Jawan OTT: జవాన్ మూవీ ఓటీటీ డేట్ ఫిక్స్.. థియేటర్ వెర్షన్ కాకుండా కొత్తగా!
హిందీ చిత్ర పరిశ్రమలో సుదీర్ఘ కాలంగా స్టార్‌గా హవాను చూపిస్తూ.. ఇప్పటికీ తన రేంజ్‌ను పెంచుకుంటూనే వెళ్తున్నాడు బాలీవుడ్ బాద్‌షా షారూక్ ఖాన్. చాలా కాలం పాటు ఎన్నో హిట్లను అందుకున్న అతడు.. ఈ మధ్య ఫ్లాపుల పరంపరతో ఇబ్బంది పడ్డాడు. ఇలాంటి పరిస్థితుల్లోనే గత జనవరిలో 'పఠాన్' అనే సినిమాతో అదిరిపోయే కమ్‌బ్యాక్ అయ్యాడు. ఈ ఉత్సాహంతోనే ఇటీవలే షారూక్ 'జవాన్' అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. భారీ అంచనాలతో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్‌పై భారీ స్థాయిలో ప్రభావాన్ని చూపించింది.
బాలీవుడ్ బాద్‌షా షారూక్ ఖాన్ హీరోగా.. కోలీవుడ్ సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అట్లీ తెరకెక్కించిన యాక్షన్ మూవీనే 'జవాన్'. ఈ మూవీకి ఓవర్సీస్‌లో వేసిన ప్రీమియర్స్ నుంచే మంచి టాక్ వచ్చింది. అదే ఇండియాలోనూ కంటిన్యూ అవడంతో ప్రేక్షకుల నుంచి స్పందన భారీ స్థాయిలోనే దక్కుతోంది. ఇలా ఈ చిత్రం ఇప్పటి వరకూ 1100 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్‌ను వసూలు చేసి ఎన్నో రికార్డులను బ్రేక్ చేసింది. అలాగే, రూ. 600 కోట్లు పైగా నెట్ వసూళ్లను కూడా అందుకుంది. దీంతో ఈ మైలురాళ్లను చేరిన ఏకైక హిందీ చిత్రంగా చరిత్రను సృష్టించింది.

క్రేజీ కాంబోలో యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన 'జవాన్' మూవీపై నెలకొన్న అంచనాల కారణంగా.. దీని డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులకు తీవ్ర స్థాయిలో పోటీ నెలకొంది. అందుకు అనుగుణంగానే ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ సంస్థ ఈ మూవీ డిజిటల్ రైట్స్‌ను రికార్డు రేటుకు దక్కించుకుంది. అంతేకాదు, థియేటర్లలో విడుదలైన 50 రోజుల తర్వాతనే ఈ చిత్రాన్ని ఓటీటీలో స్ట్రీమింగ్ చేసేలా నిర్మాతలు డీల్ చేసుకున్నారట.
అందుకు అనుగుణంగానే ఈ మూవీని నవంబర్ 2 నుంచి స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు తెలిసింది. దీనిపై త్వరలోనే ప్రకటన రాబోతుందనే టాక్ వినిపిస్తోంది. అంతేకాదు, దీన్ని థియేటర్లలో చూపించిన వెర్షన్ కంటే ఎక్కువ కంటెంట్‌తో తీసుకు రాబోతున్నట్లు కూడా తెలుస్తోంది. అంటే దానికంటే ఎక్కువ నిడివితో ఇది స్ట్రీమింగ్ కాబోతుందన్న మాట.

ఇక, 'జవాన్' మూవీని రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై గౌరీ ఖాన్ నిర్మించారు. ఇందులో నయనతార, విజయ్ సేతుపతి, ప్రియమణి వంటి ప్రముఖులు కీలక పాత్రలు చేశారు. దీపిక పదుకొనే స్పెషల్ రోల్‌లో కనిపించింది. ఈ చిత్రానికి అనిరుథ్ రవిచందర్ సంగీతాన్ని సమకూర్చాడు.


Click it and Unblock the Notifications











