Jawan OTT: ఫేమస్ ఓటీటీలో జవాన్ మూవీ.. స్ట్రీమింగ్ డేట్ విషయంలో నిరాశే

ఇండియాలో ఇప్పుడు చాలా మంది నేషనల్ రేంజ్ స్టార్లు ఉన్నారు. కానీ, చాలా కాలం క్రితమే ఈ స్థాయికి చేరుకోవడంతో పాటు ఎన్నో ఘనతలు, రికార్డులను క్రియేట్ చేసిన హీరోనే బాలీవుడ్ బాద్‌షా షారూఖ్ ఖాన్. ఒకప్పుడు వరుస హిట్లతో సత్తా చాటిన ఆయన.. చాలా కాలం పాటు ఫ్లాపుల పరంపరతో ఇబ్బంది పడ్డాడు. ఈ పరిస్థితుల్లోనే 'పఠాన్'తో అదిరిపోయే కమ్‌బ్యాక్ ఇచ్చాడు. ఈ జోష్‌లోనే షారూఖ్ ఖాన్ ఇప్పుడు 'జవాన్' అనే సినిమాను చేశాడు. ఆరంభంలోనే ఎన్నో అంచనాలను ఏర్పరచుకున్న ఈ చిత్రం తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

బాలీవుడ్ బాద్‌షా షారూఖ్ ఖాన్ హీరోగా.. కోలీవుడ్ సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అట్లీ తెరకెక్కించిన చిత్రమే 'జవాన్'. ఫుల్ లెంగ్త్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ మూవీకి అమెరికాలోని ప్రీమియర్స్ నుంచే మంచి టాక్ వచ్చింది. అలాగే, ఇండియాలో కూడా అదే కనిపిస్తోంది. అందుకు అనుగుణంగానే ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి స్పందన భారీ స్థాయిలోనే దక్కుతోంది. నార్త్ అండ్ సౌత్‌లో ఈ సినిమా షోలకు బుకింగ్స్ బాగున్నాయి. దీంతో ఈ మూవీకి ఓపెనింగ్స్ బాగానే వచ్చే ఛాన్స్ ఉంది. ఈ నేపథ్యంలో తాజాగా 'జవాన్' మూవీ ఓటీటీ వివరాలు రివీల్ అయ్యాయి.

Shah Rukh Khan Starrer Jawan Movie Digital Streaming Partner Details

ఫుల్ లెంగ్త్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన 'జవాన్' మూవీపై నెలకొన్న అంచనాల కారణంగా.. దీని డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులకు తీవ్ర స్థాయిలో పోటీ నెలకొంది. అందుకు అనుగుణంగానే ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ సంస్థ ఈ మూవీ డిజిటల్ రైట్స్‌ను ఫ్యాన్సీ రేటుకు దక్కించుకుంది. అంతేకాదు, థియేటర్లలో విడుదలైన 50 రోజుల తర్వాతనే ఈ చిత్రాన్ని ఓటీటీలో స్ట్రీమింగ్ చేసేలా నిర్మాతలు డీల్ చేసుకున్నారట. అంటే సెప్టెంబర్ 7న విడుదలైన 'జవాన్' నవంబర్ మొదటి వారంలో స్ట్రీమింగ్‌కు వస్తుందని సమాచారం.

Shah Rukh Khan Starrer Jawan Movie Digital Streaming Partner Details

ఇదిలా ఉండగా.. 'జవాన్' మూవీని రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై గౌరీ ఖాన్ నిర్మించారు. ఇందులో నయనతార, విజయ్ సేతుపతి, ప్రియమణి వంటి ప్రముఖులు కీలక పాత్రలు చేశారు. దీపిక పదుకొనే స్పెషల్ రోల్‌లో కనిపించింది. ఈ చిత్రానికి అనిరుథ్ రవిచందర్ సంగీతాన్ని అందించాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X