ్ బాద్‌షా షారూఖ్ ఖాన్ హీరోగా.. సెన్సేషనల్ డైరెక్టర్ రాజ్‌కుమార్ హిరాణీ తెరకెక్కించిన చిత్రమే 'డంకీ'. ఫుల్ లెంగ్త్ ఎమోషనల్ సబ్జెక్టుతో రూపొందిన ఈ మూవీకి అమెరికాలోని ప్రీమియర్స్ నుంచే మంచి టాక్ వచ్చింది. అలాగే, ఇండియాలో కూడా అదే కనిపిస్తోంది. అందుకు అనుగుణంగానే ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి స్పందన భారీగానే దక్కుతోంది. నార్త్ అండ్ సౌత్‌లో ఈ సినిమా షోలకు బుకింగ్స్ బాగున్నాయి. దీంతో ఈ మూవీకి డీసెంట్ ఓపెనింగ్స్ వచ్చే ఛాన్స్ ఉంది. ఈ నేపథ్యంలో తాజాగా 'డంకీ' మూవీ ఓటీటీ వివరాలు రివీల్ అయ్యాయి.

విభిన్నమైన కాన్సెప్టుతో రూపొందిన 'డంకీ' మూవీపై నెలకొన్న అంచనాల కారణంగా.. దీని డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులకు తీవ్ర స్థాయిలో పోటీ నెలకొంది. అందుకు అనుగుణంగానే ఓటీటీ దిగ్గజం జియో సినిమా సంస్థ ఈ మూవీ డిజిటల్ రైట్స్‌ను ఏకంగా రూ. 180 కోట్ల రేటుకు దక్కించుకుంది. అంతేకాదు, థియేటర్లలో విడుదలైన 30 రోజుల తర్వాతనే ఈ చిత్రాన్ని ఓటీటీలో స్ట్రీమింగ్ చేసేలా నిర్మాతలు డీల్ చేసుకున్నారట. అంటే డిసెంబర్ 21న విడుదలైన 'డంకీ' జనవరి మూడో వారం తర్వాత స్ట్రీమింగ్‌కు వస్తుందని సమాచారం.

ఇదిలా ఉండగా.. 'డంకీ' మూవీని రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్స్, రాజ్‌కుమార్ హిరాణీ ఫిల్మ్స్, జియో స్టూడియో బ్యానర్లపై గౌరీ ఖాన్, రాజ్‌కుమార్ హిరాణీ, జ్యోతి దేశ్‌పాండేలు నిర్మించారు. ఇందులో తాప్సీ పన్ను, విక్కీ కౌశల్ వంటి ప్రముఖులు కీలక పాత్రలు చేశారు. ఈ చిత్రానికి ప్రీతమ్, అమాన్ సంగీతాన్ని అందించారు.


Click it and Unblock the Notifications











