ఓటీటీలోకి వచ్చేసిన 470 కోట్ల సినిమా.. ఈ బ్లాక్ బస్టర్ మూవీని ఎందులో చూడాలంటే!

ఒకటి కాదు.. రెండు కాదు.. దాదాపు మూడున్నర దశాబ్దాలుగా ఇండియన్ సినిమాలతో తనదైన మార్కును చూపిస్తూ.. బడా హీరోగా దూసుకుపోతోన్నాడు బాలీవుడ్ బాద్‌షా షారూక్ ఖాన్. విలక్షణమైన నటనతో ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకున్న అతడు.. వరుసగా సినిమాలు చేస్తున్నాడు. ఈ మధ్య కాలంలో అయితే హిట్లు మీద హిట్లు కొడుతూ దూసుకుపోతోన్నాడు.

2023లో ఏకంగా 'పఠాన్', 'జవాన్' వంటి బ్లాక్ బస్టర్ సక్సెస్‌లు సాధించిన షారూక్ ఖాన్.. డిసెంబర్‌లో 'డంకీ' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేశాడు. లెజెండరీ డైరెక్టర్ రాజ్‌కుమార్ హిరాణీ తెరకెక్కించిన ఈ చిత్రం ఫుల్ లెంగ్త్ ఎమోషనల్ కంటెంట్‌తో వచ్చింది. ఈ క్రేజీ సినిమాకు ప్రీమియర్స్ నుంచే మంచి టాక్ వచ్చిన విషయం తెలిసిందే.

Shah Rukh Khan Starrer Dunki Movie Digital Streaming Started

షారూక్ ఖాన్ నటించిన 'డంకీ' మూవీకి డీసెంట్ టాక్ రావడంతో ఆడియెన్స్ రెస్పాన్స్ భారీగానే లభించింది. ఫలితంగా ఈ చిత్రం ఫుల్ రన్‌లో రూ. 230 కోట్లు వరకూ నెట్ వసూళ్లను, రూ. 470 కోట్లు వరకూ గ్రాస్ కలెక్షన్లను రాబట్టింది. తద్వారా క్లీన్ హిట్‌గా నిలవడంతో పాటు లాభాలను కూడా అందుకుంది. అలాగే, షారూక్ ఖాతాలో హ్యాట్రిక్‌ హిట్‌ను కూడా ఇది అందించింది.

ఎమోషనల్ కంటే మెసేజ్ ఓరియెంటెడ్ కాన్సెప్టుతో రూపొందిన 'డంకీ' మూవీపై నెలకొన్న అంచనాల కారణంగా.. దీని డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులకు తీవ్ర స్థాయిలో పోటీ నెలకొంది. అందుకు అనుగుణంగానే ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్‌ సంస్థ ఈ మూవీ డిజిటల్ రైట్స్‌ను ఏకంగా రూ. 180 కోట్ల రేటుకు దక్కించుకుంది. కానీ, ఈ మూవీ స్ట్రీమింగ్‌పై మాత్రం ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.

Shah Rukh Khan Starrer Dunki Movie Digital Streaming Started

షారూక్ ఖాన్ నటించిన 'డంకీ' మూవీని నెట్‌ఫ్లిక్స్ సంస్థ తాజాగా అందుబాటులోకి తీసుకు వచ్చింది. ఎలాంటి ప్రకటన లేకుండానే సడన్‌దా దీన్ని స్ట్రీమింగ్ చేస్తూ సదరు సంస్థ అభిమానులను సర్‌ప్రైజ్ చేసేసింది. ఇక, ఇందులో పొడిగించిన వెర్షన్‌ను తీసుకు వచ్చినట్లు తెలిసింది. అలా ఇందులో కొన్ని సీన్స్‌ను కూడా యాడ్ చేశారని అంటున్నారు.

ఇదిలా ఉండగా.. 'డంకీ' మూవీని రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్స్, రాజ్‌కుమార్ హిరాణీ ఫిల్మ్స్, జియో స్టూడియో బ్యానర్లపై గౌరీ ఖాన్, రాజ్‌కుమార్ హిరాణీ, జ్యోతి దేశ్‌పాండేలు నిర్మించారు. ఇందులో తాప్సీ పన్ను, విక్కీ కౌశల్ వంటి ప్రముఖులు కీలక పాత్రలు చేశారు. ఈ చిత్రానికి ప్రీతమ్, అమాన్ సంగీతాన్ని అందించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X